Featuredరాజకీయ వార్తలు

ప్రజలే మా బాసులు

– ప్రజలు గెలిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం

– వలసపాలకులపై పోరాటం కొనసాగిస్తాం

– పోడుభూములకు ఆరునెలల్లో పరిష్కారం

– ఇది టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోరు

– మానుకోట అభివృద్ధి నా బాధ్యత

నర్సంపేట, మహబూబాబాద్‌ డోర్నకల్‌, సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి ప్రజా ఆశీర్వాద సభలలో కేసీఆర్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలే బాసులని సీఎం కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ చేతిలో అధికారం ఉంటే నిర్ణయాలన్నీ ఇక్కడే జరుగుతాయని.. కూటమి అధికారంలోకి వస్తే ప్రజలు దరఖాస్తు పట్టుకొని ఢిల్లీకి పోవాలా, అమరావతికి పోవాలా.. అని కేసీఆర్‌ ప్రశ్నించారు. టికెట్లు పంచుకోవడానికే కాంగ్రెస్‌ నేతలు వందసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థులు టికెట్ల కోసం అమరావతిలో క్యూ కట్టారని, ఆ పార్టీకి ఇంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉంటుం దా అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. వలస పాలన చెల్లదని తెలంగాణ ప్రజలు నిరూపిం చాల్సిన సమయం వచ్చిందంటున్నారు టీఆర్‌ఎస్‌ అధి నేత కేసీఆర్‌. 40ఏళ్లు పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన కాంగ్రసోళ్లు.. ఇప్పుడు కేసీఆర్‌ను ఢీకొట్టే దమ్ము లేక.. చంద్రబాబును భుజాలపై ఎక్కించుకొని తెలంగా ణకు మోసుకొస్తున్నారని ఫైరయ్యారు. 58 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన కూటమి కావాలో.. నాలుగున్నరేళ్లలో అభివద్ధి అంటే ఏంటో చూపించిన టీఆర్‌ఎస్‌ కావాలో ప్రజలే తేల్చుకో వాలన్నారు. శుక్రవారం నర్సంపేట, మహబూ బాబాద్‌ డోర్నకల్‌, సూర్యాపేట, తుంగతుర్తి తిరుమలగిరిలలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కూటమి టార్గెట్‌గా మరోసారి నిప్పులు చెరిగా రు. ‘ఈ ప్రపంచ మేధావి చంద్రబాబు.. హైదరా బాద్‌ కట్టాడంట.. తెలంగాణను అభివద్ధి చేశాడంట. సమైక్య పాలనలో 24 గంటల కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయినట్లు. అంతెందుకు ఆంధ్రాలో 24 గంటల విద్యుత్‌ ఉందా. స్వరాష్ట్రం వచ్చాక చంద్రబాబు పీడ పోయింది. ఇప్పుడు మళ్లీ కేసీఆర్‌ను కొట్టడానికి ఈ కాంగ్రెసోళ్లు ఆంధ్రాకు పోయి చంద్రబాబును తోలుకొస్తున్నారు. సొంత రాష్ట్రంలో ఈ చంద్రబాబు పెత్తనం అవసరమా. హైకోర్టు విభజన కానివ్వరు.. పంపకాలు పూర్తి చేయనివ్వరు.. ప్రాజెక్టుల్ని అడ్డుకోవడానికి 35 లేఖలు రాసిన వ్యక్తి చంద్రబాబు’అంటూ మండిపడ్డారు. ‘ఈ కూటమిలో ఓ పార్టీ ఢిల్లీ గులాంలు.. మరో పార్టీ విజయవాడ గులాంలు.. వాళ్లకు ఢిల్లీ, విజయవాడ అధిష్టానమైతే.. మాకు ప్రజలే అధిష్టానం. ఎన్నికల కోసం మన గొంతు కోసే చంద్రబాబును తీసుకొస్తున్నారు.. మన ఇళ్లలోకి వచ్చి కొట్టిపోతానంటున్నారు. గతంలో చెప్పా.. ఇప్పుడు చెబుతున్నా.. కత్తి ఆంద్రావాడిదైతే.. పొడిచేది తెలంగాణవాడు. వచ్చేది ఆంధ్రావాడైనా.. తీసుకొచ్చేది తెలంగాణవాళ్లేనని గుర్తు పెట్టుకోవాలి. ఓసారి బాబును ఆంధ్రకు పంపా.. ఇప్పుడు పంపిస్తారో లేదో మీరే తేల్చుకోవాలి. తెలంగాణలో ఈ రాజకీయాలు చెల్లవని ఓటుతో కొట్టాలి’అని పిలుపునిచ్చారు.

