Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

పార్లమెంట్ టార్గెట్ గా…

చిన్నదొర ‘పంచాయతీ’

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

పెద్దదొర ఒక్క అసెంబ్లీలో మాత్రమే తన ‘తడాఖా’ చూపారు. ఇప్పుడు చిన్నదొర అటు పంచాయతీ, ఇటు పార్లమెంట్‌ రెండింటిలో ‘సత్తా’ చూపబోతున్నారు. ఆ వ్యూహం ఏమిటో తెలిస్తే ప్రత్యర్థి పార్టీలు ‘ఖంగు’ తింటాయి. ప్రగతిభవన్‌ లో గత 20 రోజులుగా కేటీఆర్‌ పంచాయతీ వ్యూహం పక్కాగా రచించారు. అదే అమలు కాబోతోంది. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

పెద్ద దొర ‘హిట్‌’ చిన్న దొర ‘వెయిట్‌’:

తెలంగాణ గాంధీ, పెద్దదొర కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బ్లూ ప్రింట్‌’తో పక్కా విజయం సాధించారు. కార్యనిర్వాహక అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న చిన్నదొర కేటీఆర్‌ తానేంటో సాధారణంగా నిరూపించుకుంటే లాభం లేదనుకుంటున్నారు. అందుకే ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ చందాన అందరికీ ప్రస్థుతం పంచాయతీ ఎన్నికలే కనిపిస్తున్నాయి. కానీ కేటీఆర్‌కు మాత్రం అదనంగా పార్లమెంట్‌ ఎన్నికలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఆయన తనదైన శైలిలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అంటూ ‘చాపకింద నీరులా’ ఇప్పటికే ప్రత్యేక పథకం సిద్ధం చేశారు. భాజపాకు గ్రామస్థాయిలో అంతగా బలం లేదు. తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్‌ ఉన్నా గెలిచే సీను లేదు. ఇక ఉన్నదల్లా కాంగ్రెస్‌ పార్టీ. దానికి గట్టిగానే ‘చెక్‌’ పెట్టి పార్లమెంట్‌ కు గ్రావిూణ ఓట్లు పడకుండా చేయడమే కేటీఆర్‌ ప్రస్తుత ఎత్తుగడ లక్ష్యం.

పంచాయతీతో 16 పార్లమెంటు స్థానాలు:

పేరుకు పదివేల పంచాయతీలు ఏకగ్రీవం. అనంతరం ఈ ఊపులో గ్రామస్థాయిలో తెరసా పాగా వేస్తుంది. అనంతరం ఈ గెలుపు లక్ష్యంతో 16 పార్లమెంట్‌ స్థానాలలో గులాబీ రెపరెపలు ఆడే విధంగా కేటీఆర్‌ ఇప్పుడే పావులు కదుపుతున్నారు. కాంగ్రెసు ఇంకా అసెంబ్లీ విషయంలో పెద్దదొర కొట్టిన దెబ్బకు కోలుకోలేదు. సరికదా ఇప్పుడు తెరాస స్థాయిలో ఖర్చుపెట్టే అవకాశం లేదు. ఇది చిన్నదొరకు కలసివచ్చే విషయం.

ఇదీ ‘ఏకగ్రీవ’ వ్యూహం:

ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.పది లక్షలు గ్రాంట్‌ వస్తుంది. ‘వీలైనన్ని గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా ప్రయత్నించాలి’ అని తెరాస రాష్ట్ర కార్యవర్గబాధ్యులకు కేటీఆర్‌ తొలి సమావేశంలోనే దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పంచాయతీ ఎన్నికల్లో తెరాస మద్దతుదారుల విజయం కోసం వ్యూహం మొదలు పెట్టారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు మండలాల వారీగా కసరత్తు ముమ్మరం చేశారు. ఏకగ్రీవం అయ్యే గ్రామపంచాయతీల్లో తెరాస మద్దతుదారులు సర్పంచ్‌ లుగా ఉండేలా వ్యూహం అమలు చేస్తోంది. గ్రామస్థాయిలోని శ్రేణులకు అవకాశాలు కల్పించే ఎన్నికలు కావడంతో ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని తెరాస అధిష్టానం ఆదేశించింది. గ్రామాలవారీగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహించి వీలైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నికలయ్యేలా చూడాలనీ, వీలుకాని పరిస్థితుల్లో తెరాస మద్దతుదారులే గెలిచేలా వ్యూహం అమలు చేయాలని స్పష్టం చేసింది. తెరాస అధిష్టానం ఆదేశాలతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు పంచాయతీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసినవారిని గుర్తించి అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. గ్రామాల్లో మంచి పేరున్న వారిని ఎంపిక చేసి ఏకగ్రీవమయ్యేందుకు చర్చలు జరుపుతున్నారు. ఏకగ్రీవ ఎన్నిక జరిగిన గ్రామపంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తంతోపాటు తమ అభివృద్ధి నిధుల నుంచి మరో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు అంగీకారం తెలుపుతున్నారు.

ఖమ్మంపై కసరత్తు పూర్తి:

తెలంగాణలో టాప్‌ గేర్‌ లో దూసుకుపోయిన కారు… ఉమ్మడి ఖమ్మంజిల్లాకు వచ్చేసరికి సడెన్‌ బ్రేకులు పడ్డాయి. దీంతో ఖమ్మంలో నియోజకవర్గాల వారీగా సవిూక్షలు జరిపారు. లోపాలను సరిదిద్దే పనిలో కేటీఆర్‌ కాస్తంత ఎక్కువ సమయం తీసుకున్నారని తెలిసింది. ఎర్రపార్టీల గురించి కేటీఆర్‌ ఎక్కడా ప్రస్థావించకపోవడం విశేషం. ఏ పార్టీ వారైనా.. అభ్యర్థి మంచి వాడైతే తెరాస తరఫున బరిలోకి దించటం లేదా ఆ అభ్యర్థిని బలపరిచే విధంగా కేటీఆర్‌ స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఖమ్మంలో 70% పైగా సర్పంచ్‌ స్థానాలు గెలిచే విధంగా ప్లాన్‌ సిద్దమైంది.

ఈ ‘తలనొప్పి’ ఉంది:

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. పార్టీ తరఫున ఒకరి పేరు చెప్పినా సొంత పార్టీలోని వారి నుంచే మరికొందరు బరిలో ఉండే పరిస్థితి ఉంది. పోటీపడే వారు ఎక్కువగా ఉండడంతో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.

కొసమెరుపు ఏమిటంటే బాకా ఊదే జిల్లా స్థాయి అవినీతి అధికారులను ఓ కంట కనిపెట్టాలని నమ్కస్తులైన వారికి కేటీఆర్‌ చెప్పడం గమనార్హం.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close