నా ఓటమి వెనుక మా వాళ్ల కుట్ర

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనను సస్పెండ్‌ చేసే అధికారం టీపీసీసీ చీఫ్‌

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కుంతియాలకు ఉందా అంటూ కాంగ్రెస్‌ నుంచి సస్పెండైన నేత సర్వే సత్యనారాయణ ప్రశ్నించారు. తనపై చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్‌ అధిష్ఠానమే ఆ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తూ టీపీసీసీ నిర్ణయంపై సర్వే మండిపడ్డారు. తాను దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ జనరల్‌ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందానని తెలిపారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు బుద్ధి, జ్ఞానం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నవారే గాంధీభవన్‌ లో సవిూక్షలు చేస్తున్నారని సర్వే సత్యానారాయణ దుయ్యబట్టారు. దీన్ని ప్రశ్నించినందుకే తనను సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం పార్టీ హైకమాండ్‌ పంపిన నిధులు ఏమయ్యాయని నిలదీశారు. భట్టి విక్రమార్కతో పాటు తనను ఎన్నికల్లో ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కుట్రచేశారని ఆరోపించారు. తానే చస్తే యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ దగ్గరే చస్తానని వ్యాఖ్యానించారు. తాను ఏం తప్పు చేశానని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ తనను అవమానించడమేనన్నారు. పార్టీ ఓటమికి ఉత్తమ్‌, కుంతియాలే కారణమని ఆరోపించారు. వారిద్దరూ తక్షణమే రాజీనామా చేయాల్సిందేనని సర్వే డిమాండ్‌ చేశారు. తన ఓటమికి కాంగ్రెస్‌ నేతలే కారణమని.. తాను గెలిస్తే ముఖ్యమంత్రిని అవుతాననే భయం ఉత్తమ్‌కు ఉందన్నారు. భట్టి విక్రమార్కను కూడా ఓడించాలని ఉత్తమ్‌ చూశారని ఆరోపించారు. కేసీఆర్‌తో కుమ్మక్కయి పార్టీని ఉత్తమ్‌ ఓడించారని సర్వే అన్నారు. తాను ఓపెనింగ్‌ బ్యాట్స్‌ మెన్‌ ని మాత్రమేనని.. ఇంకా చాలామంది బయటకు వస్తారని చెప్పారు. చంద్రబాబు, కోదండరాం గొప్ప నాయకులన్న సర్వే.. వాళ్లను కూడా ఉత్తమ్‌ అవమానించారని అన్నారు. చాలామంది దగ్గర ఉత్తమ్‌ డబ్బులు తీసుకుని టికెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. భార్యనే గెలిపించుకోలేకపోయిన ఉత్తమ్‌.. పీసీసీ అధ్యక్షుడిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. 25 లక్షలు ఇస్తే జనరల్‌ సెక్రటరీ పదవి ఇస్తున్నారన్న సర్వే.. కుంతియను ఐరెన్‌ లెగ్‌గా అభివర్ణించారు. ఇక్కడి కార్యకర్తల సొమ్మతో కుంతియా కొత్త భవంతి కట్టుకున్నారని ఆరోపించారు. ఉత్తమ్‌, కుంతియాలో నిజంగా ఇడియట్లేనని.. కేసీఆర్‌ చెప్పినట్టు సిగ్గు లేనోళ్లేనని సర్వే సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here