Featuredస్టేట్ న్యూస్

కేటీఆర్‌కు పార్టీ కార్యకర్తలే ముఖ్యమా.. సామాన్య ప్రజల గోస పట్టదా..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణా రాష్ట్రంలో సామాన్య ప్రజల జీవన స్థితిగతులు క్రమక్రమంగా చెల్లాచెదురవు తున్న తరుణంలోతెలంగాణ రాష్ట్ర మంత్రులు ఏమాత్రం పట్ట నట్టు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కడుదయనీ యమని నేతన్నల ఐక్య కార్యాచణ కమిటీ చైర్మన్‌ దాసు సురేష్‌ ఆవేదన వ్యక్తం చేసారు. మరణించిన టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల కుటుం బాలకు ప్రమాద భీమాను అందిస్తూ తెలంగాణ భవన్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వ కుంట్ల తారక రామారావు కూర్చుని సహపంక్తిభోజనం చేయడం అభినందించాల్సిన విషయమేనని కానీ ఇదే సందర్భంలో తెలం గాణ ఏర్పడిన నాటినుండి నేటి వరకు దాదాపు 350 చేనేత కార్మి కులు అనారోగ్యం కారణం చేత ఆర్థిక కారణాల చేత మత్యువాత పడితే గడచిన ఆరు సంవత్సరాల కాలవ్యవధిలో సంబంధిత చేనేత జౌళి శాఖ మంత్రిగాఉండి కనీసం వారిని పరా మర్శించిన పాపాన పోలేదని ఆయా కుటుంబాలను ఆదుకునే ప్రయత్నమే చేయడం లేదని దుయ్యబట్టారు. పార్టీ సబ్యులకు ఇన్సూరెన్స్‌ ఇచ్చి ఆపదకాలంలో ఆడుకుంటున్నామని చెబుతున్న మంత్రి గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని నేతన్నలందరికి తాము అధికా రంలోకి వస్తేఇస్తామన్న ఐదు లక్షల రూపాయల ఉచిత భీమా ఇక్కడికి పోయిందని, హామీని మంత్రి మర్చిపో యారాఅని ఎద్దేవా చేసారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే విద్యాధికుడని అభ్యుదయ భావాలు కలవాడని చెప్పుకునే కేటీ ఆర్ను ప్రజలుఅనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేటీ ఆర్‌కు ఓట్లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేనందునేపార్లమెంటు ఎన్నిక లలో ప్రజలు తన నియోజక వర్గమైన కరీంనగర్లో వ్యతిరేక తీర్పు నిచ్చినా ఇంకా కేటీఆర్గమనించక పోవడం విచారకరమ న్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో నేతన్నల కుటుంభ సభ్యుడిగా ఉం టానన్న మంత్రి ఎన్నికల ముందు చేసినవాగ్దానాన్ని ఎంతమేరకు నెరవేర్చుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ఇదే సందర్భంలో గత34 రోజుల నుండి కొనసాగు తున్న ఆర్టీసీ కార్మి కుల సమ్మె లో మరణించిన 23 మంది ఎర్టీసీ కార్మికుల కుటుం బాలను ఓదార్చడానికి దేర్యం చెయ్యని కేటీఆర్‌ ను, ముందుకు రాని సహచర మంత్రులను తెలంగాణ సమాజం ఏ విధంగా అర్థం చేసుకోవాలో సమాధానం చెప్పాలని కోరారు. ఇంటర్మీడి యట్ఫలితాలలో వెలుగు చూపిన అవకతవకల వల్ల 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆసందర్భంలో మంత్రి కేటీఆర్‌ ఎందుకు బాధిత కుటుంబాలను పరామర్శించలేక పోయారో ప్రజ లకుసమాధానం చెప్పాలని కోరారు..కొండగట్టులో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించడానికికేటీఆర్కు మనసు ఎం దుకు రాలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. పార్టీ సభ్యులు అయితే ఒక విధంగా, సాధారణ ప్రజలు అయితే మరో విధంగా సవతి తల్లి ప్రేమను కనబర్చే పద్దతిని కేటీఆర్‌ వెంటనే మాను కోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మి కుల సమ్మె సమయంలో ఒకదిక్కుకార్మికులు చనిపోతుంటె హు జూర్నగర్‌ ఎన్నికల విజయోత్సవ సభను జరుపుకోవడం సిగ్గుచేట న్నారు. వీలైతేఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ రాంనగర్‌ గుండులోని నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ కేంద్ర కార్యాలయంలో వివిధ ప్రజాసంఘాల నాయకుల తో నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి శ్యామ్‌ యాదవ్‌, రజక రిజర్వేషన్‌పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులుచాపర్తి కుమారస్వామి,మున్నూరు కాపు యువజన విభాగంఅధ్యక్షులు నగేష్‌, దుబ్బాసి రాజు పాల్గొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close