సినిమా వార్తలు

దేశభక్తుడి ఆత్మకథ : ట్రైలర్‌ టాక్‌

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కొత్త సినిమా భారత్‌ ట్రైలర్‌ ఇందాకా విడుదల చేశారు. ఇటీవలే వివిధ రకాల గెటప్పుల్లో సల్మాన్‌ ని పోస్టర్లలో చూశాక దీని మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టైగర్‌ జిందా హై తర్వాత దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ సల్మాన్‌ కాంబో చేస్తున్న మూవీ కావడంతో హైప్‌ ఇంకాస్త పెరిగింది. ఇక ట్రైలర్‌ లో చూస్తే కథను క్లియర్‌ కట్‌గా చెప్పేశారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో యువకుడిగా ఉన్న భారత్‌(సల్మాన్‌ ఖాన్‌)సర్కస్‌ లో ప్రమాదకరమైన బైక్‌ స్టంట్‌ మ్యాన్‌ గా జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. నెహ్రు చనిపోయాక దేశంలో అలజడి రేగుతుంది. భారత్‌ ప్రభుత్వ ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే ఉద్యోగిని(కత్రినా కైఫ్‌)తో పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ లోపు ఇండియా పాకిస్థాన్‌ విభజన జరిగి భారత్‌ గనుల్లో కార్మికుడిగా మారాల్సి వస్తుంది. ఆ తర్వాత షిప్‌ కెప్టెన్‌ గా అవతారం ఎత్తుతాడు. అసలు ఇన్ని దశల్లో ఇన్ని వేషాలు భారత్‌ ఎందుకు వేయాల్సి వచ్చిందనేదే అసలు కథ నిర్మాణం చాలా రిచ్‌ గా ఉంది. సల్మాన్‌ ఎనర్జీని పూర్తిగా వాడుకుంటూ అలీ అబ్బాస్‌ జాఫర్‌ డిఫరెంట్‌ గా ప్రెజెంట్‌ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. కాస్త డీ గ్లామర్‌ టచ్‌ ఉన్న పాత్రలో కత్రినా కైఫ్‌ క్యూట్‌ గా ఉంది. విజువల్స్‌ ని బాగా తీర్చిదిద్దారు. ముసలివాడైన భారత్‌ తన కథ మనకు చెప్పే విధానాన్నే ఇందులో స్క్రీన్‌ ప్లే గా మలుచుకున్నారు. టబు-జాకీ శ్రోఫ్‌-సోనాలి కులకర్ణి-దిశా పటాని ఇతర కీలక పాత్రలు పోషించిన భారత్‌ ని దేశభక్తి నేపధ్యంగా తీశారు. విశాల్‌ శేఖర్‌ సంగీతం మార్కిన్‌ ఛాయాగ్రహణం టాప్‌ స్టాండర్డ్‌ లో ఉన్నాయి. రంజాన్‌ పండగ సందర్భంగా జూన్‌ 5న విడుదల కాబోతున్న భారత్‌ సల్మాన్‌ ఫ్యాన్స్‌ కి ట్రైలర్‌ రూపంలో ఈద్‌ సందడిని ముందే తీసుకొచ్చింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close