Featured

జిహెచ్‌ఎంసి సౌత్‌ జోన్‌లో ఫలహారంగా ప్రజా ధనం దోపిడ

అవసరం ఉన్న లేకున్నా, డబ్బుల అవసరం ఉంటే చాలు నామినేషన్ల రూపంలో పనులు కేటాయించి ,పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే నిధుల దోపిడీ. తాము కోరినంత ముడుపులు చెల్లించే కాంట్రాక్టర్లకు అధిక పనులు కేటాయించడం సాధారణ విషయంగా చలామణి అవుతుంది. లక్షకు పైగా వ్యయం అయ్యే పనులను ముక్కలుగా విడగొట్టి నామినేషన్‌ రూపంలో అనుచర వర్గానికి కట్టబెట్టడం అధికారుల అవినీతికి పరాకాష్ట గా మారింది. ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టి ,ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.

హౖదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): రాజధాని నగరంలో పన్నుల పేరున ప్రజలు చెల్లించే నిధులను, నామినేషన్‌ రూపంలో ఫలహా రంగా పంచుకుంటున్న జిహెచ్‌ఎంసి అధికారుల అవినీతి సౌత్‌ జోన్‌ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంవత్స రం సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు సౌత్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ అత్యవసర పనుల నిమిత్తం కేటాయించిన నిధుల ప్రవాహం పై పలు అనుమానాలు కలుగుతున్నాయి. లక్ష రూపాయల లోపు పనులను టెండర్లు పిలవకుండానే కేటాయించే అధికారం జోనల్‌ కమిషనర్‌ కు ఉండడంతో అవసరం ఉన్నా లేకున్నా తమకు ముడుపులు చెల్లించే కాంట్రాక్టర్లను పిలిపిం చుకొని పనులు కేటాయించడం సర్వసాధారణంగా మారింది. సర్కిల్‌ పరిధిలో నామినేషన్‌ పనుల వ్యవహారం, డబ్బులు అందిం చే ఏటీఎంగా మారడంతో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే నిధులతో తమ ఆస్తులను పెంచుకుంటున్నారని ఆరోపణ లున్నా యి. అవసరం ఉన్న లేకున్నా తమకు డబ్బులు అవసరం ఉంటే చాలు పండుగలు, అత్యవసర పనుల పేరుతో తాత్కాలి కంగా రోడ్ల నిర్మాణాలు, విద్యుత్‌ దీపాలంకరణలు , రహదారుల పైన గుంతలు పూడ్చడం ,సిసి రోడ్ల నిర్మాణం పార్కుల అభివద్ధి, వర్ష పునీటిని తీయడానికి, నాలాల మరమ్మతులు తదితర పనుల కోసం ఏకపక్షంగా కేటాయించడం పరిపాటిగా మారిందని విమ ర్శలు ఉన్నాయి. గత సెప్టెంబర్‌ నెలలో అబ్దుల్‌ రజాక్‌ అనే కాంట్రాక్టర్కు విద్యుత్‌ దీపాల అలంకరణ హైమాజ్డ్‌ లైట్ల కోసమని 125 పనులను అప్పగించారు. కొన్ని ప్రాంతాలలో కొన్ని పనుల కోసం లక్షలకు పైగా చెల్లించి రావడంతో ఆ పనులను రెండుగా విడగొట్టి అదే కాంట్రాక్టర్కు నామినేషన్‌ రూపంలో కేటాయిస్తుం ది. మరికొన్ని ప్రాంతాలలో చిన్నపాటి గుంతలను పూడ్చేందుకు గాను వేలాది రూపాయలను కేటాయించడం విశేషంగా చెప్పుకో వచ్చును. అత్యవసర పనుల కోసం అని చెప్పి పనుల అంచనాలు వేయడం, పనులు పూర్తిచేసిన తర్వాత సరైన తనిఖీ లు, నాణ్య తను పరిశీలించికపో వడంతో ప్రజాధనాన్ని అధికా రులు ఇషా ్టరాజ్యంగా వాడుకోవడం సాధారణంగా మారింది. నామినేషన్‌ రూపంలో కేటాయించే పనులలో గమ్మత్తైన విష యం ఏమిటంటే ఒక కాంట్రాక్టర్కు చిన్న పెద్ద పనులకు కలుపుకొని ఇచ్చిన 125 పనులకుగాను అధిక సార్లు 43 వేల 700 వందల చిల్లర రూపా యలను కేటాయిస్తూ లెక్కలను తేల్చారు, మొత్తం మీద జిహెచ్‌ ఎంసి సౌత్‌ జోన్‌లో నామినేషన్ల రూపంలో చేస్తున్న పనుల్లో అవి నీతి మితిమీరి, ఈ విధంగా చేసే పనులలో నాణ్యత పూర్తిగా కరువైందని జిహెచ్‌ఎంసిలో నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న అధికారులు విచారం వ్యక్తం చేయడం గమ నార్హం. రాష్ట్ర ప్రభు త్వం హైదరాబాద్‌ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు నిధుల కొరత లేకుండా చూస్తుండగా చాపకింద నీరులా అధికా రులు అవినీతి ముసుగేసుకొని ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శలున్నాయి. ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నిధులను సరైన రీతిలో ఖర్చయ్యే విధంగా చూడవలసిన బాధ్యత ప్రభు

జుడిషియల్‌ విచారణకు బిజెపి డిమాండ్‌

జిహెచ్‌ఎంసి సౌత్‌ జోన్‌లో నామినేషన్‌ పనుల పేరుతో నిధులు గోల్మాల్‌ చేసిన అధికారులను తక్షణం విధుల నుంచి తొలగించి జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని బిజెపి నగర నాయకుడు పి వెంకటరమణ డిమాండ్‌ చేశారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బులను అధికారులు తమ విలాసాల కోసం అవినీతి రూపంలో వాడుకోవడం దురద ష్టకరమని ఆయన విచారం వ్యక్తపరిచారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల డబ్బును దుర్విని యోగం చేస్తున్న అధికారులకు అండగా నిలుస్తూ రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు ఓఎస్‌డిగా ప్రమోషన్‌ ఇచ్చి సత్కరిం చడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిం చారు. సెప్టెంబర్‌ నెలలో నామినేషన్‌ల రూపంలో కేటాయించిన పనులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close