Featuredస్టేట్ న్యూస్

పంచాయితీ నిధులు… కోటి రూపాయల పైగా ఉన్న అభివద్ధి శూన్యం

  • ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
  • చట్టం ఎవరి చుట్టం కాదు, అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి

గుమ్మడిదల (ఆదాబ్‌హైదరాబాద్‌): గుమ్మడిదల మండలంలోని అన్నారం గ్రామపంచాయతీ పరిధిలో కోటి రూపాయలకు పైగా నిధులు ఉన్నా అభివద్ధి జరగడంలేదని పాలకవర్గం వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియో గానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అవినీతి జరుగుతుందని ప్రశ్నించిన పలువురు వార్డు సభ్యులను టిఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నరాని, గ్రామపంచాయతీ సొంత నిధులు సుమారు 76 లక్షల వరకు అవినీతి జరిగినట్లు వార్డు సభ్యులు, ప్రజలు ఆరోపించిన వెంటనే జిల్లా పంచాయతీ రాజ్‌ ఉన్నత అధికారులు స్పందించి వెంటనే గ్రామ పంచాయతీకి సంబంధించిన దస్తావే జులు సీజ్‌ చేసి జిల్లా కేంద్రానికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు, పంచాయతీ పరిధిలో ఉన్న 261 సర్వేనెంబర్‌ లో అక్రమంగా వెలుస్తున్న వెంచర్లు అధికార పార్టీ బడాబాబుల అండతో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు అన్నారం భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించారని, ఇప్పుడు అధికార పార్టీకి చెందిన కొందరు బడా బాబుల బినామీ పేర్లతో అక్రమ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారని పలువురు గ్రామస్తులు విమర్శి స్తున్నారు. వెంటనే అక్రమ వెంచర్లను నిలిపివేసి నిరుపేద కుటుం బాలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చెప్పినట్లు బడుగు బలహీన వర్గాలకు డబల్‌ బెడ్‌ రుమాలు, భూమిలేని వారికి మూడు ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పంపిణీ చేయాలని గ్రామస్తులు కోరారు. గత ఉమ్మడి మండలం జిన్నారం ఎంపీపీ నిధుల నుండి 20 లక్షలు మంజూరైన కెసిఆర్‌ కాలనీ రోడ్డు నిర్మాణం పనులు కేవలం 20 ఎంఎం కంకర వేసి రోడ్డు పూర్తి చేయకుండానే 20 లక్షల ప్రభుత్వ నిధుల విడుదల చేసుకున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయమై ఏ ఈ పంచాయతీ రాజ్‌ శాఖ, మరియు మండల అభివ ద్ధి అధికారులు చొరవ తీసుకుని అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేయించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు, పంచాయతీరాజ్‌ ఏఈ మల్లేశం వివరణ కోరగా ఇట్టి విషయమై నాకంటే ముందు ఉన్న ఏ ఈ వెంకట్‌ రెడ్డి కి పూర్తిగా వివరాలు తెలుసని నాకు మాత్రం ఏమి తెలియదని సమాధానం ఇచ్చారు, వెంటనే జిల్లా ఉన్నత అధికారులు చొరవ తీసుకుని అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి సమస్యలకు పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close