Featuredజాతీయ వార్తలు

‘ఒలింపిక్‌’లో రచ్చ.. అష్టవక్రుల క్రీడలు

  • అనుభవం లేకున్నా..
  • ‘చెస్‌’కు చెదలు..!
  • ఆంధ్ర కబడ్డీలో లుకలుకలు
  • ఈనెల 9 కీలకం.

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఈ దేశంలో క్రీడాకారుల దౌర్భాగ్యం ఏమిటంటే… వాళ్ళ భవిష్యత్‌ నిర్ణయించేది.. వాళ్ళ కోచ్‌ లు. కాదు. ఆ,యా అసోసియేషన్‌ లు కాదు.. ఐదేళ్ళకు ఒకసారి మారే రాజకీయులు..అందుకు మడుగులొత్తే దౌర్భాగ్యులు. ఎందుకుర్రా.. మీ విదేశీ పర్యటనల మోజుకు క్రీడలు.. ఏంచక్కా ఏదో ఒక సెటిల్‌ మెంట్‌ చేసుకొని.. పాపం ఈ క్రీడాకారులను వదిలేయండ్రా.. నీచుల్లారా.. మీరు క్రీడాకారులు కాదు. ఎందుకు ర్రా.. ఈ రంగం మీకు. చివరిగా చెపుతున్నాం.. తప్పుకోండి.. లేదంటే..మీ బతుకులు నగ్నంగా బయట పెడతాం. మీ బలహీనతలు తెలుసు. అందులో ఉన్న ‘అందం’ తెలుసు. క్రీడలను బతకనీయండి. బతకనిద్దాం. వాళ్ళ కష్టం వాళ్ళది. వాళ్ళు ఎలాగో పేరు తీసుకు వస్తారు. అది మీ ఘనతే అని ‘చెప్పు’కు చావండి. ఆంధ్రప్రదేశ్‌ కబడ్డీ లో లుకలుకలు ఉండనే ఉన్నాయి. ఊహించని రీతిలో మేథావుల క్రీడలో కూడా కొందరు ముసుగు దొంగలు బయలుదేరారు. వారిని వెళ్ళగొట్టే ప్రయత్నం సుందరంగా జరుగుతోంది. ఇక అన్ని క్రీడా సంఘాలను కలుపుకుంటూ వెళ్ళే ఒలింపిక్‌ అసోసియేషన్‌ బాగోగులపై జస్ట్‌ ఓ 5 నిమిషాలు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ఫోకస్‌.. మాత్రమే.

అంగడిబొమ్మ: క్రీడా సంఘాలు అంగట్లో బొమ్మలా తయ్యారయ్యాయి. ఏదైనా ఉద్యోగం కావాలంటే ఒక అర్హత అవసరం. ఏ అర్హత లేకున్నా… ఎగేసుకొని, రంగులు వేసుకొని రాజకీయాలు చేయడానికి ఓ అడ్డదారి బిడ్డలు ఈ క్రీడా సంఘాలు. ఒకటి రెండు అందుకు మినహాయింపు.

ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ..: తెలంగాణ ఒలంపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ నువ్వా..? నేనా..? అన్నట్లు పోటీ పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషనన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను కొండెక్కాయి.

కోర్టుకు వెళతాం: గతంలో ఒలంపిక్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ తెలంగాణకు నాయకత్వం వహించిన కె.రంగారావు నామినేషన్‌ ను స్వీకరించగా.. జయేష్‌ రంజన్‌ క్యాట్‌ నుంచి అనుమతి పొందక పోవడంతో ఆయన నామినేషన్ను తిరస్కరణకు గురైంది. దీనిపై జయేష్‌ రంజన్‌, జితేందర్‌ రెడ్డి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ అధ్యక్ష ఎన్నికలు కాస్త రాజకీయ నాయుడికి, ప్రభుత్వ అధికారికి మధ్య పోటీగా మారనున్నాయి. ఇదే దౌర్భాగ్యం.

