కార్మికుల సమస్యలపై..

0

దేశవ్యాప్త సమ్మె

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కార్మిక రంగ సమస్యలపై 12డిమాండ్లతో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. దీంతో జనజీవనం స్తంభించింది. 10 కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు సమ్మెలో పాల్గొననున్నాయి. కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సామాజిక భద్రత, ధరలను నియంత్రించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. డిమాండ్ల విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు బంద్‌ పాటిస్తున్నారు. కార్మిక సంఘాల సమ్మెతో ముంబై స్తంభించిపోయింది. బ్రహెన్‌ ముంబై ఎలక్టిస్రిటీ సైప్లె మరియు ట్రాన్స్‌ పోర్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బ్రహెన్‌ ముంబై కార్పొరేషన్‌ లో ఎలక్ట్రిసీటీ, ట్రాన్స్‌ పోర్టు బడ్జెట్‌ ను కలపాలని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సామాజిక భద్రత కల్పించాలని, ధరలు నియంత్రించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సమ్మె కారణంగా ముంబైలో 33 వేల మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. 2,259 మంది కండక్టర్లు, 2,200 మంది డ్రైవర్లు సమ్మెలో పాల్గొనడంతో సుమారు 25 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 27 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. అసోం, మేఘాలయ, మణిపూర్‌, బీహార్‌, రాజస్థాన్‌, గోవా, పంజాబ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ ఘడ్‌, హర్యానా రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం అధికంగా ఉంది.

దేశవ్యాప్తంగా ట్రేడ్‌ యూనియన్ల ఆందోళన.. ఆల్‌ ఇండియా సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (ఏఐసీసీటీయూ) మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. పబ్లిక్‌ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ధర్నా నిర్వహిస్తున్నాయి. కార్మికులకు కనీసం వేతనం, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రతాప్‌గంజ్‌ పారిశ్రామిక వాడతో పాటు అనేక ప్రాంతాల్లో ఇవాళ కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఒడిశాలోని నేషనల్‌ హైవే 16పై ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. భువనేశ్వర్‌లో కార్మిక సంఘాలు బంద్‌ పాటిస్తున్నాయి. కేరళలోనూ 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. కొచ్చి, తిరువనంతపురంలో బంద్‌ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో బంద్‌ సందర్భంగా టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన 48 గంటల సమ్మెతో దేశవ్యాప్తంగా రవాణా, బ్యాంకింగ్‌ రంగాలు స్తంభించాయి. సమ్మె కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమ్మెకు కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ర్యాలీ, రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్‌ టియు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here