కేసీఆర్‌ పాలనలో ప్రజలు మోసపోయారు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సీఎం కేసీఆర్‌ పాలనలో తెరాస ప్రజలు మోసం పోయారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబపాలనలో నడిచిందని, ఇచ్చిన హావిూలను తెరాస నేరవేర్చలేదని ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కుటుంబ వ్యక్తులు ఇసుక అక్రమ దందా చేస్తున్నారని ఆరోపించారు. నేరెళ్ల ఘటనలో దళితులను చంపారంటూ ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్‌ ప్రభుత్వం.. ఆ హావిూ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కమిషన్ల కోసమే మిషన్‌ భగీరథ కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతితోపాటు మహిళా స్వయం సహకార సంఘాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చవాన్‌ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here