-మా పోరాటం ఆగదు..

0
  • సీఎల్పీ విలీనంపై హైకోర్టులో సవాల్‌
  • స్పీకర్‌ నిర్ణయాన్ని రద్దు చేయాలని వినతి
  • విచారణను వాయిదా వేసిన న్యాయస్థానం
  • పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న ఉత్తమ్‌

హైదరాబాద్‌ :

తెరాస శాసనసభాపక్షంలో సీఎల్పీ విలీనాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. స్పీకర్‌ జారీ చేసిన సీఎల్పీ విలీనం ఉత్తర్వులను రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపు తామని హైకోర్టు తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను.. తెరాస శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ స్పీకర్‌ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని.. కాంగ్రెస్‌ నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎల్పీ తీర్మానం లేకుండానే.. 12 మంది ఎమ్మెల్యేలు కోరడం.. స్పీకర్‌ దాన్ని యథాతథంగా ఆమోదించడం చట్టబద్ధంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ నిర్ణయాన్ని కొట్టివేయాలని వారు కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశంపై మంగళవారం విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ఇదిలావుంటే తెరాసలో సీఎల్పీ విలీనంపై తాము హైకోర్టును ఆశ్రయించామని.. మంగళవారం హైకోర్టులో విచారణకు వస్తుందన్నారు. అక్కడ వచ్చే తీర్పు ఆధారంగా సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కుతామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష ¬దా ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీకి ఏవిధంగా ఇస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని తెరాస ఖూనీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయనున్నట్టు ప్రకటించారు. తెరాసలో సీఎల్పీ విలీనం వ్యవహారంపై కేసీఆర్‌ నోరు విప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేయడంపై తాము చేపట్టిన పోరాటం ఇంతటితో ఆగదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. దీక్షా శిబిరంపై దాడి చేసి భట్టి విక్రమార్కను అరెస్ట్‌ చేయడాన్ని ఆయన ఖండించారు. తెరాసకు 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక ఉండకూడదనే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసుకున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను విలీనం చేయడం ఏమిటన్నారు. తామంతా చేసిన విజ్ఞప్తితోనే భట్టి దీక్ష విరమించారని స్పష్టంచేశారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here