బిజినెస్

ఆల్‌ఇన్‌వన్‌ క్యూఆర్‌తో సాధికారికత కల్పించనున్న పేటీఎం

ఒక ఏడాదిలో ఈ రాష్ట్రాల్లో రెండింతల వ్యాపార వద్ధి లక్ష్యం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణలలో రానున్న 6 నెలల్లో 1.5 మిలియన్ల మం ది వ్యాపారులను చేరుకోనున్నట్లుగా భారతదేశ అతిపెద్ద చెల్లింపుల వేదిక అయినే పేటీఎం (వన్‌ 97 క మ్యూనికేషన్స్‌ కు చెందింది) నేడిక్కడ ప్రకటించింది. కంపెనీ ఇటీవల దేశవ్యాప్తంగా ఆల్‌ ఇన్‌ వన్‌ క్యూఆర్‌ ను ఆవిష్కరించింది. పేటీఎం వాలెట్‌, రూపే కార్డు, అన్ని యూపీఐ ఆధారిత పేమెంట్‌ యాప్స్‌ ద్వారా 0% ఫీజుతో నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి అపరిమిత చెల్లింపులను ఆమోదించేందుకు ఇది వ్యాపారులకు వీలు కల్పిస్తుంది. అంతేగాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో ఏడాది కాలంలో వ్యాపార వద్ధి సా ధించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. ఈ వేదిక తన ‘పేటీఎం ఫర్‌ బిజినెస్‌’ యాప్‌ ద్వారా అన్ని చెల్లింపులకు సంబంధించి ఒకే రికన్సలియే షన్‌ ను అందిస్తుంది. చెల్లింపులు మాత్రమే గాకుండా వ్యాపారులతో మరింత అనుబంధం కోసం మర్చం ట్‌ సొల్యూషన్స్‌ లో పెట్టుబడి పెట్టే ఆలోచనలో కూడా కంపెనీ ఉంది.పేటీఎం తన ఆల్‌ ఇన్‌-వన్‌ పేటీఎం క్యూఆర్‌ ను వ్యాపారులు తమ దుకాణాల్లో రోజువారీ అవసరాలకు వినియోగించే కాలిక్యులేటర్‌, పవర్‌ బ్యాంక్‌, క్లాక్‌, పెన్‌ స్టాండ్స్‌, రేడియో వంటి వివిధ యుటి లిటీ ఐట మ్స్‌ కు కూడా ప్రవేశపెట్టింది. డిజిటల్‌ చెల్లింపులతో వారి అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేసేలా వ్యా పారి పేర్లు, లోగోలు మరియు పిక్చర్స్‌ తో కూడిన వ్యక్తిగతీకరించబడిన క్యూఆర్‌ కోడ్‌ లను కూడా పేటీ ఎం ఆవిష్కరించింది. డోర్‌ డెలివరీ పొందుందుకు గాను ఈ క్యూఆర్‌ కోడ్‌ లను మర్చండైజ్‌ స్టోర్‌ నుంచి ‘పేటీఎం ఫర్‌ బిజినెస్‌’ యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేయవచ్చు. సౌండ్‌ బాక్స్‌ అనేది అత్యంత ప్రజాదరణ పొం దిన క్యూఆర్‌ మర్కండైజ్‌. పేమెంట్‌ వచ్చినట్లుగా ధ్రువీకరణను వినేందుకు ఇది వారికి వీలు కల్పిస్తుం ది. ఇది అన్ని రకాల చెల్లింపులను మరియు బహుళ భాషలను సపోర్ట్‌ చేస్తుంది. వ్యాపారులకు తన డైనమిక్‌ క్యూఆర్‌ ద్వారా చెల్లింపులను పేటీఎం మరింత సౌకర్యవంతం చేస్తోంది. నిర్దిష్టంగా ఒక సింగిల్‌ ఆర్డర్‌ కు మాత్రమే ఉండేలా సైతం క్యూఆర్‌ కోడ్‌ లను జనరేట్‌ చేసుకోవచ్చు. వీటిని వ్యాపారులు ఏ పీఓ ఎస్‌ సిస్టమ్‌ తో నైనా ఇంటిగ్రేట్‌ చేసుకోవచ్చు. వ్యాపారులకు సంబంధించిన యాప్‌ ‘పేటీఎం ఫర్‌ బిజినెస్‌’ 10 మిలియన్లకు పైబడిన పేటీఎం భాగ స్వా ముల ద్వారా విస్త తంగా వినియోగించబడుతోంది. వివిధ ఇతర సేవలతో పాటుగా వారు తమ చెల్లింపు లను మేనేజ్‌ చేసుకునేందుకు, తమ లావాదేవీలన్నిటినీ ఒకే