Featuredస్టేట్ న్యూస్

కబ్జాదారుల కబంధ హస్తల్లో పార్కు స్థలాలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం లో భూ దందాలు, భూ మాఫియా చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. వ్యవసాయ భూములనే కాకుండా శ్మశాన వాటికలు, పార్కు స్థలాలు, చెరువులతో పాటు దేవుడి మాన్యాలు కూడా కబ్జాదారుల కబంధ హస్తలలో చిక్కుక పోతున్నాయి. ఇందులో బాగంగానే హైదరాబాద్‌ శివారుల్లోని అవిూన్‌ పూర్‌ ముంకిపాలిటీ పరిదిలో ఉన్న పార్కుల స్థలాలు కబ్జా కు గురవుతున్నాయి.

శ్రీధర్‌ యాలాల – ప్రత్యేక ప్రతినిధి, ఆదాబ్‌ హైదరాబాద్‌

అవిూన్‌ పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పార్కుల స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. మున్సిపాలిటీ లో చాలా కాలనీలు ఉన్నప్పటికి పార్కులను అభివృద్ధి చేయలేదు. ఆ స్థలాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం తో కొందరు అక్రమణధారులు వాటిని ఆక్రమించి విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం వెంచర్లు వేసే సమయంలోనే 10 శాతం స్థలాన్ని పంచాయతీ లేదా మున్సిపాలిటీ

పేరు విూద రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి కానీ అలా జరగడం లేదు. అయినా అధికారులు అన్నీ అనుమతులు ఇచ్చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని రూ. కోట్ల విలువైన పార్కు స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జారాయులు యద్దెచ్చగా ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.

ఇది చరిత్ర… 1996లో పటాన్‌ చేరు లోని ఆల్విన్‌ వాచ్‌ డివిజన్‌ కార్మికుల కోసం అప్పటి బిఎంఎస్‌ యూనియన్‌ తరుపున సత్యనారాయణ గౌడ్‌ అనే వ్యక్తి సుమారు 53 ఎకరాలలో అవిూన్‌ పూర్‌ పంచాయతీ పరిదధిలో వెంచరు వేశారు. మొత్తం 650 ప్లాట్లను ఆల్విన్‌ కార్మికులు కొనుగోలు చేశారు. వెంచర్‌ ప్రారంభంలో కొన్ని సర్వే నంబర్లతో పార్కులు, సామాజిక అవసరాల కోసం ఖాళీ స్థలాలను చూపించారు. కానీ వాటి విూద ప్రభుత్వం అజమాయిషీ లేకపోవడం తో అడిగే నాధుడే లేడు అని కాలనీల కోసం కేటాయించిన పార్కు స్థలాలను ప్లాట్లు గా చేసి సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. అదే కాలనీలో నివాసముండే తాళ్లూరి కోటేశ్వర్‌ రావు అనే సీనియర్‌ సిటిజెన్‌ పార్కు స్థలాలు అమ్మడంపై ప్రశ్నించారు. అయినా అక్రమాలు ఆగలేదు. స్థానిక పంచాయతీ మొదలుకొని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఏ అధికారి కూడా ఫిర్యాదులకు స్పందించలేదు. ఏకంగా పార్కు స్థలాలలో వేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముకున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తూ సదరు బిల్డర్‌ కు వత్తాసు పలకడం ప్రారంభించారు. సర్వే నెంబర్‌ 1128, 64, 85 మరియు 93 లో గల పార్కు స్థలాలను ప్లాట్లు గా చేసి అమ్మేశారు. దీంతో న్యాయం కోసం కోటేశ్వర రావు 2011లో లోకాయుక్తను ఆశ్రయించారు.

