హైదరాబాద్‌లో పెప్‌ ఫోటో సమ్మిట్‌ 2019

0

  • నార్సింగి లోని ఓం కన్వెన్షన్‌ లో 2019 మే 3 నుంచి 5 వరకు

హైదరాబాద్‌: ప్రపంచంలోని ప్రముఖ ఫోటోగ్రఫీ ఫెస్టివల్స్‌ లో ఒకటైన పెప్‌ ఫోటో సమ్మిట్‌ 2019 నాలుగో ఎడిషన్‌ హైదరాబాద్‌ లోని నార్సింగి లోని ఓం కన్వెన్షన్‌ లో 3 నుంచి 5 వరకు జరుగనుంది. ఈ ఆసియా అతిపెద్ద ఫోటో గ్రఫీ కన్వెన్షన్‌ కు సమ్మిట్‌ పార్ట్‌ నర్స్‌ గా సోనీ మరియు ఫుజీ ఫిల్మ్‌ వ్యవహరిస్తున్నాయి. ఫోటోగ్రఫీ లో ఏబీసీ (ఆర్ట్‌, బిజినెస్‌ అండ్‌ క్రాఫ్ట్‌) నేర్చుకునేందుకు పెప్‌ అనేది ఆసియాకు చెందిన అతిపెద్ద వేదికగా ఉంటోంది. సుమారు 2050 మంది అనుభవజ్ఞులైన ఫోటోగ్రాఫర్లు ఈ కన్వెన్షన్‌ కు హాజరు కానున్నారు. జెర్రీ జియోనిస్‌, బ్రెయిన్‌ స్మిత్‌, ఇరా బ్లాక్‌ వంటి వారితో పాటు జెష్‌ డి రాక్స్‌, మౌరిసియో అరియస్‌, బ్రెండాన్‌ డిక్లెర్క్‌, రాబర్ట్‌ వాలెజ్‌ జుయెలా తదితరులు ఈ సందర్భంగా జరిగే సదస్సుల్లో పాల్గొననున్నారు. ఈ ఏడాది పెప్‌ లో పెటె సౌజా, లిండ్‌ సే అడెర్‌, పూజా దింగ్రా వంటి సెలెబ్రెటీలతో పాటుగా 9 దేశాలకు చెందిన 102 నగరాల నుంచి ఫోటోగ్రాఫర్లు ఇందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సోనీ ఇండియా ప్రై.లి. డిజిటల్‌ ఇమేజింగ్‌ బిజినెస్‌ హెడ్‌ హిరొయుకి టొకొనొ మాట్లాడుతూ పెప్‌ అనేది ప్రపంచపు అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్స్‌ లో ఒకటిగా అభివర్ణించారు. ఫుజి ఫిల్మ్‌ ఇండియా ఎలక్ట్రానిక్‌ ఇమేజింగ్‌ డివిజన్‌ (ఈఐడి) నేషనల్‌ బిజినెస్‌ మేనేజర్‌ అరుణ్‌ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ కళ పట్ల అంకితభావంతో కూడిన జట్టును ఈ ప్రదర్శనకు పంపడం తమకెంతో ఆనందదాయకమని అన్నారు. ఈ మూడు రోజుల ప్రదర్శనలో భాగంగా చర్చలు, తరగతులు లాంటివి జరుగనున్నాయి. ప్రదర్శన తరువాత మే 6,7 తేదీల్లో రోజంతా కూడా ఫోటోగ్రఫీ వర్క్‌ షాప్స్‌ కూడా జరుగనున్నాయి.

మిగతా వివరాల కోసం సంప్రదించండి, ప్రశాంత్‌ జైన్‌ 9885043038

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here