చోట చేసుకునేందుకు, పేటీఎం క్యూఆర్‌ మర్కండైజ్‌ ను ఆర్డర్‌ చేసేందుకు అది వారికి వీలు కల్పిస్తుంది. వ్యాపారులు రుణాలు, బీమా వంటి వి విధ వ్యాపార సేవలు,ఆర్థిక పరిష్కారాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఏ సమయంలో నైనా త క్షణం తమ చెల్లింపులను బ్యాంకు ఖాతాలలోకి బదిలీ చేసుకునేందుకు ఈ వినూత్న ఆఫరింగ్‌ పేటీఎం వ్యాపార భాగస్వాములకు సాధికారికత కల్పిస్తుంది. డిజిటల్‌ చెల్లింపుల యొక్క విస్త త ఆమోదాన్ని ప్రో త్సహించేందుకు గాను దీర్ఘకాలికంగా తనతో అనుబంధం కలిగిన వారికి రివార్డులు మరియు క్యాష్‌ బ్యాక్‌ ను పేటీఎం అందిస్తోంది. పేటీఎం నూతన ముఖ్యమైన సర్వీస్‌ ‘పేటీఎం బిజినెస్‌ ఖాతా’ ను కూడా ప్రవేశపెట్టింది. ఇది పేటీఎం ఆ ల్‌ ఇన్‌ వన్‌ క్యూఆర్‌ కు పూరకంగా ఉంటుంది. క్యాష్‌ అండ్‌ క్రెడిట్‌ లతో సహా తమ అన్ని కస్టమర్‌ లా వాదేవీల్లో డిజిటల్‌ లెడ్జర్స్‌ ను మెయింటెయిన్‌ చేసేందుకు పేటీఎం మర్చంట్‌ భాగస్వాములకు ఇది వీ లు కల్పిస్తుంది. ‘పేటీఎం బిజినెస్‌ ఖాతా’ తో వ్యాపారులు క్రెడిట్‌ లావాదేవీలకు డ్యూ తేదీని సెట్‌ చేసు కోవచ్చు మరియు ఆటోమేటెడ్‌ రిమైండర్స్‌ ను పంపించవచ్చు. కస్టమర్లు తమ బిల్లింగ్‌ హిస్టరీతో ఒక నో టిఫికేషన్‌ పొందుతారు మరియు అదే లింక్‌ ద్వారా వారు చెల్లింపులు చేయవచ్చు. ఈ సందర్భంగా పేటీఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సౌరభ్‌ శర్మ మాట్లాడుతూ, ”ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ గత ఏడాది కాలంలో 60% వద్ధిని నమోదు చేశాయి. 2020లో కూడా ఈ ప్రాంతం నుంచి డి జిటల్‌ అడాప్షన్‌ లో గణనీయమైన వ ద్ధిని ఆశిస్తున్నాం. పేటీఎం ఫర్‌ బిజినెస్‌ యాప్‌ తో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా మరియు వారు తమ వ్యాపారాలను వద్ధి చేసుకునేందుకు వీలు క ల్పించడం ద్వారా మేము దేశవ్యాప్తంగా వ్యాపారులకు సాధికారికత కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. ఇది ఒక తప్పనిసరి వ్యాపార టూల్‌. తిరుగులేని యూజర్‌ అనుభూతిని ఇది అందిస్తుంది. వ్యాపార స్థా యితో సంబంధం లేకుండా ఏ వ్యాపారి అయినా కూడా దీనికి యాక్సెస్‌ పొందవచ్చు. ఈ ప్రక్రియ అంతా కూడా ఎంతో సరళంగా ఉంటుంది మరియు ఉచితం. ఎలాంటి కేవైసీ లేకుండా లేదా ఎక్కువ డాక్యు మెంటేషన్‌ లేకుండా దీన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ యాప్‌ కు ఆల్‌-?ఇన్‌ వన్‌ క్యూఆర్‌ జోడింపుతో, డిజిటల్‌ చెల్లింపులు ఆమోదించడం మొదలుకొని వివిధ సేవలు, ఉత్పాదనలు ఉపయోగించుకోవడం దాకా ప్రతి దశలో కూడా మేము వ్యాపారులకు అండగా నిలుస్తాం. డిజిటల్‌ ఇండియా మిషన్‌ను వేగ వంతం చేయడాన్ని మేము కొనసాగిస్తాం. మరిన్ని ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం” అని అన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close