20లోపు ‘పరిషత్‌’ ఎన్నికలకు.. నోఫికేషన్‌

0
  • మూడు విడతల్లో ఎన్నికలు
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి. నాగిరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలకు ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి. నాగిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నాటికి పోలింగ్‌ స్టేషన్లు సిద్ధం అవుతాయన్నారు. పోలింగ్‌ సిబ్బంది నియామకం పూర్తయిందని, ఆర్వోలు, ఏఆర్వోల శిక్షణ పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ ముఖ్య విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం అయ్యామని, 18న కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశం అవుతామని నాగిరెడ్డి తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు జరిగిపోయిందని, అయితే, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఇక ఇప్పటికే ఓటర్ల జాబితా అన్ని రాజకీయ పార్టీలకు అందజేసినట్టు తెలిపారు ఎన్నికల కమిషనర్‌.. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఓటరు లిస్టులో పేరుకోసం దరఖాస్తు చేసుకున్న అందరి పేర్లు జాబితాలో చేరుస్తామని తెలిపారు. ఈనెల 20వ తేదీలోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని తెలిపారు. నోటిఫికేషన్‌లో అన్ని వివరాలు అందజేస్తామని, నోటిఫికేషన్‌ కాపీలను కూడా అందజేస్తామని నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఓటరు లిస్టులో పేరు కోసం దరఖాస్తు చేసుకున్న అందరి పేర్లు జాబితాలో చేరుస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here