Featuredజాతీయ వార్తలు

సరిహద్దుల్లో.. పాక్ కవ్వింపుల

అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌

పాకిస్థాన్‌ కు యుద్ద భయం పట్టుకుంది. భారత్‌ ఆయుధ సంపత్తి ముందు తేలిపోనున్న విషయం అర్థమైంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రాంతంలో కాశ్మీర్‌ లోని నాలుగు ప్రాంతాల్లో పదే పదే పాక్‌ కాల్పులకు తెగబడింది. ఓ మహిళ మతి చెందింది. గగనతలంలోకి వచ్చిన పాక్‌ విమానాలను భారత సైన్యం సంయమనం కోల్పోకుండా తరిమికొట్టింది. సరిహద్దుల్లో పాక్‌ కవ్వింపు దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పి కొట్టింది. దీనికి తోడు ఈ పరిస్థితుల్లో తామేమీ సహాయం చేయలేమని చైనా చేతులెత్తేసింది. భద్రతా మండలి నిబంధనల మేరకు పాక్‌ నడుచుకోవాలని, తీవ్రవాదం విషయంలో భారత్‌ తోటే అంటూ … ఇరుదేశాల మధ్య ఓ చక్కటి కబురందిందని అమెరికా చెప్పింది. మరోవైపు తమవద్ద బందీగా ఉన్న అభినందన్‌ విడుదలపై అనేక మెలికలు పెట్టడానికి పాకిస్థాన్‌ పడరాని పాట్లు పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక నిబంధనలు పెట్టింది. జెనీవా ఒప్పందాల మేరకు భారత్‌ ఎక్కడా పాకిస్థాన్‌ షరతులకు లొంగలేదు. సరికదా… త్రివిధ దళాదిపతులతో వ్యూహాత్మక సమావేశాలు జరిపింది. వివిధ దేశాల విదేశాంగశాఖ కార్యదర్శులతో భారత్‌ సమావేశమైంది. ప్రధాని మోడీ కూడా అభినందన విడుదల విషయంలో అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చారు. దీంతో గత్యంతరంలేని పరిస్థితిలో పాక్‌ పార్లమెంట్‌ లో ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్వయంగా అభినందన్‌ ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌: ఒక పక్క ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటే, పాకిస్థాన్‌ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోని సుందర్బనీ, మాన్‌ కోట్‌, కర్మారా, దిగ్వార్‌ సెక్టార్లలో మోర్టార్లు, తుపాకీలతో కాల్పులకు తెగబడింది. గురువారం ఉదయం 6గంటలకు కాల్పులను ప్రారంభించిన పాక్‌ మధ్యలో కొద్దిసేపు ఆపేసింది. సాయంత్రం వరకు పలుదఫాలుగా పాక్‌ కాల్పులు జరిపింది. ఈ కాల్పులలో ఓ మహిళ మ తిచెందింది. భారత సైన్యం సంయమనం కోల్పోకుండా ఆ కాల్పులను తీవ్రంగా ప్రతిఘటించింది.

ఇవిగో ఆధారాలు: పాక్‌ బాగోతం బయటపెట్టిన భారత్‌… భారత్‌ తో యుద్ధానికి కాలుదువ్వుతోన్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించకపోవడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ శాంతి చర్చలకు సిద్ధమని పేర్కొన్న సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లభిస్తే పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన పలు ఆధారాలను భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అందజేసింది. 40 మందికి పైగా భారత జవాన్లను హతమార్చిన తర్వాత ఉగ్రవాదులతో జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ మాట్లాడిన టేపులను పాక్‌ అధికారులకు పంపించింది.

ముగిసిన విదేశాంగశాఖ కార్యదర్శుల భేటీన్యూదిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితుల ద ష్ట్యా గురువారం వివిధ దేశాల విదేశాంగశాఖ కార్యదర్శులతో భారత్‌ సమావేశమైంది. జర్మనీ, డొమినికన్‌ రిపబ్లిక్‌, నైజీరియా, దక్షిణాఫ్రికా, బెల్జియం తదితర పది దేశాలకు చెందిన విదేశీ కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. తాజా పరిస్థితులను మన విదేశాంగశాఖ వారికి వివరించింది. 

