Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఆలయాలలో అల్లుకున్న అన్యమం

నిరసనలకు భాజపా సిద్ధం

? తిరుమలో కిరీటం, ఉంగరాలు గల్లంతు

? శ్రీశైలంలో అన్యమతస్తులకు ఉద్యోగాల రచ్చ

? ముందే హెచ్చరించిన ‘ఆదాబ్‌’

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఆంధ్రప్రదేశ్‌ లో భాజపాకు బలమైన ఆయుధం దొరికింది. తిరుమలలో స్వామివారి నగలు మాయం. శ్రీశైలం, ఇతర దేవాలయాలలో అన్య మతస్థులకు ఉద్యోగాలు కల్పించారనే ఆరోపణలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగుచూస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ ఏడాది మే, 30వ తేదీన ‘సిఎం జగన్‌… మతం’ సవాల్‌ పేరుతో ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ఓ పరిశీలన కథనం అందించింది. అయినా ఆంధ్రప్రదేశ్‌ లో పరిస్థితిని సిఎం జగన్‌ అర్థం చేసుకున్నారా..? లేదా..? భాజపా మాత్రం ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భావిస్తోంది.

ఃూచీ1:

గోవిందా… గోవిందా…

? తితిదే ట్రెజరీలో 5కిలోల వెండికిరీటం మాయం

? రెండు బంగారు ఉంగరాలు కూడా

తిరుమల:

తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కలకలం చోటు చేసుకుంది. తితిదే ట్రెజరీలోని 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై తితిదే ఏఈవో శ్రీనివాసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతడి జీతం నుంచి రికవరీ చేసుకున్నారు. అసలు ఈ ఘటనకు కారకులెవరన్న విషయంపై తితిదే దృష్టి సారించకుండా.. కేవలం ఏఈవో శ్రీనివాసుల జీతం నుంచి రికవరీ చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆయనొక్కరినే ఎందుకు బాధ్యుల్ని చేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

చెక్‌ పెడతారా…?:

దేవాలయాల్లో అన్యమతస్థులు పని చేయడంపై వస్తున్న అభ్యంతరాలకు చెక్‌ పెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో తెలియదు. కానీ దేవస్థానాలలో అన్యమతస్థుల ప్రమేయంపై సోషల్‌ విూడియాలో జరుగుతున్న ప్రచారం, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ప్రభుత్వ ప్రతిష్టకు సవాల్‌ గా మారింది. తిరుపతి, శ్రీశైలం లాంటి వివిధ ప్రముఖ దేవాలయాలలో ముస్లింలు, క్రిష్టియన్లు పని చేస్తున్నారని సోషల్‌ విూడియాలో మెసేజ్‌ లు పంఖాను పుంఖాలుగా వెలువడుతున్నాయి.

బస్సు టికెట్లపై…:

తిరుమల ఆర్టీసీ బస్సుల్లో జరూసలేం యాత్ర ప్రకటనలతో టిక్కెట్టు జారీ చేయడం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్టకు తీరని భంగం కలిగింది. వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్రిష్టియన్‌ కాబట్టి ఇలా జరుగుతున్నదనే వ్యాఖ్యానాలు వినిపించాయి. అంతే కాకుండా ఆయన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన విషయాలను కూడా పనిలో పనిగా సోషల్‌ విూడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. తిరుమల కొండ పై అప్పటిలో జరిగిన అన్యమత ప్రచారం పై ఇప్పుడు సోషల్‌ విూడియాలో దుమ్మెత్తి పోశారు.

తక్షణమే..:

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించినట్లుగా కనిపిస్తున్నది. ముందుగా తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలలో పని చేస్తున్న ఇతర మతాల వ్యక్తులకు ఉద్వాసన చెప్పే విధంగా ఏపి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇది ఎంత వరకు ఫలిస్తుందో తెలియదు. ఎందుకంటే వారిలో చాలా మంది పర్మినెంటు ఉద్యోగులు ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం హయంలో నియమితులైన వారు అంటే దాదాపుగా ఐదు సంవత్సరాలకు పైబడి పని చేస్తున్నవారు ఉన్నారు. అంతే కాదు కొన్ని సేవలను అవుట్‌ సోర్సింగ్‌ కు ఇచ్చారు. అవుట్‌ సోర్సింగ్‌ తీసుకున్న కాంట్రాక్టర్లు అన్యమతస్థులను వినియోగిస్తున్నసందర్భాలు కూడా ఉన్నాయి.

