మరోసారి మోడీనే ప్రధాని

0
  • గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులు మోదీచేశారు
  • కేసీఆర్‌, చంద్రబాబులు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు
  • ఈనెలలో తెలంగాణలో మోడీ, అమిత్‌షా పర్యటనలు
  • బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌

హైదరాబాద్‌ : త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల తరువాత మరోసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని, ప్రజలంతా మోదీని ప్రధానిని చేసేందుకు ఎన్నికలకోసం ఎదురుచూస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. విజయ్‌ సంకల్ప ర్యాలీ లో భాగంగా శనివారం హైదరాబాద్‌ సుందరయ్య పార్క్‌ నుండి బీజేపీ బైక్‌ ర్యాలీ చేపట్టింది. మోడీ ఈ ఐదేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేయడానికి ఈ బైక్‌ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారని తెలిపారు. మరొకసారి మోడీ అనే నినాదంతో దేశం కోసం మోడీ, మోడీ కోసం దేశం అని బైక్‌ ర్యాలీ లు చేపట్టామని తేలియజేశారు. గత 70ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా చేయని పనులు తమ ప్రభుత్వం చేసి చూపిందని లక్ష్మణ్‌ చెప్పారు. ఈనెలలో మోడీ ,అమిత్‌ షా తెలంగాణ కు రాబోతున్నారని వివరించారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగానే మిగిలిపోయాయని, కేసీఆర్‌, చంద్రబాబు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తి మెజారిటీ ఇస్తే.. ప్రపంచ దేశాల కంటే దీటుగా అభివృద్ధి చేస్తామని లక్ష్మణ్‌ హావిూ ఇచ్చారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ఐదు సంవత్సరాల పాలనలో భారతదేశం అనేక విజయాలు సాధించిందని అన్నారు. వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు ప్రధాని సూచించారని అందులో భాగంగా విజయ సంకల్ప యాత్ర నిర్వహించామని అన్నారు. పేదల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధికోసం మోదీ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, అనేక కార్యక్రమాలు చేపట్టిందని.. 55 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ చేయలేని పనులను మోదీ ప్రభుత్వం చేసి చూపెట్టిందని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 22 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందారని తెలిపారు. సబ్‌ కా సాత్‌ – సబ్‌ కా వికాస్‌ విధానంతో అన్ని వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. దేశం కోసం మోదీ.. మోదీ కోసం దేశం మొత్తం నిలవాలని కోరారు. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో బిజెపి గెలవడం, మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here