Featuredస్టేట్ న్యూస్

మన ఫిరాయింపుల మాటేంటీ…

గులాబీ బాస్‌కు కొత్త తలనొప్పులు..

ఆంధ్రా సిఎం వ్యాఖ్యలపై అయోమయం..

పార్టీ ఫిరాయింపులపై ఏలా స్పందిస్తారో..

మనం మాటలు మాత్రమే చెప్పాలి.. మన మాటలు కోటలు దాటాలి.. పనులన్నీ చేసినట్టు, ప్రగతి సాధించినట్లు నియమ నిబంధనాలన్నీ పాటించినట్టు గొప్పలు చెపుతూనే ఉండాలి. కాని అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా పాటించొద్దు.. మనం నీతులు చెప్పడానికే కాని అవలంభించడానికి కానే కాదని చెపుతుందీ తెరాస అధినాయకత్వం.. మనల్ని ప్రశ్నించేదెవరూ, మన పాలన మన ఇష్టమంటూ పార్టీ ఫిరాయింపులకు జెండా ఊపింది టిఆర్‌ఎస్‌.. రండీ రండీ రండీ దయచేయడంటూ అందరిని కడుపులో పెట్టి అక్కున చేర్చుకుంది.. చివరకు కాంగ్రెస్‌ పార్టీని తెరాసలో విలీనం చేసింది. మేము చేసిందీ కరెక్ట్‌.. తప్పు అసలే కాదని చెప్పినా టిఆర్‌ఎస్‌ అధినాయకుల మాటలు తప్పు కాదు తప్పున్నర అని ఆంధ్రా అసెంబ్లీలో తేలిపోయింది.. ఆంధ్రా సిఎం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించేది లేనే లేదని ఎవరైనా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి గెలిచాకనే అడుగుపెట్టాలందీ. అందుకు స్పీకర్‌కు పూర్తి అధికారాలు ఇచ్చింది.. ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టిన కెసిఆర్‌… అక్కడ సిఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన కెసిఆర్‌… అలాయ్‌, బలాయ్‌ అంటూ తిరుగుతున్న కెసిఆర్‌కు అక్కడ తప్పు అని చెప్పిన పార్టీ ఫిరాయింపులు ఇక్కడ ఒప్పేలా అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.. అంతగా ఎమ్మెల్యెల బలం, బలగం కావాలనుకుంటే పార్టీలోకి వచ్చిన వారందరిచే రాజీనామా చేయించి గెలిచాకనే అందరిని చేర్పించుకోవచ్చు కదా అనే ఆలోచన అందరిలో వస్తుందీ.. దేశంలో రాజకీయాలను మార్చే సత్తా ఉన్నా కెసిఆర్‌కు ఇలాంటి ఆలోచన ఎందుకు రావడం లేదు.. పార్టీ ఫిరాయింపులు తప్పు, అందుకు చట్టాలను మరింత బలోపేతం చేయాలని చెప్పినా ఆంధ్రా సిఎం పదాలను తెలంగాణ సిఎం పాటిస్తాడా, లేదా అనేది ఇప్పుడు అసలు చర్చానీయాంశంగా మారిపోయింది. చెప్పకనే చెప్పినట్టే పార్టీ ఫిరాయింపులు చేయడం తప్పేనని తెలుగురాష్ట్రాల ప్రజలందరికి తెలిసిపోయింది. ఫిరాయింపుల తప్పును కెసిఆర్‌ ఏలా సమర్థించుకుంటారో, ప్రత్యర్థుల మాటలకు ఏలాంటి సమాధానం చెపుతారనేదే ఇప్పుడు తెరాస ముందున్న అసలు సిసలైనా రాజకీయం…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

