Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

వన్‌ప్లస్‌ తొలిఅడుగు

పరిశ్రమలకు అనుకూలంగా హైదరాబాద్‌

  • టెక్‌ దిగ్గజం వన్‌ ప్లస్‌ సంస్థ వేయికోట్ల పెట్టుబడి
  • ఆర్‌ అండ్‌ డి సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కెటిఆర్‌ పారిశ్రామికవేత్తలను కోరారు. హైదరాబాద్‌లో వన్‌ ప్లస్‌ రూ.1000 కోట్లు పెట్టబడి పెట్టడం హర్షనీయమని కెటిఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మరో టెక్‌ దిగ్గజం వచ్చింది. ఫైనాన్షియల్‌ డిస్టిక్ట్ర్‌లో వన్‌ ప్లస్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వన్‌ ప్లస్‌ సిఇఒ పీట్‌ లూ కూడా పాల్గొన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో 3వేల ఉద్యోగాలు రావడం శుభ పరిణామమని కెటిఆర్‌ తెలిపారు. వన్‌ ప్లస్‌ మాన్యు ఫాక్చర్‌ యూనిట్‌ను కూడా హైదరాబాద్‌ లో ఏర్పాటు చేయాలి ఆయన కోరారు. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తుందని కెటిఆర్‌ హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్‌ అండ్‌ డి సెంటర్‌ను హైదరాబాద్‌ లో ప్రారంభిస్తున్నామని వన్‌ ప్లస్‌ సిఇఒ పీట్‌ లూ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌ అన్ని విధాల అనుకూలమైనదని పీట్‌ లూ చెప్పారు. హైదరాబాద్‌ లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ కోసం వన్‌ ప్లస్‌ మొబైల్స్‌ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడం మంచి పరిణామం అని కేటీఆర్‌ అన్నారు. రానున్న రెండేళ్లలో 15 వందల మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారని తెలిపారు. వన్‌ ప్లస్‌ మాన్యుఫాక్చరింగ్‌ సెంటర్‌ కూడా సిటీలో ఏర్పాటు చేయాలని కోరారు కేటీఆర్‌. ఈ కార్యక్రమానికి ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ తో పాటు వన్‌ ప్లస్‌ సీఈవో పీట్‌ లూ హాజరయ్యారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close