Featuredజాతీయ వార్తలు

పాక్‌ తీవ్రవాదాన్ని పెంచిపోషించింది

  • యువతను ఉగ్రవాదంవైపు మళ్లించింది
  • గత పదేళ్ల పాలనలో మన సైనికులను పాక్‌ హతమార్చింది
  • అయినా మౌన ప్రధాని పెదవి విప్పలేదు
  • హర్యానా ఎన్నికల ప్రచారంలో కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

కశ్మీర్‌లో 370 అధికరణను అడ్డుపెట్టుకుని అక్కడి యువతను ఉగ్రవాదం వైపు పాక్‌ మళ్లించిందని, అయినప్పటికీ కాంగ్రెస్‌ తన హయాంలో ఆ అధికరణను రద్దు చేయలేకపోయిందని కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా అన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడాడు. 370 అధికరణ కారణంగానే జమ్మూకశ్మీర్‌ యువతకు ఆయుధాలు ఇచ్చి వారిని పాకిస్థాన్‌ తప్పుదారి పట్టించిందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 90వ దశకంలో ప్రారంభమైన ఉగ్రవాదం ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చిందని, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదానికి 40,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇంత జరిగినా 370 అధికరణను కాంగ్రెస్‌ ఏరోజూ రద్దు చేయలేదన్నారు. కాంగ్రెస్‌ గత పదేళ్ల పాలనలో మన సైనికుల తలలను పాకిస్థాన్‌ నరికేస్తున్నా మౌన ప్రధాని పెదవి విప్పలేదని అమిత్‌షా విమర్శించారు. ఉరి, పుల్వామా దాడుల సమయంలోనూ పాక్‌ ఇదే తరహా దురాగతాలకు పాల్పడేందుకు ప్రయత్నించిందని, అయితే ఈసారి మాత్రం వారికి గుణపాఠం చెప్పేందుకు మెరుపుదాడులు, వాయుదాడులు జరిపామని అమిత్‌షా అన్నారు. హర్యానా సాహసవీరుల గడ్డ అని, సరిహద్దుల్లో తమ వీరపుత్రులను కోల్పోని గ్రామమంటూ ఇక్కడ లేదని అమిత్‌షా కొనియాడారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టార్‌ అవినీతిరహిత పాలనను అందించారని, ఆయన నాయకత్వంలో మాత్రమే రాష్టాభ్రివృద్ధి జరుగుతుందని అన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close