సినిమా వార్తలు

ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ అవ‌గాహ‌న పెంచేది ఈ చిత్రం – ముర‌ళీమోహ‌న్‌

అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు  టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌,మంచుమ‌నోజ్, సునీల్‌ న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 1వ తేదీన‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా  చిత్ర యూనిట్ ఆదివారం దస్పల్లాహోటల్ లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జ‌రుపుకుంది.  ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అంతా క‌లిసి  ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఆడియో సీడీని, టీజ‌ర్‌ను మాఅధ్య‌క్షులు ముర‌ళీమోహ‌న్‌, హీరో గోపీచంద్ క‌లిసి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో…

శివాజిరాజా మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని. పాట‌లు విన‌గానే నేను ముందు నేను అడిగింది మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అని ర్యాప్‌రాక్ ష‌కీల్ అనిచెప్పారు. పాట‌లు చాలా బావున్నాయి. ఇందులో సునీల్‌, మ‌నోజ్ కూడా ఉన్నారు చాలా బాగా చేశారు. నేను శ్రీ‌కాంత్ క‌లిసిన‌ప్పుడు సినిమాలుగురించి మాట్లాడుకోవ‌డం చాలా త‌క్కువ‌. ఒక వేళ మాట్లాడుకుంటే పెళ్ళిసంద‌డి, వినోదం, ప్రేయ‌సిరావే చిత్రాల గురించి మాట్లాడుకుంటాం.ఇప్పుడు ఈ చిత్రం గురించి కూడా మాట్లాడుకుంటుంన్నాం. శ్రీ‌కాంత్ మ‌రో ప‌దేళ్ళ త‌ర్వాత వ‌చ్చినా అలాగే ఉంటాడు. 125 సినిమాలు చెయ్య‌డంఅంటే మామూలు విష‌యం కాదు ఎప్పుడూ ఇండ‌స్ర్టీలో ఒక్క కంప్ల‌యింట్ కూడా లేకుండా సినిమాలు చేశారు అని అన్నారు.

సునీల్ మాట్లాడుతూ… ఈ సినిమా ఆడుతూ పాడుతూ శ్రీ‌కాంత్ చేశాడు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.ఆప‌రేష‌న్దుర్యోధ‌న చిత్రం ఎంత గొప్ప‌గా హిట్ అయిందో ఈ చిత్రం కూడా అలాగే హిట్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరో గోపీచంద్ మాట్లాడుతూ…25 సిఇనిమాలు చేసిన వాళ్ళ‌కే త‌ల ప్రాణం తోక‌కొచ్చింది. అలాంటిది 125 చిత్రాలు చేయ‌డం అంటే మామూలువిష‌యం కాదు శ్రీ‌కాంత్ అన్న‌య్య చాలా గ్రేట్ . కంగ్రాట్స్ అన్న‌య్య‌. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న ఎంత హిట్ అయిందో ఈచిత్రం కూడా అలాగే మంచి హిట్సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. ఈ చిత్ర డైరెక్ట‌ర్ చాలా బాగా తీశారు. సినిమాటోగ్రాఫ‌ర్ కూడా అంద‌ర్నీ బాగా చూపించారు. మంచి హిట్కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ముర‌ళిమోహ‌న్ మాట్లాడుతూ… ప్ర‌ముఖ హీరో శ్రీ‌కాంత్ ఈ చిత్రం ట్రైల‌ర్‌ను, పాట‌లు చూశాను. చాలా చాలా బావున్నాయి. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లోవ‌చ్చే ఈ చిత్రం అంద‌రిలో ఎవేర్నెస్ తీసుకురావాలి. ఇంత‌కుముందు కూడా పొలిటిక‌ల్ చిత్రాలు ఎన్నో వ‌చ్చాయి. కాని అవి ఎవ‌రో ఒక‌ర్నివిమ‌ర్శ‌స్తూవ‌చ్చిన చిత్రాలే ఈ చిత్రం అలా కాదు దేశాన్ని ఎవ‌రు ప‌రిపాలించ‌బోతున్నారు మ‌నం ఎవ‌రికి ఓటు వెయ్యాలి అని ప్ర‌జ‌ల్లో ఒక ఎవేర్నెస్ తీసుకువ‌చ్చేచిత్ర‌మిది. ఈ చిత్రం మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ శ్రీ‌కాంత్ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు క‌ర‌ణం బాబ్జి మాట్లాడుతూ… ఈ చిత్రంలోని సాంగ్స్ చాలా బావున్నాయి. నా టెక్నీషియ‌న్స్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. ప్రొడ్యూస‌ర్‌గారు ఈచిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. మ‌నోజ్‌, సునీల్ కూడా ఈ చిత్రంలో చాలా బాగా న‌టించారు. శ్రీ‌కాంత్ గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్నిప‌నులు తానే ద‌గ్గ‌రుండి చూసుకునేవారు. డిసెంబ‌ర్ 1వ తేదీన ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది అంద‌రూ థియేట‌ర్ల‌కి వెళ్లి చూడాల‌నికోరుకుంటున్నాను ఎన్నో పెద్ద సినిమాల మ‌ధ్య మా చిన్న చిత్రం విడుద‌ల చేస్తున్నాం. మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని మీ అంద‌రిఇకీ త‌ప్ప‌కుండాన‌చ్చుతుంద‌ని కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాను అన్నారు.

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… ఈ సినిమా పాట‌లు, రీరికార్డింగ్ చాలా బాగా కుదిరాయి. ఈ చిత్రం త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కి మంచి భ‌విష్య‌త్ఉంట‌ది. ద‌ర్శ‌కుడు క‌ర‌ణం బాడ్జి ఎవ‌రికీ అర్ధం కాడు అర్ధం చేసుకోవాలి. చాలా డెడికేటెడ్ ప‌ర్స‌న్ సినిమా త‌ప్ప వేరే ప్ర‌పంచం ఉండ‌దు. మాకాన్ఫిడెన్స్

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close