పాతదే.. కానీ చరిత్ర గొప్పది

0

అందరూ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు గురించే మాట్లాడుకుంటున్నారిప్పుడు. దశాబ్దాల పాటు సేవలందించిన బేగంపేట ఎయిర్‌పోర్టును మాత్రం మర్చిపోయారు. అది పాతతే కావొచ్చు.. చరిత్ర మాత్రం చాలా గొప్పది. 1930లో హైదరాబాద్‌ ఎయిరో క్లబ్‌ ఆధ్వర్యంలో ఆఖరు నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ దీనిని ఏర్పాటు చేశారు. ఇది నిజాం దక్కన్‌ ఎయిర్‌వేస్‌ లిమిటెడ్‌ పేరిట అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉండేది. బ్రిటీష్‌ ఇండియా కాలంలో ప్రాచీనమైన ఈ విమానాశ్రయంలో 1937లో టెర్మినల్‌ ప్రారంభమైంది. తదనంతర కాలంలో దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటిగా మారిపోయింది. నిజాం హయాంలోనే ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు ఉండేవి. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైన తర్వాత మరిన్ని సర్వీసులు నడిచాయి. దశాబ్దాల పాటు సేవలందించి హైదరాబాద్‌ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఈ ఎయిర్‌పోర్టు 2008లో రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రారంభమయ్యే వరకు ప్రయాణికులకు సేవలు అందించింది. అప్పటికే దేశంలోనే ఆరో అతి పెద్ద విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం మిలిటరీ ఏవియేషన్‌ శిక్షణ కేంద్రంగానూ, విఐపీల విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకుగానూ ఈ విమానాశ్రయం ఉపయోగపడుతున్నది. ఇక్కడ నుంచి చివరగా బయలుదేరిన వాణిజ్య విమానం థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఇంటర్‌నేషనల్‌ ట్కఫ్లెట్‌ టీజీ 330. ఈ ట్కఫ్లెట్‌ మార్చి 22, 2008న బ్యాంకాక్‌కు బయలుదేరి వెళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here