Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

పాక్‌ కవ్వింపు చర్యలు..

కాల్పుల్లో భారత జవాన్‌ మృతి

శ్రీనగర్‌ : భారత్‌ పాక్‌ సరిహద్దులో పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూ కశ్మీర్‌ లోని ఫూంఛ్‌ జిల్లా కృష్ణగటి సెక్టార్‌ లో వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్‌ మంగళవారం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ భారత జవాను మరణించాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. పాక్‌ కాల్పులకు భారత జవాన్లు ధీటుగా జవాబిచ్చారని…..పాక్‌ సైనిక శిబిరాలకు భారీ నష్టం వాటిల్లిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 36 ఏళ్ల భారత జవాన్‌ నాయక్‌ రవి రంజన్‌ కుమార్‌ సింగ్‌ మరణించారు. ”బీహార్‌లోని రోహ్తాస్‌కు చెందిన సింగ్‌కు భార్య రీతాదేవి ఉన్నారు. సింగ్‌ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే నిబద్ధతతో కూడిన సైనికుడని, ఆయన సమున్నత త్యాగాన్నిదేశం సదా స్మరిస్తుందని” రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇండో-పాక్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ఇటీవల తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close