పాకిస్థాన్‌ కు ‘తలంటిన’ చైనా!… బీజింగ్‌: పాకిస్థాన్‌ లోని బాలాకోట్‌పై ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ దాడి చేసిన తర్వాత కూడా చైనా సహా ఏ దేశం తమకు అండగా నిలవలేదని పాక్‌ మాజీ రాయబారి ఒకరు ఆవేదన చెందారు. ఇప్పుడు మరోసారి పాక్‌ కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ దాడి తర్వాత పాకిస్థాన్‌ భారత గగనతలంలోకి వచ్చి.. మన మిలిటరీ స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీనిని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సమర్థంగా తిప్పికొట్టింది. పాక్‌కు చెందిన ఓ ఎఫ్‌ 16 విమానాన్ని కూడా కూల్చేసింది. ఈ ఘటనను వివరించేందుకు తన మిత్ర దేశం చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యికి బుధవారం అర్ధరాత్రి అత్యవసరంగా ఫోన్‌ చేశారు పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ. అయితే చైనా స్పందన చూసి ఆయన షాక్‌ తిన్నారు. భారత గగనతలంలోకి పాక్‌ దూసుకెళ్లడాన్ని తప్పుబట్టేట్లుగా వాంగ్‌ యీ మాట్లాడారు. అన్ని దేశాల సార్వభౌమాధికారం, సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని చైనా భావిస్తున్నదని వాంగ్‌.. ఖురేషీకి స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే చర్యలను చైనా సహించబోదని కూడా ఈ సందర్భంగా ఖురేషీకి వాంగ్‌ స్పష్టంగా చెప్పినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి బాలాకోట్‌లో ఐఏఎఫ్‌ దాడి తర్వాత దానికి దారి తీసిన పరిణామాలను చైనాతోపాటు వివిధ దేశాలకు భారత్‌ వివరించింది.

బుధవారం 24 విమానాలతో భారత భూభాగంలోకి..

సరిహద్దుల వెంట బుధవారం జరిగిన గగనతల పోరాట వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 24 యుద్ధవిమానాలు ఒక్కసారిగా భారత్‌ భారత భూభాగంలోకి చొరబడ్డాయి. ఉదయం 9.45 సమయంలో ఎనిమిది ఎఫ్‌16లు, నాలుగు మిరాజ్‌ -3, నాలుగు జేఎఫ్‌-17 విమానాలు సమూహంగా నియంత్రణ రేఖ దాటి చొచ్చుకొచ్చాయి. వీటికి రక్షణగా కొన్ని విమానాలు నియంత్రణ రేఖకు అవతలవైపు సిద్ధంగా ఉన్నాయి. నియంత్రణ రేఖ దాటిన పాక్‌ విమానాలను భారత వాయు సేనకు చెందిన ఎనిమిది విమానాలు అడ్డుకొన్నాయి. వీటిల్లో నాలుగు సుఖోయ్‌ 30లు, రెండు మిరాజ్‌ 2000, రెండు మిగ్‌21బైసన్‌లు ఉన్నాయి. మిగ్‌21లలో ఒక దానిని వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ నడిపారు. అతడు ఒక ఎఫ్‌16 పైకి ఆర్‌-73 క్షిపణిని ప్రయోగించాడు. మరో వైపు నుంచి పాక్‌ ఎఫ్‌16 కూడా రెండు ఏఎంఆర్‌ఏఏఎం క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో ఒకటి అభినందన్‌ విమానాన్ని తాకింది. ఈ క్రమంలో ఎఫ్‌16 విమానం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భూభాగంలో కూలిపోయింది. రెండు విమానాల్లో పైలట్లు నియంత్రణ రేఖకు అవతల నేలపైకి దిగారు. వీరిలో పాక్‌ ఎఫ్‌16 పైలట్ల పరిస్థితి ఇప్పటి వరకు తెలియదు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close