మొన్నటికి మొన్న నెలరోజులు కూడా కాని అంధ్రా ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని, ఎవరైనా పార్టీ మారి వేరే పార్టీలోకి రావాలని ఆలోచన ఉన్నా, పార్టీ మారాలని అతృత చూపినా రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచాకనే చేరాలనుకునే పార్టీలోకి అడుగుపెట్టాలని అసెంబ్లీ వేదికగా బహిరంగంగా చెప్పారు. అభ్యర్థి ఏ పార్టీ వాడైనా కాని ఫిరాయింపుల చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలని చెప్పారు.. అసెంబ్లీ మొదటిరోజే అక్కడి సిఎం చెప్పినా మాటలు దేశవ్యాప్తంగానే సంచలనమయ్యాయి. ఎంతోమందిని ఆలోచింపచేశాయి.. ఒక పార్టీలో గెలిచినా వ్యక్తి ఓటేసినా ఓటర్ల నమ్మకాన్ని వమ్ముచేసి తన స్వార్థం కోసం పార్టీ మారడాన్ని అందరూ తప్పుపడుతూనే ఉన్నారు. అదీ పార్టీ ఫిరాయింపుల కిందికే వస్తుందని దానిని అందరూ తప్పుపట్టాల్సిన అవసరమేనన్నారు. ఒక పార్టీ పేరుతో గెలిచి వారం, పదిరోజులు కూడా కాకముందే వేరే పార్టీలోకి మారడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి వారిపై పూర్తిగా అనర్హత వేటు వేయాలని ఆందోళనలు చేసే వారు పెరిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రా సిఎం మాటలు కూడా వీటికి బలం చేకూర్చడంతో తెలంగాణ ముఖ్యమంత్రిపై ఆరోఫణలు వెల్లువెత్తుతున్నాయి. టిఆర్‌ఎస్‌ పార్టీకి అసెంబ్లీలో తగినంత బలం ఉన్నా కాని రాష్ట్రంలో పాలనపై దృష్టి సారించకుండా ఫిరాయింపులపైననే ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.. ఆంధ్రాలో పార్టీ ఫిరాయింపులు తప్పని చెప్పారు.. అక్కడ పాటించపోయే అదే నియమాలను, అదే నిబంధనలను మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు పాటించలేకపోతున్నారు. అసెంబ్లీలో అనుకున్నంత మెజారిటి ఉన్నా ఎందుకు వలసలను ప్రోత్సాహిస్తున్నారు.. పార్టీ మారే వారిని రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలిచాకనే తమ పార్టీలోకి రావాలని ఎందుకు చెప్పలేకపోతున్నారు. అంటే మన ముఖ్యమంత్రి నీతులు చెప్పడానికే కాని పాటించడానికి కాదని తెలిసిపోతుంది. పక్కరాష్ట్రం వాళ్లు తప్పు అని చెప్పినా విషయాలు మన ముఖ్యమంత్రికి ఒప్పుగానే మారుతున్నాయి.. ఇతర పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యెలచే రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్ష కాంగ్రెస్‌ వెంటపడుతోంది.. కోర్టుకు సైతం వెళ్లింది.. కాని మన తెలంగాణ ప్రభుత్వానికి అలాంటి పట్టింపులేవి ఉండవని పక్క రాష్ట్రంతో మనకేమి పని, వారెమైనా చేసుకుంటారు. వారు ఏలాగైనా ఉంటారనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మన పార్టీ, మన ప్రభుత్వం మన ఇష్టమైనప్పుడు పక్కవారి పాలనలో, రాజకీయంలో వేలు పెట్టడమెందుకనేదే ఇప్పుడు చర్చనీయాంశమైన అంశంగా మారిపోయింది.. పార్టీ ఫిరాయింపులపై పక్క తెలుగు రాష్ట్రానికో న్యాయం, మనకో న్యాయమా అనే తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు..

మిత్రుడనుకుంటే ఇలా చేస్తున్నడేంటీ..

