మరో రెండు నెలల్లో రీలాంచ్ కానున్న పతంజలి మెసేజింగ్ యాప్.

0

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా పతంజలి సంస్థ ఇటీవ‌లే కింభో పేరిట ఓ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ యాప్ విడుదలైన కొద్ది లోపే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ స్టోర్‌ల నుంచి అదృశ్యమైంది. ఈ యాప్‌లో ప్రైవసీ పరంగా పలు సమస్యలుండడంతోపాటు పెద్ద ఎత్తున వచ్చిన ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం యాప్ డెవలపర్లకు కష్టంగా మారింది. దీంతో విడుదలైన కొంత సేపటికే యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి తొలగించారు.

అయితే సదరు కింభో యాప్‌కు మరిన్ని హంగులు జోడిస్తున్నట్లు పతంజలి సంస్థ ప్రతినిధులు చెప్పారు. యాప్‌కు ఉండే డిమాండ్ దృష్ట్యా ఒకేసారి పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి ట్రాఫిక్ వస్తే ఎలా తట్టుకోవాలనే విషయంతోపాటు యాప్‌లో ఉన్న బగ్స్ (సాఫ్ట్‌వేర్ లోపాలు), ప్రైవసీ సమస్యలను తొలగించి మరో రెండు నెలల్లో పూర్తి స్థాయిలో ఈ యాప్‌ను తిరిగి లాంచ్ చేస్తామని వారు చెప్పారు. ప్రస్తుతం యాప్‌కు మరిన్ని ఫీచర్లను జోడించే ప్రయత్నం చేస్తున్నామని, వాటిని పరిశీలిస్తున్నామని, ఇకపై యాప్ విడుదలయ్యాక ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here