Featuredజాతీయ వార్తలు

బాబోయ్‌.. ఉల్లిపాయ్‌.. !

  • కొండెక్కిన ఉల్లి లొల్లి
  • కిలో రూ. 200లు
  • సామాన్యుడికి భారం..

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. అకాల వర్షాలతో పంటనష్టం జరగడం, ఉల్లి స్టాక్‌లో లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులు ఉల్లిని కొనాలంటేనే జంకుతున్నారు. ఇక హైదరాబాదులో కూడా ఉల్లి ధరలు కోయకుండానే ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. హైదరాబాదులో కిలో ఉల్లి ధర రూ. 200 మార్కును తాకింది. ఇప్పటి వరకు ఒక బెంగాల్‌లోనే ఈ స్థాయిలో మండుతున్న ఉల్లి ధరలు ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాదును కూడా టచ్‌ చేశాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ ధర 200 రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. మొన్నటి వరకు గ్రేడ్‌ వన్‌ ఉల్లి ధర సెంచరీ పలకగా… ఇప్పుడు డబుల్‌ సెంచరీకి చేరువైంది. తిరుపతి మార్కెట్‌లో ఇప్పటికే 180 రూపాయలకు చేరింది. దీంతో ఉల్లిగడ్డ పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. మొన్నటిదాకా ఉల్లిపాయలు కోసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళలు… ఇప్పుడు ఉల్లిలేని రెసిపీల కోసం యూట్యూబ్‌ను ఆశ్రయిస్తున్నారు. విత్‌ అవుట్‌ ఆనియన్‌ పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ¬టళ్లలో ఆమ్లెట్లు నిషేధించారు. ఉల్లిదోశ అడిగితే… గొప్పగా చూస్తున్నారు. ఉల్లి చెట్నీలకు బదులు కొబ్బరి చట్నీలతో రెస్టారెంట్‌లను రన్‌ చేస్తున్నారు. మరికొంతమంది తెలివిగా ఉల్లి బదులు క్యాబేజ్‌ని వాడేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉల్లి బాంబ్‌తో జనం బెంబేలెత్తిపోతున్నారు. నిన్నగాక మొన్న సెంచరీ కొట్టి షాక్‌కు గురిచేసిన ఉల్లి… ఇప్పుడు ఈజీగా డబుల్‌ సెంచరీ వైపు దూసుకెళ్తోంది. ఉల్లి ధరలు… ఇకనైనా తగ్గుతాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్న సామాన్యులకు రోజు రోజుకూ మరింత షాక్‌ ఇస్తూ.. ఉల్లి ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షాన్నంటుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లిగడ్డ 170 నుంచి 180 పైనే పలుకుతోంది. అతి త్వరలో 200లకు చేరువయ్యేలా ఉంది. ఇక హైదరాబాద్‌లో ఉల్లిధర రికార్డు స్థాయిలో 160 దాటి, 180 వరకు పలుకుతోంది.

ఉల్లి ధరల పెరుగుదలపై అన్ని వర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉల్లిగడ్డ నిల్వ అయిపోతుందనగానే.. మధ్య తరగతి, పేద ప్రజల గుండెలు జారిపోతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఉల్లి ధరలు.. కన్నీళ్లు పెట్టిస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు ఉన్నది పేద ప్రజల కనీస అవసరాలు తీర్చడానికే కదా అని గృహిణులు ప్రశ్నిస్తున్నారు. ఏ కూర వండాలన్నా మొదట కావాల్సింది ఉల్లిగడ్డే కదా.. ఉల్లి లేకపోతే ఇల్లు గడిచేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి బాంబ్‌ను చూసి తిరుపతిలో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

పెరగటానికి కారణాలివే!

వర్షాలు కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఉల్లిపంట పెద్దఎత్తున దెబ్బతింది. దాంతో ఉల్లి ధర కిలోకు 160-170 రూపాయలకు చేరడంతో.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉల్లి ధరలతో చాలా మంది సామాన్య ప్రజలు ఉల్లి లేకుండానే రోజూవారి కూరలను వండుకుంటున్నారు. ఇంకొంతమంది ధరలు పెరిగినప్పటికీ కూడా రోజువారీ ఆహారంలో ఉల్లి తప్పనిసరి కాబట్టి ఉల్లినీ కొంటే జేబులు ఖాళీ అవుతున్నప్పటికీ కూడా కొనక తప్పడం లేదు. ఇక ఏపీ ప్రభుత్వం సబ్సిడీ ధరల రూపంలో కేజీ రూ.25 కే అందిస్తున్నా ఒకరికి ఒక కేజీ మాత్రమే ఇస్తున్నారు. అయితే సబ్సిడీ ధరకు కొనుగోలు చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇతర కుటుంబసభ్యులను పంపుతున్నారు. దీనివలన అందాల్సిన వారికి అందడం లేదు. వివిధ రకాల వంటలలో ఉల్లిని విస్తృతంగా ఉపయోగిస్తున్నందున రోజువారీ వినియోగానికి ఈ పరిమాణం సరిపోదని అభిప్రాయపడుతున్నారు. పరిమాణం పెంచమని కోరుతున్నారు. వీలైనంత ఎక్కువ ఉల్లిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనా సరఫరా మాత్రం ఆ మేరకు లేదు. దీనికి ప్రధాన కారణం వర్షాలు ఈ ఏడాది అతిగా పడటమే.. వర్షాలు ఎక్కువై ఉల్లి సాగు దారుణంగా పడిపోయిందని వ్యవసాయ రైతులు చెబుతున్నారు. అయితే వచ్చిన దాంట్లో కూడా కొంతమంది దళారులు సిండికేటే అయి ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వాలు కూడా చూసీచూడనట్టు ఉంటున్నాయని అంటున్నారు. ఇటువంటి కారణాలతోనే ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయని వ్యాపారాలు చెబుతున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close