Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలు

పట్టణీకరణలో మన రాష్టాన్రికి ఐదోస్థానం

అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు

  • పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు
  • పారదర్శకత, జవాబుదారీతనం అమల్లోకి..
  • రాష్ట్రంలో వందశాతం ఓడీఎఫ్‌లు
  • మూసీ సుందరీకరణ హావిూకి కట్టుబడి ఉన్నాం
  • అసెంబ్లీలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌

పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం

శాసన సభలో చర్చ సందర్భంగా సభ్యుల అడిగి ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

పాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు ఏర్పుటు చేసుకోవడంతో పట్టణీకరణ పెరుగుతోందని కేటీఆర్‌ తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ప్రణాళికబద్ధంగా పురోగతి ఉండాలని, దాని ప్రకారమే ప్రభుత్వ పరంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. పట్టణీకరణలో మన రాష్టాన్రికి ఐదోస్థానం ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సేవ చేసే ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే కొత్త మున్సిపాలిటీ చట్టం తెస్తున్నామని, కొత్త మున్సిపాలిటీ చట్టంలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం అమలులోకి తెస్తున్నామని తెలిపారు. సచ్ఛభారత్‌, స్వచ్ఛసర్వేక్షణ్‌ను అమలు చేస్తున్నామని, సత్వరమే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే విధానం తెచ్చామని మంత్రి తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా రాష్ట్రంలో వందశాతం ఓడీఎఫ్‌లు సాధించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక హరితహారం, ప్రతి మున్సిపాలిటీలోనూ పెద్ద ఎత్తున హరితహారం అమలు చేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఇంకా మెరుగ్గా చేయాలన్న సూచనను పరిగణలోకి తీసుకున్నామని, తడి, పొడి వ్యర్థాల నిర్వహణలో మనం పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీలను ఏర్పాటు చేసుకుంటున్నామని, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుపై దృష్టి సారించామని తెలిపారు. దేశంలో ఐదో అతిపెద్ద నగరం హైదరాబాద్‌ అని, హైదరాబాద్‌ నగరంలో వేగవంతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ ఆదా చేస్తున్నామని అన్నారు. వినూత్నరీతిలో హైదరాబాద్‌లో మున్సిపల్‌ బాండులు తీసుకువచ్చామని, రహదారుల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా జవహార్‌నగర్‌ డంపింగ్‌ యార్డు క్యాపింగ్‌ పక్రియను పూర్తిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో పేదలకు బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చామని, భవిష్యత్‌లో బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచుతామన్నారు. ముసీ సుందరీకరణ హావిూకి మేము కట్టుబడి ఉన్నామని, మురికి నీటి శుద్ధికి అవసరమైన ప్లాంట్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close