నూతన దిశగా ఒడిషా

0

భువనేశ్వర్‌: కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిందని, అయినప్పటికీ ప్రజలకు కనీస వసతులు కూడా అందలేదని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు. అలాగే ఒడ ఇషాలో వనరులున్నా ఉపయోగించే స్థితిలో ఇక్కడి ప్రభుత్వం లేదన్నారు. పేదవారికి గ్యాస్‌ కనెక్షన్లు, విద్యుత్‌ సదుపాయం, ఆరోగ్య సౌకర్యాలు అందలేదని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే ‘కనీస ఆదాయ హావిూ’ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనను ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఒడిశా రాష్ట్రం కటక్‌లోని కులియా ప్రాంతంలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న

అమిత్‌ షా కాంగ్రెస్‌, బీజూ జనతా దళ్‌ (బీజేడీ) పార్టీలపై మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేడీ ఒకే నాణెళినికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మేము కొత్త ఒడిశా కోసం పనిచేస్తున్నాము. కొత్త ఒడిశా అంటే ఏంటో తెలుసా? ఒక్క నిరుద్యోగి కూడా లేని రాష్ట్రం. ఉత్తమ ఆరోగ్య సదుపాయాలు అందే ప్రాంతం. దారిద్యరేఖకు దిగువన ఒక్కరు కూడా లేని ప్రాంతం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాము. ఆ రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి. కష్టించి పనిచేసేవారు ఉన్నారు. అయినప్పటికీ ఆ రాష్ట్రం అభివృద్ధి పథాన దూసుకుపోవట్లేదు. దీనికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగస్వామి అయ్యేందుకు ఒడిశా సర్కారు ఒప్పుకోలేదు. ఈ పథకాన్ని ఇక్కడ అమలు చేస్తే మోదీకి ప్రజాధరణ పెరిగిపోతుందని భయపడ్డారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో 13వ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రానికి రూ.79,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.2,11,510 కోట్లు ఇచ్చింది. రాష్ట్రంలోని పేద ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకోలేకపోతున్నారు. ఒడిశా ప్రభుత్వ తీరే ఇందుకే కారణం’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here