పాక్ వక్రబుద్ధి

- భారత రాయబారికి నోటీసులు
- ఉగ్రస్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు
- సరిహద్దులోకి ప్రవేశించడానికి ప్రయత్నం
- 6-10 మంది పాక్ సైనికులు హతం
పాకిస్తాన్ తన దుర్బుద్ధిని ప్రదర్శించటం మాత్రం మానుకోవట్లేదు. మానుకోకపోగా రోజు రోజుకు హద్దు మీరుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తీవ్రవాద స్థావరాలపై భారత్ ఆర్టిలరీ గన్నులతోని దాడి చేసి వాటిని కూల్చిన విషయం తెలిసిందే. భారత్ ఇలా దాడులు చేయడం కాల్పుల విరమణ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ, భారత హై కమీషనర్ ఆహ్లువాలియాకు నోటీసులు జారీ చేసింది. ఈ ఉగ్రవాద స్థావరాల్లో భారత్ మీదికి ఉసిగొలిపేందుకు ఉగ్రఫేవాదులను తయారుచేస్తున్నారు. వీరు ఈ స్థావరాల్లో కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాటిని కూల్చడం భారత సరిహద్దు రక్షణ, దేశ శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమని సైనికాధికారులు తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుల్లెట్ల వర్షం కురిపించింది. భారత సైన్యం కాల్పుల్లో పాకిస్థాన్‌వైపు కూడా భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరిన్ని దురాగతాలకు పాల్పడుతోంది. వారం రోజుల వ్యవధిలో పాక్ సైన్యం బరితెగింపుల వల్ల నలుగురు అమాయకులు అమరులయ్యారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేసేందుకు, భారత్‌లో అలజడి సృష్టించాలనుకుంటున్న పాక్.. అనేక కుట్రలు పన్నుతోంది. సరిహద్దుల్లో నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సరిహద్దుల వద్ద హైఅలర్ట్ కొనసాగుతూనే ఉంది. అయితే సరిహద్దుల వెంట డ్రోన్లతో కూడా దాడులు చేసేందుకు పాక్ కుట్రలు పన్నుతోంది. ఇటీవల పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో వీటి ఉనికిని కూడా గుర్తించారు. తాజగా రక్షణ స్థావరాలపై కూడా దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్లాన్లు వేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో.. పంజాబ్, కశ్మీర్‌లోని రక్షణ స్థావరాల వద్ద అలర్ట్ ప్రకటించారు. పాకిస్థాన్ సైన్యం సాయంతో భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఎదురుదాడి ప్రారంభించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. తంగ్ధార్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్ బలగాలు శతఘ్నులతో విరుచుకుపడ్డాయి.ఈ ఘటనలో నలుగురైదుగురు పాక్ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్ సైన్యానికి చెందిన పోస్టులు కూడా ధ్వంసమైనట్లు తెలిసింది. బాలాకోట్ ఉగ్రశిబిరాలపై దాడి తర్వాత సైన్యం మరో కీలక ఆపరేషన్ ప్రారంభించింది. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లోకి పెద్ద ఎత్తున ఉగ్రవాదులను పంపి పాకిస్థాన్ విధ్వంసానికి యత్నిస్తోందన్న నిఘా వర్గాల హెచ్చరికల మధ్య సైన్యం అప్రమత్తమైంది. ఆదివారం ఉదయం తంగ్ధార్ సెక్టార్లో పాక్ సైన్యం జరిపిన దాడుల్లో ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారతసైన్యం వెంటనే ప్రతీకార దాడులను చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై దాడులు చేపట్టింది.
6-10 మంది పాక్ సైనికులు హతం
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుతూ పాకిస్తాన్ చేసిన పనికి భారత్ గట్టి బదులిచ్చిందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. ‘టెర్రరిస్టులు భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి సిద్ధంగా క్యాంప్‌ల్లో ఉన్నారనే సమాచారం మాకు వచ్చింది. గత నెల రోజుల కాలంలో చాలా చోట్ల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను గుర్తించాం.’ అని బిపిన్ రావత్ అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్‌ల మీద భారత ఆర్మీ మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరు నుంచి 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నట్టు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించారు. తాంగ్ధర్ వద్ద జరిగిన దాడుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ‘నిన్న రాత్రి తాంగ్ధర్ ప్రాంతంలో చొరబాటుకు టెర్రరిస్టులు ప్రయత్నించారు. ఆ సమయంలో భారత ఆర్మీ స్థావరాలపై పాకిస్తాన్ కాల్పులు జరిపింది. దీన్ని మేం తిప్పికొట్టాం. చొరబాట్లను అడ్డుకున్నాం.’ అని రావత్ తెలిపారు.