లోకాయుక్తని సైతం బురిడి కొట్టించిన రెవెన్యూ అధికారులు… పార్కు కబ్జా ల పై లోకాయుక్త స్పందించి లే అవుట్లో పేరుకొన్న పార్కు స్థలాలను సర్వే చేయాలని జిల్లా రెవెన్యూ , పంచాయతీ అధికారులకు 2012లో ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో కంగు తిన్న అక్రమార్కులు వాస్తవాలను దాచి పెట్టి అప్పటికే అమ్ముకుని డాక్యుమెంట్లు సైతం ఉన్న స్థలాలు ఖాళీగా ఉన్నాయని వాటిని పార్కు స్థలాలుగా నమ్మించే నివేదిక రూపొందించారు. నిబంధనల ప్రకారం రెండున్నర ఎకరాలు ఉండాల్సిన స్థలాలు ప్రస్తుతం 1.38 గుంటల పార్కు స్థలాలు కబ్జాలకు గురికాకుండా ఉన్నాయని సర్వేయర్‌ నివేదిక ఇచ్చారు. సర్వే స్కెచ్‌ పైన స్థానిక తహాసిల్ధార్‌ సంతకం కూడా లేకపోవడం గమానార్హం. పక్క సర్వే నెంబర్‌ యజమానులు, ఫిర్యాధుదారుల సమక్షంలో పంచనామా చేయాల్సి ఉండగా అలాంటివి ఏమి లేకుండా సాదాసీధ కాగితం పై స్కెచ్‌ వేసి ఇచ్చారు. అదే సర్వే నివేదికను అప్పటి పంచాయతీ కార్యదర్శి యధాతదంగా న్యాయస్థానికీ అందజేసి తప్పు దారి పట్టించారు. పార్కు స్థలాలుగా పేరుకొన్న ఖాళీ స్థలాలు అప్పటికే డాక్యుమెంట్ల రూపంలో ఇతరుల పేరు విూద ఉన్న రుజువులను కూడా అధికారులు పటించుకోలేదు. అధికారుల నివేదికను విశ్వసించిన లోకాయుక్త ఖాళీగా ఉన్న పార్కు స్థలాలను తక్షణమే స్థానిక పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని 2015లో తీర్పు చెప్పారు. తీర్పు చెప్పి నాలుగేళ్ళు గడుస్తున్న అప్పటి పంచాయతీ కానీ ఇప్పటి మున్సిపాలిటీ కానీ స్వాదీనం చేసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. లేని స్థలాలని పార్కుల స్థలాలుగా లోకాయుక్తను తప్పు దారి పట్టించిన పంచాయతీ, రెవెన్యూ సిబంధి కోర్టు తీర్పును పరిగణం లోకి తీసుకోకపోవడం గమనార్హం.

లే అవుట్‌ లో సర్వే నెంబర్‌ 64లో పార్కు స్థలం ఉన్నదని చూపించారు. వాస్తవానికి అందులో ప్లాట్లు వేసి రిజిస్టర్‌ చేసి 1340 గజాల స్థలం అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. సుధాకర్‌ అనే వ్యక్తి ప్లాటును కొనుగోలు చేశారనేందుకు పక్క ఆధారాలు ఉన్నాయి. రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్‌, పంచాయతీ సిబంధి కూడబలుకొని కోర్టును బురిడి కొట్టించారు. సర్వే నెం 93లో ఖాళీ స్థలం పార్కు స్థలం గా కోర్టును నమ్మించారు. కానీ 120 గుంటల భూమి ఎప్పుడో కబ్జాకు గురైంది. సదరు సర్వేనెంబర్‌ లలో భూములు కొనుగోలు చేశారని రుజువు చేసేందుకు రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ (నెంబర్‌ 4140.1995, 4256.2015)లను ఆన్‌ లైన్‌ లో పరిశీలిస్తే నిజాలు బహిర్గతం అవుతాయి. సదరు డాక్యుమెంట్ల ప్రకారం విట్టల్‌ గోపాల్‌ అనే వ్యక్తి స్వాధీనంలో భూమి ఉన్నదని తెలుస్తుంది. సర్వే నెంబర్‌ 1128లో 54 గుంటల భూమి పార్కు స్థలంగా లే అవుట్‌ లో పేర్కొన్నారు. సదరు సర్వే నెంబర్‌ కాలనీ సెప్టిక్‌ ట్యాంకు ను నిర్మించారు. కాగా మొత్తం భూమిని డాక్యుమెంట్‌ నెంబర్‌ 3993.2013 ప్రకారం ఇతరులకు విక్రయించినట్లు ఉన్నది. ఖాళీ స్థలాలు గా పేర్కొన్న భూమి చేతులు మారి నేడు ఇళ్లను నిర్మించి సొమ్ము చేసుకున్నారు. అధికారులు కాలయాపన చేస్తుండడంతో కోటేశ్వర్‌ రావు 2016 లో ఆర్‌టిఐ ద్వారా ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ కి ఫిర్యాదు చేయడంతో అప్పటి పంచాయతీ కార్యదర్శి మళ్ళీ రీ సర్వే చేయాలని తెలిపారు. ఏళ్ళు గడుస్తున్న రీ సర్వే చేయకుండా పంచాయతీ అధికారులు కాలయాపన చేస్తుండడంతో 2017లో అప్పటి అవిూన్‌ పూర్‌ తహాసిల్ధార్‌ కి ఎఫ్‌ఎంబి రికార్ద్లు / టిప్పోన్స్‌ కావాలని ఆర్‌టిఐ ద్వారా అడిగారు. దానికి పటాన్‌ చేరు మండలంను విభజించి అవిూన్‌ పూర్‌ మండలంగా ఏర్పాటు చేయబడింది కాబట్టి మా దగ్గర ఎటువంటి రికార్ద్లు లేవు అని సమాధానం ఇచ్చారు. కొసమెరుపు ఏంటంటే అన్యాక్రాంతమైన భూలు వేరే వాళ్ళ పేరు విూద రిజిస్ట్రేషన్‌ అయితే స్వాధీనం చేసుకునే హక్కు మాకు లేదు అని చెప్పడం. పార్కులు, సామాజిక అవసరాల కోసం విడిచిపెట్టే స్థలాల పై లే అవుట్‌ యజమానులకు ఎలాంటి హక్కు ఉండదని 30.7.2009 లో హై కోర్ట్‌ తీర్పు చెప్పింది. న్యాయ వ్యవస్థ ఇంత స్పష్టంగా ఉన్న చర్యలు తీసుకోడానికి అధికారులు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.

