ఏకగ్రీవ పంచాయితీలపై ఇసి దృష్టి పెట్టాలి

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): పంచాయతీలను ఏకగ్రీవం చేయడం మంచిదికాదని, ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని టీజేఎస్‌ అధ్యక్షు డు కోదండరాం అన్నారు. దీనివెనక జరుగుతన్న తతంగం గుర్తించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్‌ తరపున నామినేషన్లు వేస్తున్నారని, నేతలు దుస్తులు మార్చినంత తేలిగ్గా పార్టీలు మారుతున్నారని విమర్శించారు. భారత్‌ లో స్పీకర్‌ వ్యవస్థ ఇంకా పటిష్టం కావాల ని, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. టీజేఎస్‌, కాంగ్రెస్‌లో విలీనం అవుతోందనేది అవాస్తమన్నారు. టిఆఎస్‌ఎస్‌ తన అస్తిత్వాన్‌ఇన కాపుడుకుంటుందని, విలీనం ప్రసక్తి ఉండదని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నదానిపై… పార్టీలో చర్చలు జరుగుతున్నాయని కోదండరాం తెలిపారు. పంచాయతీల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించటం సరికాదని బీసీ రిజర్వేషన్లపై గట్టి ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. ప్రైవేట్‌ రంగంలో స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహణపై అనుమానాలున్నాయని, ఏపీ ఎన్నికలకు వెళ్లే తీరిక లేదన్నారు. తెలంగాణలో తాము చేయాల్సింది చాలా ఉందని, ఆంధ్రా ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని కోదండరాం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here