ఆంధ్రాలో మరోసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌

0

అమరావతి (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు సైరన్‌ కు సమయం దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరికలపై ప్రత్యేక ద ష్టి సారించింది. ఇప్పటికే ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, జనసేన పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో పార్టీలో చేరికలపై ఏపీ సీఎం టీడీపీ అధినేత

చంద్రబాబు నాయుడు దష్టి సారించారు. ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలు, జన్మభూమి మా ఊరు కార్యక్రమాలపై ద ష్టి సారించిన చంద్రబాబు ఇకపై పార్టీలో వలసలపై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 11 నుంచి చంద్రబాబు పార్టీ కార్యకలాపాలపైనే ప్రత్యేక ద ష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతం వంటి అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది, వైసీపీ, జనసేన పార్టీల ప్రభావం ఉన్నచోట ప్రత్యామ్నాయంగా ఎవరిని తెరపైకి తీసుకురావాలి అనే అంశాలపై ఇప్పటికే చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, సూపర్‌ స్టార్‌ కష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు, మాజీమంత్రి అహ్మదుల్లా, మాజీమంత్రి కొణతాల రామక ష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరిలను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు.

అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తెలుగుదేశం పార్టీలో చేరతానని చంద్రబాబుకు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు సైతం ఆమెకు హామీ ఇచ్చారు. ఇకపోతే సూపర్‌ స్టార్‌ క ష్ణ సోదరుడు మాజీ వైసీపీ నేత ఘట్టమనేని ఆది శేషగిరిరావు సైతం త్వరలోనే సైకిల్‌ ఎక్కనున్నారు. ఇటీవలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తెనాలి అసెంబ్లీ టికెట్‌ ను ఆశించారు ఆదిశేషగిరిరావు. అయితే జగన్‌ మాత్రం విజయవాడ పార్లమెంటు స్థానాన్ని ఆఫర్‌ చేశారు. 

దీంతో మనస్తాపానికి గురైన ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే జగన్‌ ఆలోచనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో టీడీపీలో చేరాలని నిర్ణయించారు.

చంద్రబాబు తమకు బంధువు కావడంతో ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత క ష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ తరఫున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి టీడీపీలో చేరాలని ఆదిశేషగిరిరావు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటు మాజీమంత్రి అహ్మదుల్లా సైతం అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన అహ్మదుల్లా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ముస్లిం సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలోనే అహ్మదుల్లా సైకిలెక్కనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గానికి చేరువయ్యేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు అహ్మదుల్లా చేరికతో మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అటు అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి సైతం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. ఇప్పటికే పలు అంశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును సబ్బం హరి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పలుమార్లు కలిసి అభినందించారు కూడా. ఇటీవలే డిసెంబర్‌ 31న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో సబ్బం హరి కలిశారు. తాను టీడీపీలో చేరతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే విశాఖపట్నం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చెయ్యాలని తాను భావిస్తున్నట్లు చంద్రబాబు నాయుడుకు చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం సబ్బం హరిని అసెంబ్లీకి పంపాలని యోచిస్తున్నారు. దీంతో టిక్కెట్‌ పై ఎలాంటి క్లారిఫికేషన్‌ రాకపోవడంతో పార్టీలో చేరికపై సబ్బం హరి సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మాజీ మంత్రి కొణతాల రామక ష్ణ సైతం తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు పని తీరును మెచ్చుకున్న కొణతాల త్వరలోనే సైకిల్‌ ఎక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే జనవరి 18న తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

సినీగ్లామర్‌ ఏం కావాలి?

ఇప్పటివరకు ఏ ఎన్నికలు జరిగినా.. సినీ సెలబ్రిటీలు ప్రచారం చేయడానికి వచ్చేవారు. ముఖ్యంగా టీడీపీ పార్టీ తరఫున నందమూరి హీరోలు ప్రచారం చేయడంతో గ్లామర్‌ టచ్‌ బాగా వచ్చేది. కానీ కొంతకాలంగా మన తారలు ఈ ఎన్నికల్‌ ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ పరిస్థితి ఇంకా తగ్గుముఖం పట్టింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా సెలబ్రిటీలు ఎవరూ ప్రచారంలో పాల్గొనలేదు. కేసీఆర్‌, కేటీఆర్‌ లకు సినిమా వాళ్లతో ప్రత్యేకమైన బంధం ఉన్నప్పటికీ మన తారలు మాత్రం ఎన్నికల సమయంలో దగ్గరకి వెళ్లలేదు. ఒక పార్టీకి సపోట్‌ చేస్తే ఆ పార్టీ మనిషని ముద్ర పడే అవకాశాలు ఉన్నాయని సినిమా వాళ్లు రిస్క్‌ తీసుకోలేదు. పైగా ఇప్పుడు చాలా మంది సినిమా వాళ్లు రాజకీయ పార్టీల్లో చేరడంతో స్పెషల్‌ గా ప్రచారాలు చేయడం ఎందుకులే అని భావిస్తున్నారు సినీ సెలబ్రిటీలు.రాబోయే ఏపీ ఎలెక్షన్స్‌ లో కూడా సినిమా వాళ్లు ప్రచారాలు చేసే అవకాశం లేదని అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ పార్టీ తరఫున కూడా ఏ హీరో, హీరోయిన్‌ కానీ ప్రచారం చేయరని టాక్‌. మెగాఫ్యామిలీ హీరోలు మాత్రం బాబాయ్‌ పిలిస్తే ప్రచారానికి సిద్ధమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలా గనుక జరిగితే సినీ గ్లామర్‌ టచ్‌ ఒక్క పవన్‌ కళ్యాణ్‌ కి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here