దీనితో కోటేశ్వర్‌ రావు మళ్ళీ పటాన్‌ చేరు తహాసిల్ధార్‌ కి ఎఫ్‌ఎంబి రికార్ద్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రికార్ద్లు దొరకలేదు అని పటాన్‌ చేరు తహాసిల్ధారు సమాధానం ఇవ్వడం తో సహనం నశించి ప్రజావాణి లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గారికి స్పెషల్‌ ఆఫీసర్‌ ని రీ సర్వే కోసం నియమించమని విజ్ఞప్తి చేశారు. కానీ కలెక్టర్‌ గారు కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. ఖాళీగా ఉన్న కోట్ల విలువైన పార్కు స్థాలాలను స్వాధీనం చేసుకునేందుకు అప్పటి పంచాయతీ కానీ ఇప్పటి మున్సిపాలిటీ కానీ ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు. లోకాయుక్త ఆదేశాల ప్రకారం పార్కు స్థలాలను బిల్డర్‌ పంచాయతికి గిఫ్ట్‌ డీడ్‌ చేయాలి కానీ బిల్డర్‌ ఒత్తిడికి తలొగ్గి పంచాయతీ అధికారులు కోర్టు తీర్పును కాలరాశారన్నది ప్రధాన ఆరోపణ. పార్కు స్థలం ఉన్నదని నివేదిక ఇచ్చిన వారే నేడు స్వాధీనం చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. అక్రమంగా పార్కు స్థలాలను ప్లాట్లు చేసి అమ్మిన భూములను రద్దు చేసి వాటిని కాపాడాలని కాలనీవాసుల డిమాండ్‌ . కేవలం పార్కులనే కాక ప్రభుత్వం భూములను, చెరువులను కూడా యద్దెచ్చగా కబ్జా చేస్తున్న అవిూన్‌ పూర్‌ మున్సిపాలిటీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో వేల కోట్ల ప్రభుత్వం భూములను కూడా బిల్డర్లు ప్లాట్లు గా చేసి అమ్ముకుంటున్నారు.

అవిూన్‌ పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని నరేందర్‌ కాలనీలో లే అవుట్‌ లను అనుసరించి పార్కు స్థలాలను ప్రత్యేక అధికారితో సర్వే చేయించాలి. 30.7.2009 లో హై కోర్ట్‌ తీర్పుననుసరించి పార్కు స్థలాలు కబ్జా అయ్యి రిజిస్టర్‌ అయిన స్వాదీనం చేసుకోవాలి. గత 11 సం|| లుగా పంచాయతీ నుండి జిల్లా స్థాయి వరకు అనేక ఫిర్యాదులు చేసిన కనీస స్పందన లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని పార్కు స్థలాలను కాపాడాలి. కాంక్రీట్‌ జంగిల్‌ గా మారుతున్న నగరంలో పచ్చదన కోసం పార్కులను అభివృద్ధి చేసి కాలుష్యాన్ని కొంతవరకైనా నివారించాలి.

టి. కోటేశ్వర్‌ రావు, సీనియర్‌ సిటిజెన్‌, నరేంద్ర కాలనీ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close