ఆ ఎన్నికలు జరగనిచ్చే ప్రసక్తే లేదు: తెలంగాణ ఒలంపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు సంబంధించి హైడ్రామా కొనసాగుతోంది. ఈ నెల 9న జరగబోయే ఎన్నికలను అడ్డుకుంటామని జయేష్‌ రంజన్‌ ప్యానల్‌ అంటోంది. రిటర్నింగ్‌ అధికారి చంద్రకుమార్‌ నియామకం చెల్లదని చెబుతోంది. మాజీ న్యాయమూర్తి కేసీ.భానును మొదట రిటర్నింగ్‌ అధికారిగా నియమించి, అనంతరం తెర మీదకి మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ను తీసుకురావటాన్ని తప్పుబడుతోంది. ఢిల్లీ పెద్దల సహకారంతో కొందరు తెలంగాణలో పెత్తనం చేయాలని చూస్తున్నారని జయేష్‌ రంజన్‌ ప్యానెల్‌ ఆరోపిస్తోంది.

ఢిల్లీలో కాదు.. ఎన్నికలు హైదరాబాద్లోనే..: ‘తెలంగాణ ఒలంపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఢిల్లీలో కాదు.. హైదరాబాద్లోనే జరిగి తీరతాయ్‌’ అని తెలంగాణ హ్యాండ్బాల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జగన్‌ మోహన్‌ రావు అన్నారు. ఒలంపిక్‌ ఎన్నికల విషయంలో నెలకొన్న పరిణామాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రిటర్నింగ్‌ అధికారిగా చంద్రకుమార్‌ నియామకంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. జయేష్‌ రంజన్‌ నామినేషన్‌ తిరస్కరించటం అనైతికమని తెలిపారు. నామినేషన్‌ తిరస్కరించటానికి గల కారణాలు చంద్రకుమార్‌ ఇప్పటికీ చెప్పటంలేదని, రిటర్నింగ్‌ ఆఫీసర్గా చంద్రకుమార్ను ఎవరు నియమించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ముగింపు: దేశంలో ఉన్న క్రీడాకారులకు కొదవ లద.క్రీడా సంఘాలకు హద్దుల్లేవ్‌. అందుకే పతకాల కోసం ఆర్మీకి అప్పగిస్తే..మొత్తం క్రీడా వ్యవస్థ చటుక్కున బాగుపడుతుంది. లేదంటే మరికొన్ని దశాబ్దాలు పతకాల కోసం చకోరా పక్షుల్లా ఎదురు చూడాల్సిందే..!

మేథావుల క్రీడలో…

సరిగ్గా ఇదేరోజున అంటే ఫిబ్రవరి 9న చెన్నైలో అఖిల భారత చెస్‌ అసోసియేషన్‌ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో గాడి తప్పిన చదరంగం అసోసియేషన్‌ ను సుందర్‌ సుందరంగా తీర్చిదిద్దాడు. ఒకవిధంగా నిక్కచ్చిగా చెప్పాలంటే సుందర్‌ వచ్చిన తర్వాత చెస్‌ రూపు రేఖలు మారాయి. దేశవాళి చెస్‌ ఆర్థికంగా బలోపేతం అయింది. ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతోంది. అదే విధంగా జిల్లాస్థాయి వరకు అలాగే ఉండాలని ఆయన ఆకాంక్ష. అయితే ఇంతలో కోర్టులో కేసులతో సహజీవనం చేసే గబ్బిలాల రూపంలో ఉండే ‘శిఖండులు’ మధ్యలో కెలకటం సహజంగా మారింది. ఊహించని రీతిలో కొందరు ఈ శిఖండులను బలపర్చటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ ఆ క్రీడ మీద ఉన్న గౌరవంతో ఇంత వరకే ప్రస్థావన. ఏది ఏమైనా ఈనెల 9న జరిగే ఎన్నికల్లో డి.వి.సుందర్‌ నాయకత్వంలోని అసోసియేషన్‌ గెలవడం ఖాయం. తర్వాత ఆయన ముసుగులు వేసుకున్న వాళ్ళందర్నీ ‘కబడ్డీ..’ కాదు.. కాదు..సారీ.. సీరియస్‌ గా ‘ఫుట్‌ బాల్‌’ ఆడటం ఖాయం. తథాస్తు. విజయోస్తు.. సుందర్‌ జీ.. ఆల్‌ ద బెస్ట్‌. ముందే కంగ్రాట్స్‌ చెపుతున్న ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close