Featuredస్టేట్ న్యూస్

జడ్జిమెంట్ తర్వాత పెన్ను ‘పాళీ’ విరగలేదు..!

◆ మరణదండనలో వేగవంతమైన తీర్పు
◆న్యాయమూర్తి ఆదర్శం
◆ చట్టంలో లేదు

జడ్జిమెంట్ తర్వాత
పెన్ను ‘పాళీ’ విరగలేదు..!
◆ మరణదండనలో వేగవంతమైన తీర్పు
◆న్యాయమూర్తి ఆదర్శం
◆ చట్టంలో లేదు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)

కరుడుగట్టిన నేరస్థులకు
న్యాయమూర్తి ఉరిశిక్ష తీర్పు ఇచ్చాక‌… మరణశాసనం లిఖించిన ఆ పెన్ను పాళీని (‘మొన‌’ను) సహజంగా న్యాయమూర్తులు విర‌గొడ‌తారు. అయితే వరంగల్ లో తొమ్మిది నెలలు పసికందును నులిమేసిన పైశాచికుడికి ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఓ మరణదండన కేసులలో ఇంత వేగంగా ఏ తీర్పు రాలేదు. మరణశిక్షల తీర్పుల అనంతరం అసలేం జరిగింది.? తీర్పు తరువాత న్యాయమూర్తి ఎలా ఉంటారు. ఈ కేసులో ఎలా ఉన్నారు.? ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న పరిశీలన కథనం.

ఇదో కోణం:
కరుడుగట్టిన నేరస్థునికి ఉరిశిక్ష విధించిన తరువాత న్యాయమూర్తి పెన్ను పాళీని విరిచేస్తారు. ఈ దృశ్యం చాలా సినిమాల్లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? భారతీయ శిక్షాస్మృతిలో ‘ఉరిశిక్ష’ అనేది అత్యంత పెద్ద శిక్ష. ఇటువంటి శిక్ష విధించిన తరువాత జడ్జి తన పెన్ను పాళీ(నిబ్)ని విరిచేస్తారు. ఇలాచేయడం వెనుక ఒక కారణం ఉంది. ఒకసారి నిర్ణయం లిఖించిన తరువాత జడ్జికి సైతం ఈ నిర్ణయాన్ని మార్చేందుకు అధికారం ఉండదు. దీనికి తోడు మరొక కారణం కూడా ఉంది. జడ్జి చేతుల మీదుగా ఒక జీవితానికి ముగింపు పలికిన పెన్ను… మరోమారు వినియోగించేందుకు ఉపకరించదు..అనే కోణం దాగి ఉంది.

ఎందుకో తెలుసా?:
ఉరిశిక్ష తీర్పు ఇచ్చాక‌…ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులు… ముద్దాయి కేసుకు సంబంధించిన తీర్పు ప్రతులపై సంత‌కం చేస్తారు. అనంతరం ఆ పెన్ మొన‌(పాళీని)ను విర‌గొడ‌తారు.! ఇది కొత్త‌గా వ‌చ్చిందేం కాదు. బ్రిటీష్ వారు భారతీయులను ప‌రిపాలిస్తున్న కాలంనాటి నుండి ఆచార‌మే కంటిన్యూ అవుతూ ఉంది.! అస‌లు న్యాయమూర్తులు ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక గ‌ల కార‌ణంలు చాలా ఆసక్తికరం.

మాన‌వీయ కార‌ణాలే..:
మర‌ణ‌శిక్షతో ఓ వ్య‌క్తి జీవితానికి చరమాంకమే. కాబ‌ట్టి దానికి కార‌ణం న్యాయమూర్తి మనసా, వాచా నమ్మి ఆ తీర్పు ప్రతులపై చేసే చివ‌రి సంత‌కం. అందుకే మరణశాసన సంత‌కాన్ని చేసిన పెన్ ను మ‌ళ్లీ వాడ‌డం , ఆ పెన్ ను చూసిన ప్రతిసారీ ఓ వ్య‌క్తి ప్రాణాల‌ను తీశాను క‌దా.! అనే ‘ఫీలింగ్’ రాకుండా ఉండేందుకు ఆ పెన్ ను మ‌ర‌లా వాడ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో పెన్ నిబ్ ను విర‌గొడ‌తారు.! ఉరిశిక్ష కు సంబంధించిన తీర్పు న్యాయస్థానంలో ఓసారి చ‌దివాక మ‌ళ్లీ దాన్ని స‌వ‌రించే అధికారం స‌ద‌రు న్యాయ‌మూర్తికి కూడా ఉండ‌దు. అందుకే రెండ‌వ ఆలోచ‌న కూడా రాకూడ‌ద‌నే ఉద్దేశ్యంతో ఇలా పెన్ నిబ్ ను తుంచేస్తారు.!

