ఓటు వేయడం మన కర్తవ్యం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): హైదరాబాద్‌ నగరంలో గవర్నర్‌ నరసిం హన్‌ దంపతులతోపాటు పలువురు రాజకీయ, సినిమా, ప్రముఖులు తాజా మాజీ మంత్రులు ఓటేశారు. ”ఈ రోజును సెలవుగా భావించకుండా… ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియో గింటుకోవాలని” నరసింహన్‌ పిలుపునిచ్చారు. ”ఓటు వేసినప్పుడే సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశముంటుందని” గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణి శోభతో కలిసి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్‌లో సైతం ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఖైరతాబాద్‌ నియోజక వర్గం లోని సెయింట్‌ నిజామిస్‌ ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులతో వచ్చి చిక్కడపల్లి శాంతినికేతన్‌ మైదానంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. భాజపా అంబర్‌పేట్‌ నియోజకవర్గ అభ్యర్థి గంగాపురం కిషన్‌ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి కాచిగూడ దీక్షా మోడల్‌ హైస్కూల్‌ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమాజహితం కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని పొలింగ్‌ శాతాన్ని పెంచాలని కోరారు. కిషన్‌ రెడ్డి కూతురు వైష్ణవి తొలిసారిగా ఓటు వేశారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ రాంనగర్‌ జెవి. హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్‌ సరళి నిశ్శబ్దంగా జరుగుతోందని, ఓటర్లు తమ మనసులోని అభిప్రాయాన్ని ఎవరితో పంచుకోకుండా ఓట్లు వేస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేసి పోలింగ్‌ శాతాన్ని పెంచాలని కోరారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గంలోని పొతంగల్‌లోని ప్రభుత్వ ప్రాథమి కోన్నత పాఠశాలలో భర్తతో కలిసి ఎంపీ కవిత ఓటు వేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఎన్నికల్లో మహాకూటమి నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెజస అధ్యక్షుడు, ప్రజాకూటమి ఛైర్మన్‌ కోదండరామ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తార్నాకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని నాంపల్లి హుమయూన్‌ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్‌లోని కాశ్మీర్‌ గడ్డ యునైటెడ్‌ ఇంగ్లీష్‌ విూడియం స్కూల్‌లో కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోదాడలో ఓటేసిన ఉత్తమ్‌ దంపతులు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఇవి రెడ్డి కాలేజ్‌లోని బూత్‌ నెంబర్‌ 161లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓట వేశారు. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి పద్మావతి కూడా ఓటు వేశారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో పోటీ చేస్తుండగా, ఆయన సతీమణి పద్మావతి కోదాడలో ఎన్నికల బరిలో ఉన్నారు. ఇకపోతే జానారెడ్డి నాగార్జునసాగర్‌లో ఓటేశారు. జిల్లాకు చెందిన ప్రముఖులు కూడా తమ ఓటును వినియోగించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here