హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే ఆ సమయం వరకూ క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 56.17శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 38.68 శాతం పోలింగ్ నమోదు కాగా.. షాద్‌నగర్‌లో 59శాతం, ముషీరాబాద్‌లో 42శాతం, గోషామహల్లో 42 శాతం చొప్పున నమోదైంది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో 51.32 శాతం, వికారాబాద్ 57.75, మేడ్చల్‌లో 59శాతం, పెద్దపల్లి జిల్లాలో 55శాతం, సిరిసిల్ల జిల్లాలో 60.25 శాతం, జగిత్యాలలో 61.23, కరీంనగర్లో 55 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలో 73.25 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 55.93శాతం, కామారెడ్డి జిల్లాలో 61.81 శాతం, వనపర్తి 62.12శాతం, నాగర్‌కర్నూలు 59 శాతం, నిర్మల్ 60.60 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో తొలుత పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొంది. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ తీరును రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ఎప్పటికప్పుడు సవిూక్షించారు.నిలిచారు. 1.90 లక్షల మంది భద్రతా సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.పలుచోట్ల ఓటర్లు ఏర్పాట్ల ఫై తమ నిరసనను వ్యక్తం చేసారు. ఓటర్ లిస్టు లో పేర్లు లేక పోవడం పోలింగ్ భూత్ లచుట్టూ తిరగటం,అక్కడా కుడా లిస్టు లో పేర్లు లేకపోవడం తో ఈ సేవ, ఇంటర్ నెట్లను సహితం ఆశ్రయించారు. అనేక ప్రాంతాల్లో పోల్ చిట్టిలు ఇచ్చిన లిస్టు లో పేరు లేకపోవడం తో ఓటర్లు ఓటు వేయకుండానే వేను దిరిగారు.ఈ సందర్బంగా ఓటర్లు ముక్యంగా మహిళా ఓటర్లు శాపనార్ధాలు పెట్టారు.మొత్తానికి చుస్తే ఈ ఎన్నికల్లో ఈసి విఫలమైనదన్న విమర్శలు వేల్లువెత్తాయి.