ఉరిశిక్ష తీర్పు అనంత‌రం..:
న్యాయ‌మూర్తి కూడా ఆందోళ‌న‌కు లోనైన సందర్భాలున్నాయి.! ఈ క్ర‌మంలో ఈ చిన్న ప‌ని( పెన్ నిబ్ ను విర‌గొట్ట‌డం) ద్వారా త‌న‌ను తాను కంట్రోల్ చేసుకునే అవకాశముంటుంది.

ఒక మ‌నిషిని చంపే అధికారం ఎవ్వ‌రికీ లేదు, కానీ త‌న విధుల ప్ర‌కారం న్యాయ‌మూర్తి ఈ ప‌నిని చేయాల్సి వ‌స్తుంది. అంటే ఒక‌రి చావుకు కార‌ణం త‌న సంత‌కం, దానికి కార‌ణం ఆ పెన్…అందుకే అత‌ని చావుకు చిన్న పశ్చాత‌పం. ఈ తీర్పు చూశాక భవిష్యత్తులో మరో వ్యక్తి అలాంటి పని చేయకూడదనే ‘సత్ సంకల్పం’తో ఆ “మరణశాసన సంత‌కానికి ఉప‌యోగించిన పెన్ ను కూడా చంప‌డ‌మే. (విర‌గొట్ట‌డ‌మే).!” అన్నది అంతర్లీనంగా దాగివున్న విషయం.

ఆ న్యాయమూర్తి ఆదేశం:
దేశంలో తీర్పుల కోసం ఏళ్ళకు ఏళ్ళు వేచిచూస్తున్న నవయుగంలో కేవలం 50 రోజుల్లో… అదీ ‘ఉరిశిక్ష’ తీర్పుగా ఇవ్వడం అభినందించదగ్గ ఆహ్వానించదగ్గ పరిణామం. ఆ న్యాయమూర్తి కే. జయకుమార్. ఈ ఏడాది జనవరి 7న వరంగల్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ తీర్పు సమయంలో కోర్టు హాలులో నిశ్శబ్దం, ఉత్కంఠ భరితంగా రాజ్యమేలింది. న్యాయమూర్తి మాత్రం నిశ్చలంగా తన తీర్పు పాఠంపై మరణశాసన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు తరువాత ఆయన చాలా నిశ్చలంగా మొహంలో ఎలాంటి భావాలు లేకుండా… దృఢంగా కనిపించారు. ఈకేసు విషయంలో వరంగల్ కమీషనర్ రవీందర్, ఆయన సిబ్బంది పనితనం హర్షించదగ్గది. పందొమ్మి రోజులపాటు సాక్ష్యాధారాలను సేకరించి, క్రోడీకరించినట్లు రవీందర్ ‘ఆదాబ్ ప్రత్యేక ప్రతినిధి’ చెప్పారు.

చట్టంలో లేదు:
మర్రి వాసుదేవరెడ్డి(ప్రముఖ న్యాయవాది)
ఒక మ‌నిషిని చంపే అధికారం ఎవ్వ‌రికీ లేదు. విధుల ప్ర‌కారం న్యాయ‌మూర్తి ఈ ప‌నిని చేయాల్సి వ‌స్తుంది. ఉరిశిక్ష తీర్పుపై న్యాయమూర్తి చేసిన మరణశాసన సంత‌కానికి ఉప‌యోగించిన పెన్ ను కూడ సామాన్యంగా విర‌గొట్ట‌డం జరుగుతుంది. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. అయితే అలా చేయాలని ఏ చట్టం చెప్పడం లేదు. ఏ రూలూ లేదు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close