అంత సులభం కాదు…:

ఇలాంటి చర్యలను సరిదిద్దడం అంత సులభమైన పనినేం కాదు. అయితే ఆంధ్రప్రదేశ్‌ లో ఈ అంశాన్ని ఉపయోగించుకుని భారతీయ జనతా పార్టీ ఉద్యమాలకు సిద్ధం అవుతున్నది. ఇప్పటికే పలు చోట్ల ఉద్యమాలు ఊపందుకున్నాయి. తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలకు సంబంధించిన ఉద్యమాలు తీవ్రంగా ఉన్నాయి. అలాగే ఇది అన్ని దేవస్థానాలకు విస్తరిస్తున్నది కూడా. అందుకోసమే దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ చర్యలలో భాగంగా రెండు రోజుల కిందట తిరుమల పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం అక్కడ జరిగిన అధికారిక సమావేశంలో అత్యంత కఠినమైన నిర్ణయాన్ని వెల్లడించారు.

బతికేది ఆయన చెంత… మరో ప్రచారం ఎలా…:

దేవస్థానాలలో పని చేసే ఉద్యోగులు విధిగా దేవుడి పట్ల భక్తి శ్రద్ధలతో ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇది ఎవరో వీడియో తీసి బయటకు పంపడంతో ఇప్పుడు అది సోషల్‌ విూడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. దేవస్థానాలలో పనిచేస్తూ తమకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పేవారు దేవస్థానాలు వదిలి వెళ్లాలని ఆయన ఘాటు హెచ్చరిక చేశారు. తిరుమల దేవస్థానాలలో పని చేసే అన్యమస్థులు తమంతట తాముగా తప్పుకుంటే మంచిదని ఆయన అన్నారు. అలాకాని పక్షంలో ఏరివేత జరుగుతుందని ఎల్‌ వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

ఇలా అయితేనే…:

మతం అనేది ప్రయివేటు వ్యవహారమని, ఎవరికి ఇష్టం వచ్చిన మతం వారు అనుసరించవచ్చునని అయితే తిరుమల దేవస్థానంలో పని చేస్తూ తమకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం లేదంటే మాత్రం కుదరని ఆయన అన్నారు. స్వచ్ఛదంగా వైదొలగని అన్యమత సిబ్బంది ఇళ్లకు వెళ్లి పరిశీలించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లలో కూడా విధిగా వేంకటేశ్వర స్వామికి సంబంధినంచిన ఫొటోలే ఉండాలని కూడా ఆయన అన్నారు. అలా కాకుండా తిరుమల సిబ్బంది వేరే విధంగా ప్రవర్తిస్తే ఇక సహించేది లేదని ఆయన హెచ్చరించారు. శ్రీశైలం దేవస్థానంలో ముస్లింలు ఎక్కువగా పని చేస్తున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. గతంలో అక్కడ పని చేసిన కార్యనిర్వహణాధికారి ముస్లింలతో సన్నిహిత సంబంధాలు నెరపి అక్కడ వారికి ఉద్యోగాలు ఇప్పించారు.

భాజపాకు భయపడైనా…:

ఈ విషయంపై ఫిర్యాదులు వచ్చినా అప్పటిలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వారికి కూడా ఉద్వాసన పలికే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు పని చేయడం తీవ్ర అభ్యంతరకరం. అందుకని సత్వర చర్యలు తీసుకోవడం అనివార్యం. కనీసం బిజెపి చేసే ఉద్యమాలకు భయపడి అయినా సత్వర చర్యలు తీసుకోవడం మంచిదే.

ఃనీలీ:

శ్రీశైలంలో…:

శ్రీశైలం దేవాలయంలో పనిచేస్తున్న కొత్తగా నియమించిన వారిలో… సిహెచ్‌.యొహాను, డి.ఇబ్రహిం, కె.ఏబు,

ఎం.చాందీ భాయ్‌,

వై..ఇజ్రాయెల్‌,

పి.డానియోల్‌,

కె..బెంజిమన్‌,

సి.ఇమాన్యుల్‌,

సిహెచ్‌.ఇజాక్‌,

డి.దేవరాజు,

జి.మేరి,

జె.లాజర్‌,

జె..మరియమ్మ, కె.మరియమ్మ. వీరితో పాటు ఇంకో ముగ్గురు మైనార్టీ వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని తెలిసింది.

ఇప్పటికే మొత్తం పార్వతీపురం నుంచి శ్రీశైలం వరకు ఉన్న కొండ ప్రాంతాల్లో ఒక మతానికి చెంది పార్థనా మందిరాలు పెద్ద ఎత్తున కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close