Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

దివ్యక్షేత్రంగా మన యాదాద్రి

యాదాద్రి (ఆదాబ్‌ హైదరాబాద్‌): 1100 ఎకరాల్లో టెంపుల్‌ సిటీ నిర్మాణం జరుగుతోందని, ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ నిర్మాణం జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్‌… యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని దర్శిం చుకున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలి కాప్టర్‌లో వడాయిగూడెం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో యాదాద్రికి చేరుకున్నారు.ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్‌ యాదా ద్రికి రావడం ఇదే తొలిసారి. అనంతరం బాలాలయంలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలియతిరిగి పను లను పరిశీలించారు. అంతకుముందు.. హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించిన సీఎం.. ఆలయ పునర్నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ఆలయ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురుగోతిపై కేసీఆర్‌ సవిూక్షించారు. అనంతరం విూడియాతో మాట్లాడారు. యాదాద్రి క్షేత్రం సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందని కేసీఆర్‌ ఆరోపించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఓ అద్భుత క్షేత్రంగా ఖ్యాతిగాంచిందన్నారు. యాదాద్రి ఆలయం దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోందన్నారు. నిత్యాన్నదాన సత్రం నిర్మాణానికి రూ.10కోట్లు విరాళాలు వచ్చాయని చెప్పారు. ఉత్తరభాగంలో ఆలయం కిందివైపు భూమిని సేకరించడం జరిగిందని, స్థల సేకరణకు రూ.70కోట్లు విడుదల చేస్తున్నామని, నిత్యాన్నదాన సత్రాలు, బస్‌స్టేషన్‌, ఇతర నిర్మాణాలు చేపడుతామని కేసీఆర్‌ చెప్పారు. యదాద్రి ప్రపంచంలోనే యూనిక్‌ టెంపుల్‌ అన్నారు. ఏడంతస్తుల గోపురం కూడా శిల్పాలతోనే కట్టామన్నారు. ఆలయాలు ఒక తరం నుంచి మరో తరానికి సంస్కృతిని, సంస్కారాన్ని అందిస్తాయని చెప్పారు. 250 ఎకరాల్లో 350 క్వార్టర్ల నిర్మాణం చేస్తామని, క్వార్టర్ల నిర్మాణానికి 43 మంది దాతలు ముందుకు వచ్చారని సీఎం చెప్పారు. 50 ఎకరాల్లో ప్రవచన మంటపం నిర్మిస్తామన్నారు. మరో 10, 15 రోజుల్లో మళ్లీ యాదాద్రికి వస్తానని సీఎం చెప్పారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి 133 దేశాల నుంచి వైష్ణవ పండితులు వస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం పనులు 90 శాతం పూర్తయ్యాయి. అలయం లోపల అళ్వార్ల విగ్రహాలు, ఆంజనేయస్వామి ఆలయం నిర్మాణం పూర్తిచేయగా కేవలం ఫ్లోరింగ్‌ పనులు మిగిలిఉన్నాయి. అష్టభుజ విగ్రహాల అమరిక పనులు కొనసాగుతున్నాయి. సప్త గోపురాలు అందంగా ముస్తాబయ్యాయి. పనులు 100శాతం పనులు పూర్తికాగా ప్రధానాలయానికి అనుబంధంగా నిర్మిస్తున్న శివాలయం పనులు కూడా 70 శాతం పూర్తయ్యాయి. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నిర్మాణం పనులు, వీఐపీ సూట్స్‌ పనులు సైతం 50 శాతం జరిగాయి. టెంపుల్‌ సిటీలో ఇన్‌ఫ్రా లేఅవుట్‌ సిద్ధమయింది. విష్ణు పుష్కరిణి నిర్మాణం, కల్యాణకట్ట, సత్యనారాయణస్వామి వ్రతమండపాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 20వేల మంది కూర్చొని స్వామివారి కల్యాణాన్ని తిలకించే మండపం నిర్మాణానికి స్థలాన్ని ఓకే చేశారు. కొండపైకి వచ్చే వాహనాలు, బస్సులకు పార్కింగ్‌ పనులు కూడా పూర్తిచేశారు. లడ్డూ తయారీ, విక్రయకేంద్రాల పనులు 40శాతం జరిగాయి. ఈ ఏడాది మార్చి చివరికల్లా ప్రధాన ఆలయ విస్తరణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) ఆ మేరకు ప్రణాళికలతో ముందుకెళ్తోంది. యాదాద్రి ఆలయ పునర్‌ నిర్మాణ పనుల్లో పాలుపంచుకోవడం తన అదృష్టమని ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి అన్నారు. సీఎం కేసీఆర్‌, ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామి సూచనల మేరకు డిజైన్లు రూపొందించామని.. ఆ దిశగానే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అన్ని పనులు ఆగమశాస్త్రానికి అనుగుణంగానే జరుగుతున్నాయని తెలిపారు.

2014 అక్టోబర్‌ నుంచి నేటివరకు..

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ¬దాలో కే చంద్రశేఖర్‌రావు 2014 అక్టోబర్‌ 17న యాదగిరికొండపై అడుగుపెట్టారు. యాదగిరి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించి అద్భుత పుణ్యక్షేత్రంగా మారుస్తామని అదేరోజు ప్రకటించారు. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిన కేసీఆర్‌.. ముఖ్యమంత్రిగా విధుల్లో తలమునకలవుతూనే ప్రతి పదిహేనురోజులకోసారి నిర్మాణ పనులపై సవిూక్షలు నిర్వహిస్తూ వచ్చారు. అటు అధికారులు, ఇటు ప్రధాన శిల్పులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక యాదాద్రి దివ్యక్షేత్రంగా మారుతుండగా.. పరిసర ప్రాంతాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. అదేస్థాయిలో పర్యాటక రంగం కూడా ఊపందుకున్నది.