‘ఏన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ

సాధించుకున్నాం. ప్రతి ఒక్కరి కలైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టుకుంటున్నాం. రెండేళ్లు ఆలస్యమైనా మంచి ఇళ్లు కడతాం.. ఒక్క డబుల్‌ బెడ్‌రూమ్‌ ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే.. సొంత జాగా ఉన్నవాళ్లకు కూడా అవకాశం ఇస్తాం. కాంగ్రెసోళ్లలా అబద్దాలు చెప్పం.. ప్రజల్ని ఎందుకు మోసం చేయాలి. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన ఇళ్ల పథకంలో కుంభకోణం జరిగింది. ఈ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 5వేల కోట్ల రూపాయలు గోల్‌మాల్‌ చేశారు.. దొంగ పేర్లతో దోచేశారు. ఆ డబ్బును కక్కిస్తామంటే.. మా మీద పగ పట్టారని అంటున్నారు. ఈ నాలుగున్నరేళ్లు పథకాల రూపకల్పనలో పాలనలో బిజీగా ఉన్నాం. మళ్లీ అధికారంలోకి రాగానే..ఎవడెవడు ఏం మింగిండో కక్కించి తీరుతామన్నారు’కేసీఆర్‌. ‘సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా తెలంగాణ ఉంది. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు పథకాలు ఎలా అమలవుతున్నాయి. ఇవన్నీ కళ్ల ముందే కనపడుతున్నాయి కదా. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం. రైతు బంధు, బీమాతో ఆదుకున్నాం. విత్తనాల కొరత కూడా లేదు. రైతు బంధు సాయాన్ని మళ్లీ పెంచుతాం. ఈసారి ఫించన్‌ రూ.వెయ్యి నుంచి రూ.2016 చేస్తాం. వికలాంగులకు రూ.3016.. నిరుద్యోగులకు రూ.3016 భ తి ఇస్తామని’ హామీ ఇచ్చారు. ‘ఎన్నికల్లో ఎప్పుడూ ప్రజలే గెలవాలి.. దేశానికి. రాష్ట్రానికి ఏది మంచిదో తెలుసుకొని ఓటేయాలి. 58ఏళ్లు రాష్ట్రాని పాలించిన కాంగ్రెస్‌, కూటమి.. నాలుగున్నేరేళ్లు పాలించిన టీఆర్‌ఎస్‌ మీ ముందు ఉంది. గత చరిత్ర ఏంటో మీకు తెలుసు.. ఆ కూటమి నేతలు ఆకాశం నుంచి దిగి రాలేదుగా. వారి పాలనలో ఏం జరిగింది.. టీర్‌ఎస్‌ ఈ నాలుగేళ్లలో ఏం చేసిందో చూసుకొని ఓటేయండి. నర్సంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని చెబుతున్నారు. ఆ రౌడీయిజంపై పోరాటం చేస్తున్న బెబ్బులి సుదర్శన్‌ రెడ్డిని గెలిపించాలి. ఎవరైనా మీ జోలికి వస్తే చెప్పండి.. వెంటనే గద్దలా ఇక్కడ వాలిపోతానంటూ ఉత్సాహం నింపారు’ కేసీఆర్‌. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా గిరిజనల భూమి సమస?్యలు పరిష్కరిస్తామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గిరిజనుల జనాభా పెరిగిందని, మీకు రిజర్వేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ‘కేసీఆర్‌ జగమొండి. చెప్పింది సాధించి తీరుతాడు. తెలంగాణ రాష్ట్రాన్నే సాధించాం. రిజర్వేషన్లు కూడా తీసుకురాలేమా’ అన్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఆ కాంగ్రెసాయన పేరేంది. మాజీ ఎంపీ బలరాం నాయక్‌. ఆ పుణ్యాత్ముడు ఎలాంటోడంటే. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయకపోతే మిమ్మల్ని ఆంధ్రాలో కలుపుతా అంటడు. మనమే ఆయనను పాకాలలో కలిపితే పోలే. బలరాం నాయక్‌ ఇష్టం ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర జీతగాడిగా ఉండు. బలరాం లాంటి చీము, నెత్తురు లేనివాళ్ల పుణ్యంతోనే ఇంకా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఆంధ్రా నాయకుల సంచులు మోస్తున్నారు. మళ్లీ మనకు ఆంధ్రోళ్ల పాలన ఎందుకు. కాంగ్రెసోళ్లు 1969లో ఉద్యమకారుల్ని చంపారు. రెండోదశ పోరాటంలోనూ కాల్పులు జరిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అనే ముఖ్యమంత్రి తెలంగాణ రానివ్వమని చెప్పారు. కానీ ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గతంలో కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో కాలువల్లో తుమ్మచెట్లు మొలినాయి. చెరువులను నీళ్లతో నింపింది టీఆర్‌ఎస్‌. రైతు బీమా చాలా అద్భుతమైన పథకం. ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5 లక్షల బీమా ఇస్తున్నం. కేసీఆర్‌ కిట్‌, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు వస్తాయని మనం కలలో కూడా ఊహించలేదని’ కేసీఆర్‌ ప్రసంగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close