Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలు

కలకలం రేపుతున్న ‘కరోనా’

జెట్‌స్పీడ్‌తో ప్రపంచదేశాలకు వ్యాప్తి

చైనాలో 106కు చేరిన మృతుల సంఖ్య

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా మృతుల సంస్థ 106కు చేరింది. దాదాపు 4వేల మందికిపైగా కరోనా వ్యాదితో బాధపడుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా సోకిన బాధితులు నుమోనియా వ్యాధితో ప్రాణా లు కొల్పొతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలునగరాలకు రవాణా వ్యవస్థను నిలిపివేసింది. కాగా ప్రత్యేక వార్డుల ద్వారా బాధితులకు చికిత్స నందిస్తున్నారు. కరోనా భారత్‌ కు వ్యాపించినట్టు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. తాజాగా బీహర్‌ లో ఓ యువ తికి కరోనా వైరస్‌ లక్షణాలు బయట పడ్డాయి. చైనా, హాంగ్‌ కాంగ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో భయాందోళనలు గురవుతున్నారు. టిబెట్‌ తప్ప మిగితా చైనా ప్రానిన్సుల్లో కరోనా బాధితులు ఉన్నారు. థాయిలాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్‌, మల ేషియా, నేపాల్‌, ఫ్రాన్స్‌, ఆస్టేల్రియా, శ్రీలంక దేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా స్కూళ్లకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. కరోనాకు ధాయివాసి మృతి కరోనా వైరస్‌ సోకిన బాధితులు న్యూమోనియా వ్యాధితో మరణిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా లోనూ కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలతో బాధపడుతూ థాయిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి నిన్న మృతి చెందాడు. థాయిలాండ్‌ జాతీయుడు.. గతేడాది నవంబర్‌ నుంచి కోల్‌కతాలో నివసిస్తున్నాడు. శ్వాస సంబంధిత సమస్యలతో జనవరి 21న కోల్‌కతాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. అయితే అతనికి కడుపునొప్పి, జ్వరం, వాంతులు రావడంతో ఐసీయూకు తరలించారు. చికిత్స పొందుతూ థాయిలాండ్‌ జాతీయుడు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అతను కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలను కలిగి ఉన్నాడని వైద్యులు చెప్పారు. అయితే ఆ వైరస్‌ సుమారు 4515 మందికి సోకినట్లు తాజాగా అధికారులు నిర్దారించారు. ఒక టిబెట్‌ మినహా.. మిగితా చైనా ప్రానిన్సుల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. థాయిలాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్‌, మలేషియా, నేపాల్‌, ఫ్రాన్స్‌, ఆస్టేల్రియా, శ్రీలంక దేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేంద్ర బిందువైన హుబెన్‌ ప్రావిన్సులో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close