కేసీఆర్‌ మంత్రి వర్గ విస్తరణకు ‘పంచాయతీ’ బ్రేక్‌?

0

హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల వల్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణలో మరింత జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తాము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మహమూద్‌ అలీ చేత మాత్రమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రివర్గ విస్తరణను కేసీఆర్‌ వాయిదా వేస్తూ వస్తున్నారు. జనవరిలో కెసీఆర్‌ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తూ వస్తున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. విస్తరణకు ఈ షెడ్యూల్‌ చట్టపరంగా ఆటంకమేమీ కాదు. అయితే, ఎమ్మెల్యేలంతా ఎన్నికల్లో నిమగ్నమై ఉంటారని, దానివల్ల విస్తరణలో మరింత జాప్యం జరుగుతుందని అంటున్నారు. దాంతో ఫిబ్రవరిలో విస్తరణ ఉంటుందని అనుకుంటున్నారు. మరో 6 గురు లేదా ఎనిమిది మందితో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తూ వచ్చారు.మంగళవారం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెలాఖరు వరకు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. మూడో దశ ఎన్నికలు ఈ నెల 30న జరుగనున్నాయి. విస్తరణ చేపడితే ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని కేసీఆర్‌ భావిస్తే ఫిబ్రవరి దాకా ఉండకపోవచ్చునని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here