చంద్రబాబును ఆంధ్రాలో గద్దె దింపేందుకు నానా ప్రయత్నాలు చేసిన వారిలో కెసిఆర్‌ సైతం ప్రముఖ పాత్ర పోషించాడని చెప్పవచ్చు. జగన్‌ అంధ్రాలో సిఎం కావాలని కొరుకున్న వ్యక్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ముందు వరుసలో ఉంటారు. ఆంధ్రాలో అసెంబ్లీ ఫలితాలు వెలువడగానే జగన్‌కు ఫోన్‌ చేసి అభినందించిన వ్యక్తి కెసిఆర్‌. జగన్‌ కూడా తన ప్రమాణ స్వీకారానికి రావాలని కెసిఆర్‌ను ఆహ్వనించారు. కెసిఆర్‌ సైతం ప్రమాణస్వీకారానికి వెళ్లి ఆశీర్వాదించారు. ఇద్దరూ ప్రాణ మిత్రులుగా ఉంటున్న సమయంలో జగన్‌ చేస్తున్న కొన్ని అభివృద్ది పనులు, కొన్ని ఆకస్మిక నిర్ణయాలు కెసిఆర్‌కు కోలుకోకుండా చేస్తున్నాయి. ఎమ్మెల్యెల ఫిరాయింపుల విషయంలో తమ అజెండా ఏమిటో మరోసారి చెపుతున్నానని ఎమ్మెల్యెల ఫిరాయింపులను ఎంకరేజ్‌ చేసే ఉద్దేశమే లేదని అసెంబ్లీ సాక్షిగా జగన్‌ చెప్పేశారు. ఎమ్మెల్యెలు ఎవరైనా ప్రతిపక్ష పార్టీ నుంచి తమ పార్టీలోకి రావాలనుకుంటే వారు పదవులకు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యెలు మరో పార్టీలో చలామణి కావడం ఆంధ్రా అసెంబ్లీలో ఉండదని ఈ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రా అసెంబ్లీ ఆదర్శంగా నిలుస్తుందని ప్రకటించారు. మరీ ఇలా విలువలకు కట్టుబడి ఉంటామని జగన్‌ ప్రకటించడంపై మిగతా రాష్ట్రాలకు ఏమో కాని తెలంగాణ అసెంబ్లీకి మాత్రం ఇబ్బందికరంగా మారనుంది. తెలంగాణలో అంతా ఫిరాయింపుల రాజకీయమే నడుస్తోంది. కాంగ్రెస్‌ ఫిరాయింపుల ఎమ్మెల్యెలను అడ్డం పెట్టుకొని సీఎల్పీని విలీనం చేసుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించుకున్నారు. ఇలాంటి సంధర్బంలో జగన్‌ మాత్రం అలాంటివి ఉండవని, అలా తప్పులు చేసే రాజకీయం తాను చేయనని వ్యాఖ్యానించారు. ఈ మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కూడా ఇబ్బంది పెడుతున్నట్లుగా ఉన్నాయి. వయసులో చిన్నోడు చెప్పినట్లు వింటాడు అనుకునే భావన టిఆర్‌ఎస్‌ ముఖ్యనేతల్లో ఉండేదని తెలుస్తోంది. కాని ఆంధ్రాలో జగన్‌ వేగం, నిర్ణయాలు చూస్తుంటే కెసిఆర్‌కే చెమటలు పడుతున్నాయనే మాట రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది..

జగన్‌ స్పీడ్‌కు కెసిఆర్‌ ఉక్కిరి బిక్కిరి..

ఆంధ్రా సిఎం జగన్‌ స్పీడ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా తెలుస్తోంది.. ఆంధ్రాలో ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు గులాబీ బాస్‌ మీద విపరీతమైన ఒత్తిడికి గురి చేయడంతో పాటు తప్పనిసరిగా, తప్పలేని పరిస్థితుల్లో వాటిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. గడిచిన మూడు రోజులుగా చూస్తే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. వీటికి స్పూర్తి తీసుకుని ఆంధ్రాలో తీసుకుంటున్న నిర్ణయాలు ఒకే పోలి ఉండడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే కెసిఆర్‌కు వచ్చిన మరో ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు పలు అంశాల మీద సానుకూల నిర్ణయం తీసుకున్నా ఆ పేరంతా జగన్‌కే పోతుందీ తప్ప తనకేమి రానట్లు తెలుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దూకుడు నిర్ణయాలతో మంచిపేరు సాధించిన కెసిఆర్‌ ఇప్పుడు అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతోందని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన నిర్ణయం, ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీంలకు సంబంధించి జగన్‌ తీసుకున్న నిర్ణయాల్ని తప్పనిసరిగా పాటించక తప్పడం లేదు. ఐఆర్‌ను 27శాతం పెంచటానికి కెసిఆర్‌ సుముఖంగా లేరు. అలా అని పెంచకుంటే జగన్‌తో పోల్చి విమర్శలకు గురికావడం ఖాయంగా తెలుస్తోంది. తన దూకుడుతో తెలంగాణ సిఎం కెసిఆర్‌కు జగన్‌ కొత్త సవాళ్లు, కొత్త సమస్యలు తీసుకొస్తున్నట్లుగా చెప్పక తప్పేలా లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో జగన్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది పెద్ద ప్రశ్నగా మారటమే కాకుండా గులాబీ నేతల్లో కొత్త దడ మొదలైనట్లుగా చెప్పాలి. తనకు మరెవరితో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కొత్త ఇబ్బందికరంగా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close