గాడ్జెట్లుటెక్నాలజీ
Trending

ఒప్పోలో 8GB రామ్ కొత్త స్మార్ట్ఫోన్ జనవరి 16 న మార్కెట్లో విడుదల

Story Highlights
  • OPPO F15 Grand Launch on January 16th 2020
  • 48 ఎంపీ బ్యాక్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • జనవరి 16 న గ్రాండ్ లాంచ్
  • 8 GB రామ్, 3.0 VOOC ఛార్జింగ్
Oppo F15 (8GB) | Source: Nithya Communications, Jagtial

జగిత్యాల (ఆదాబ్ హైదరాబాద్ ) ఒప్పో (OPPO) స్మార్ట్‌‌ఫోన్‌‌ కంపెనీ‌‌ ,  తన లేటెస్ట్‌‌ మోడల్‌‌ ఎఫ్‌‌15 (F15) ను ఈ నెల 16 నుంచి అందుబాటులోకి  తీసుకురానుంది. ఎఫ్‌‌ సిరీస్‌‌తో పాపులరైన  ఒప్పో, మరో కొత్త మోడల్‌‌తో కస్టమర్ల ముందుకు రాబోతోందని నిత్యా కమ్యూనికేషన్స్ గుండా రాజేందర్ వెల్లడించారు. ఒప్పో కంపెనీ‌‌ ఢిల్లీ లో లాంచ్ చేస్తుంది అని తెలియజేసారు ఈ స్మార్ట్‌‌ఫోన్‌‌కు వెనుక నాలుగు కెమెరాలుంటాయి.  వీటితో అత్యున్నత నాణ్యత కలిగిన ఫొటోలను తీసుకోవచ్చని ఒప్పో ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ బోగ సాకేత్ తెలియజేసారు. తక్కువ వెలుతురులోనూ ఫొటోలు బాగా వస్తాయని కంపెనీ సిటీ మేనేజర్ కార్తీక్ రావు​ తెలిపారు.

సెల్ఫీల కోసం ఇందులో 16 ఎంపీ కెమెరా ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌‌, 128 జీబీ ఇంటర్నల్‌‌ స్టోరేజీ ఉన్న ఈ మొబైల్‌‌,  లైటింగ్‌‌ బ్లాక్‌‌, యూనికార్న్‌‌ వైట్‌‌ రెండు కలర్స్‌‌లలో అందుబాటులోకి రానుంది.

ఒప్పో (OPPO) ఎఫ్‌‌ 15లో  4,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ, ఫింగర్‌‌‌‌ ప్రింట్‌‌ 3.0 సెన్సర్‌‌, ‌‌వూక్‌‌ 3.0 ఫ్లాష్‌‌ చార్జ్‌‌ ఫిచర్లున్నాయి.  డ్యూయల్‌‌ సిమ్‌‌ కార్డుతోపాటు 256 జీబీ ఎక్స్‌‌పాండబుల్‌‌ మెమొరీ కార్డు స్లాట్ ఈ మొబైల్‌‌లో ఉన్నాయి. మొబైల్‌‌ బరువు 172 గ్రా., ఎఫ్‌‌హెచ్‌‌డీ+అమోలెడ్‌‌ స్క్రీన్‌‌, గొరిల్లా గ్లాస్‌‌ 5 దీని సొంతం. ఎఫ్‌‌ 15  మీడియా టెక్‌‌  పీ70 ప్రాసెసర్​తో పాటు 6.4 ఇంచెస్‌‌ టచ్‌‌ స్క్రీన్‌‌, గేమ్‌‌ బూస్టర్‌‌‌‌ 2.0 ఫీచర్లతో అందుబాటులోకి వస్తోంది.  మొబైల్‌‌ ధర సుమారు 20000/- రూపాయలు ఉండవచ్చు అని చెప్పారు. కస్టమర్లు జనవరి 25 తరువాత కొనుగోలు చేసుకోవచ్చు అని తెలియజేసారు. ప్రీ బుకింగ్ చేసుకోవడానికి 7989111134 , 9849621234 సంప్రదించవలసిందిగ తెలియజేసారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close