సీఎం చర్చించిన పలు అంశాలు…

శ్రీ కొండపైకి వచ్చే భక్తులకు మంచినీటి సరఫరా చేసే సీఎం కేసీఆర్‌ విషయంపై ఆరాతీస్తారు. గ్రావిటీ ద్వారా తాగునీటిని చేరవేసే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మిషన్‌ భగీరథ అధికారులతో చర్చిస్తారు. రాయగిరి నుంచి యాదాద్రి వరకు ఏర్పాటుచేసిన గ్రీనరీ పరిరక్షణ, టెంపుల్‌సిటీలో బ్యూటిఫికేషన్‌ పనులను వేసవిలో పరిరక్షించే విషయంపై

శ్రీ గిరిప్రదక్షిణ రోడ్డు నిర్మాణం పనులను స్వయంగా పరిశీలిస్తారు. గిరిప్రదక్షిణకు అడ్డుగా ఉన్న వంద ఇండ్లను ప్రస్తుతం తొలగించకుండా పనులను చేపట్టాలనే విషయంపై దిశానిర్దేశం

శ్రీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు విడిదిచేయడానికి ఉద్దేశించిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నిర్మాణం కోసం సేకరించిన పదమూడున్నర ఎకరాలల్లో చేపట్టనున్న పనుల విషయంలో అధికారులకు తగిన సూచనలు

శ్రీ తిరుమల, శ్రీశైలంలో మాదిరిగా భక్తులు కాటేజీలు నిర్మించి.. పర్యవేక్షణాధికారం మాత్రం దేవస్థానం వారికే అప్పగించే విధివిధానాల రూపకల్పనపై ఆదేశాలు.. ఇందుకోసం దాతలకు ఆహ్వానాలు… టెంపుల్‌సిటీలో మరో 750 ఎకరాల్లో కూడా చేపట్టనున్న నిర్మాణ పనుల విషయంపై..

పదోసారి యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి ¬దాలో కేసీఆర్‌ పదోసారి యాదాద్రిని దర్శించుకోవడం. మొట్టమొదటిసారి 17-10-2014న శ్రీవారిని దర్శించుకొన్నారు. 2014లో డిసెంబర్‌ 17న రెండోసారి వచ్చారు. 2015లో ఫిబ్రవరి 25, 27న, మార్చి 5న జరిగిన శ్రీవారి కల్యాణంలో సతీసమేతంగా పాల్గొన్నారు. మే 30న యాదాద్రి అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి వచ్చారు. జూలై 5న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతోపాటు యాదాద్రిని దర్శించుకున్నారు. 2016 అక్టోబర్‌ 19న పనులను పర్యవేక్షించారు. నవంబర్‌ 23, 2017న పర్యటించి పలు సూచనలు చేశారు.

వైభవంగా ఆలయ ప్రతిష్ఠ

”లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్‌నిర్మాణ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 1008 ¬మ గుండాలతో చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది. బద్రీనాథ్‌ నుంచి కూడా వైష్ణవ సంప్రదాయం ఆచరించే స్వాములందరూ వస్తారు. 133 దేశాల నుంచి వైష్ణవ ఆధ్యాత్మిక వేత్తలు వస్తామని లేఖలు రాశారు. ఆలయ ప్రతిష్ఠ సమయంలో యాదాద్రికి సుమారు 5నుంచి 15లక్షల మంది భక్తు లు వచ్చే అవకాశముంది. దాదాపు 6,500 మంది రుత్వికులు ఏకకాలంలో వేద పఠనం చేస్తారు. వాళ్ల సహాయకులే 2..3వేల మంది ఉంటారు. యాగం చేసే రుత్వికులు, పూజారులే 12వేల మంది వరకూ ఉంటారు. నేనే దగ్గరుండి ఓ కార్యకర్తగా పనిచేసి ఆ కార్యక్రమం పూర్తి చేస్తా. భువనగిరి ఖిల్లా, కొలనుపాక ఆలయం ఒక సర్క్యూట్‌ కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బస్వాపూర్‌ దగ్గర 250ఎకరాల స్థలం ఉంది. బస్వాపూర్‌ ప్రాజెక్టులో కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌స్టార్‌ ¬టల్స్‌, హైటెక్‌సిటీలోని హెచ్‌ఐసీసీ తరహాలో హాల్స్‌ ఉంటాయి. థియేట ర్స్‌, మల్టిపుల్‌ కాంప్లెక్స్‌, బోటింగ్‌ కూడా ఉంటాయి. యాదాద్రి వద్ద నిర్మిస్తున్న ఆరు లైన్ల రింగ్‌రోడ్డుకు కూడా ఈరోజే నిధులు మంజూరు చేశాం. రెండు.. మూడు నెలలకే నిర్మాణ పనులు పూర్తవుతాయని దయచేసి పత్రికల్లో రాయొద్దు. నేను చెప్పే వరకూ ఆలయ ప్రతిష్ఠ గురించి రాయొద్దు” అని సీఎం కోరారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close