Featuredజాతీయ వార్తలు

18 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు 17న అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ

ఈనెల 18వ తేదీ నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈనెల 17న ప్రభుత్వం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ అఖిల పక్ష సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరు కావాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో సమావేశాలు జరిగినప్పుడే ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పలు అంశాలపై ఆర్డినెన్స్‌లు తీసుకరానున్నారు. పలు బిల్లులపై చర్చ జరిపి ఆమోదించనున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close