పార్లమెంట్ ఎన్నికలకు సై

0
గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నసార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా తొమ్మిది విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది. చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా, కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్ర నేటి సాయంత్రం విూడియా సమావేశం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. లోక్‌ సభ 543 స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీ 175, ఒడిసా 147, సిక్కిం 32, అరుణాచల్‌ ప్రదేశ్‌ 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి...

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు లోకసభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. పోలింగ్‌ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికలు ఉంటాయనే వాటితో పాటు పలు అంశాలను సీఈసీ సునీల్‌ అరోరా ప్రకటించారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని సీఈసీ చెప్పారు. తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు

కనిపించనున్నాయి. ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు నిర్వహిస్తారు. మే 19వ తేదీన ఆరో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 7లో 7 రాష్ట్రాల్లోని 59 లోకసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఫేజ్‌ 6 ఎన్నికలు: మే 12వ తేదీన ఆరో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 6లో 7 రాష్ట్రాల్లోని 59 లోకసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఫేజ్‌ 5 ఎన్నికలు: మే 6వ తేదీన ఐదో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 5లో 7 రాష్ట్రాల్లోని 51 లోకసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఫేజ్‌ 4 ఎన్నికలు: ఏప్రిల్‌ 29వ తేదీన నాలుగో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 4లో 9 రాష్ట్రాల్లోని 71 లోకసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఫేజ్‌ 3 ఎన్నికలు: ఏప్రిల్‌ 23వ తేదీన మూడో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 3లో 14 రాష్ట్రాల్లోని 115 లోకసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఫేజ్‌ 2 ఎన్నికలు: ఏప్రిల్‌ 18వ తేదీన రెండో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 2లో 13 రాష్ట్రాల్లోని 97 లోకసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఫేజ్‌ 1 ఎన్నికలు: ఏప్రిల్‌ 11వ తేదీన తొలి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 1లో 20 రాష్ట్రాల్లోని 91 లోకసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 25 లోకసభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు ఏప్రిల్‌ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జార్కండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో నాలుగు దశల్లో పోలింగ్‌ జరగనుంది. అసోం, ఛత్తీస్‌గఢ్‌లలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక, మణిపూర్‌, రాజస్థాన్‌, త్రిపుర రాష్ట్రాలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 20 రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో ఒకే దశలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోకసభ ఎన్నికలు ఒకే విడతలో ఉండనున్నాయి. తెలంగాణలోను అదే విడతలో ఒకేసారి నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఏప్రిల్‌ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఫేజ్‌ 1 ఎన్నికలు: ఏప్రిల్‌ 11వ తేదీన తొలి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 2 ఎన్నికలు: ఏప్రిల్‌ 18వ తేదీన రెండో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 3 ఎన్నికలు: ఏప్రిల్‌ 23వ తేదీన మూడో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 4 ఎన్నికలు: ఏప్రిల్‌ 29వ తేదీన నాలుగో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 5 ఎన్నికలు: మే 6వ తేదీన ఐదో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 6 ఎన్నికలు: మే 12వ తేదీన ఆరో విడత పోలింగ్‌ ఉంటుంది. ఫేజ్‌ 7 ఎన్నికలు: మే 19వ తేదీన ఆరో విడత పోలింగ్‌ ఉంటుంది. మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉంటాయి . ఏప్రిల్‌ 18న తొలి విడత పోలింగ్‌, ఏప్రిల్‌ 11వ తేదీన తొలి విడత పోలింగ్‌ మార్చి 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌, 7 విడతల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలింగ్‌ అబ్జర్వర్లు. ప్రచారం సమయంలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్‌ స్పీకర్లకు అనుమతి నిరాకరణ ,ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలు ఉంటాయి. 90 కోట్ల మంది ఓటర్లలో 1.5 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల వయస్సువారు. 2014లో 9 లక్షల పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, ఈసారి 10 లక్షల పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయని సీఈసీ చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటరు కార్డుల పంపిణీని నూటికి నూరు శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. మార్చి 3 ఆదివారం నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుంది. 2014 తర్వాత కొత్తగా వచ్చిన ఓటర్లు 8 కోట్ల 40 లక్షల మంది నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల వివరాలు పేపర్లు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలి. ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 1950. దేశంలో మొత్తం 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇందులో కొత్తగా కోటిన్నర మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. తుది జాబితా విడుదల తర్వాత మార్పులు ఉండవు 99.36 శాతం మంది ఓటర్లకు గుర్తింపు కార్డులు ఉన్నాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సునిశిత పరిశీలన, పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి లక్ష పోలింగ్‌ కేంద్రాలు అదనం ఓటు హక్కు వినియోగానికి 12 గుర్తింపు కార్డులు ఉన్నాయని చెప్పారు. పోల్‌ చిట్టీలను గుర్తింపుకార్డులుగా పరిగణించమని చెప్పారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందు ఓటర్లకు పోలింగ్‌ స్లిప్‌లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందు అన్ని రాష్ట్రాల పండుగలు, పరీక్షలను పరిగణలోకి తీసుకున్నామని సీఈసీ తెలిపారు. శాంతిభద్రతలు, బలగాల మోహరింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో చర్చించామన్నారు. వాతావరణం, విద్యార్థుల పరీక్షలు, దేశవ్యాప్త పండుగలు, పంటకోతల సమయాన్ని కూడా తాము పరిగణలోకి తీసుకున్నామని సీఈసీ తెలిపారు. వాటిని పరిగణలోకి తీసుకొని ఎన్నికల తేదీని ప్రకటిస్తున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించినట్లు సీఈసీ తెలిపారు. జూన్‌ 2వ తేదీతో ప్రస్తుత సభ కాలపరిమితి ముగుస్తుందని సునీల్‌ అరోరా తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. 17వ లోకసభ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహిస్తామని సునీల్‌ అరోరా చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సునీల్‌ అరోరా ప్రకటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 2వ తేదీన ఉండే అవకాశముంది. జూన్‌ 3వ తేదీతో ప్రస్తుత లోకసభ కాలపరిమితి ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here