Featuredస్టేట్ న్యూస్

సంపాదన తప్ప… అభివృద్ధి ఏది?

వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై శివ రెడ్డి పేట వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ కిషన్‌ నాయక్‌ ఫైర్‌…

వికారాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరడంతో కాంగ్రెస్‌ పార్టీ టి ఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ శివారెడ్డి పెట్‌ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ పై ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది వికారాబాద్‌ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఆరోపణ లను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా శివ రెడ్డి పెట్‌ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ కిషన్‌ నాయక్‌ మాట్లాడుతూ వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ను ఆయన గజదొంగ అభి వర్ణించారు తాను గుమ్మడి కాయ దొంగను కానని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ గజదొంగ అని తీవ్ర ఆరోపణలు చేశారు శివ రెడ్డి పెట్‌ వ్యవసాయ సహకార సంఘాన్ని ఆసియాలోనే నెంబర్‌ వన్‌ సొసై టీగా అభివృద్ధి చేసినట్లు చేశారు తాను సొసైటీకి సంబంధించి ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సొసైటీ ఆస్తులను రెట్టింపు చేసినట్లు తెలియజేశారు సొసైటీ భూములను స్మశానవాటిక భూములను తాను అమ్ముకో లేదని అన్నారు టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేగా మెతుకు ఆనంద్‌ కొనసాగుతున్నారని దమ్ముంటే అధికారులచే విచారణ జరిపించి నిజాన్ని నిరూపించాలి అని సవాల్‌ విసిరారు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకుడు చందర్‌ నాయక్‌ ఒక క్రిమినల్‌ అని ఒక వ్యక్తికి చెందిన ఐదు ఎకరాల భూమి ఉన్నందున ఆయనపై కోర్టులో కేసు ఉందని అన్నారు కోట్లాది రూపాయలు అక్రమ ఆస్తుల కింద వారు కూడా పెట్టుకుని తమపై బురద చల్లడానికి చౌకబారు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ప్రస్తుత ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఆసుపత్రి భవనం నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలు రుణం మంజూరు చేయగా అందులో 50 లక్షల రూపాయలు సబ్సిడీ కింద కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన విషయం ఎమ్మెల్యే మరిచిపోయారని అన్నారు మహావీర్‌ ఎస్పీ కార్యాలయం ఆర్‌టిసి బస్‌ డిపో వెంకటాపూర్‌ తండా లో జడ్‌.పి.హెచ్‌.ఎస్‌ హైస్కూల్‌ రోడ్ల అభివృద్ధి హాస్టల్లో మంజూరు కోసం తమ హయాంలోనే భూమిని కేటాయించి అభివృద్ధి చేసినట్లు తెలియజేశారు ఎమ్మెల్యేగా గెలిచి 11 నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి నిధులు విడుదల కాలేదని వికారాబాద్‌ అభివృద్ధి చెందలేదని అన్నారు వికారాబాద్‌ శాటిలైట్‌ సిటీ కోసం 2250 కోట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరు జరిగిం దని 185 కోట్లు అభివృద్ధికి ఖర్చు చేసినట్లు చెప్పారు శివ రెడ్డి పేట పార్క్‌ అభివృద్ధి అనంతగిరి మెడికల్‌ కళాశాల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపింది కాంగ్రెస్‌ పార్టీ హయాంలో నేనని అన్నారు అప్పటి ప్రతిపాదన ఇప్పుడు మెడికల్‌ కాలేజీ మంజూరైతే దానిని తాండూర్‌ కి తరలించారని అన్నారు వికారాబాద్‌ అనంతగిరి లో నిర్మాణం కావలసిన మెడికల్‌ కాలేజ్‌ తాండూర్‌ వెళ్ళిపోతుంటే ఎమ్మెల్యే ఆనంద్‌ చేతులు కట్టుకుని కూర్చోవడం తప్ప అడ్డుకోలేక పోయారు విమర్శించారు మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఎమ్మెల్యే కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా అది మంచిది కాదని సామాన్య ప్రజలు రెండు వర్గాల మధ్య నలిగి పోవడం తమకు ఇష్టం లేదని దమ్ముంటే అభివృద్ధి అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు వికారాబాద్‌ నియోజకవర్గంలో విష జ్వరాలు వచ్చే ప్రజలు బాధపడుతుంటే ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు చారిటీ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న మిషన్‌ ఆసుపత్రిని మూసివేయడానికి ఎమ్మెల్యే కుట్రపన్నారని అన్నారు మిషన్‌ ఆసుపత్రిపై విచారణ జరపాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారని అన్నారు ప్రజలు తిరగబడడం తో బుద్ధి వచ్చి విచారణను వాయిదా వేయించి పరువు నిలుపుకోవడానికి ఇంచార్జి జిల్లా వైద్యాధికారి సుధాకర్‌ ను బలి చేశారని అన్నారు. అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హావిూలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు వికారాబాద్‌ జిల్లా జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌ లోకి మారు స్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలుపుకోలేకపోయారు అని అన్నారు కొత్త జిల్లాలు ఏర్పాటుచేసిన రెండు జిల్లాలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందలేదని అందులో వికారాబాద్‌ జిల్లా ఉందని అన్నారు వికారాబాద్లో మెడికల్‌ కాలేజ్‌ అనంతగిరి కొండలు అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హావిూ కెసిఆర్‌ నిలుపుకోలేకపోయాడు అని అన్నారు ప్రజలను మోసం చేసి గెలుపొందిన ఎమ్మెల్యే హావిూలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు ఎన్నికల సందర్భంగా అక్రమాలకు పాల్పడిన అప్పటి జిల్లా కలెక్టర్‌ ఎన్నికల అధికారి సయ్యద్‌ ఓమర్‌ జలీల్‌ ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ చేసిన విషయం ఆయన గుర్తు చేశారు మున్సిపల్‌ ఎన్నికల్లో అడ్డదారిన పొందడానికి కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు వికారాబాద్‌ మున్సిపాలిటీ లో పర్యటించి అభివృద్ధి చేస్తున్నామని ప్రకటిస్తున్న టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు అంతేకాకుండా మున్సిపాలిటీలో అభివృద్ధి చేయవలసిన పనులు ఆర్‌ అండ్‌ బి రోడ్లకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తే ఎలా అని ప్రశ్నించారు ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు ప్రజలంతా వికారాబాద్‌ మున్సిపల్‌ అభివృద్ధిపై ఆలోచిస్తున్నారని ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు లక్ష్మణ్‌ నర్సింలు రైతు సంఘం అధ్యక్షుడు రత్నా రెడ్డి బ్లాక్‌ అధ్యక్షులు అనంత రెడ్డి ఇ జాఫర్‌ అశోక్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌ కమల్‌ రెడ్డి తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close