Featuredరాజకీయ వార్తలు

కమలిపోయిన హస్తం

మాజీ మంత్రి సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఆదివారం నాడు టీఆర్‌ఎష్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఆమె తనయుడు కార్తీక్‌ రెడ్డి కూడ సమావేశమయ్యారు. సీఎల్పీ పదవి దక్కకపోతే టీఆర్‌ఎస్‌లో చేరాలని సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకొన్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజేంద్రనగర్‌ సీటు నుండి పోటీ చేయాలని కార్తీక్‌ రెడ్డి భావించారు. కానీ, ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్‌ కు రాజీనామా చేశారు. ఈ నెల 9వ తేదీన శంషాబాద్‌లో జరిగిన రాహుల్‌ సభకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.ఈ సభ పట్ల కూడ ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరో వైపు ఆదివారం ఇందూరు ఎమ్మెల్యే హరిప్రియ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్‌ మాసంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా హరిప్రియా నాయక్‌ పోటీ చేసి విజయం సాధించారు.

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆకర్ష్‌తో రాష్ట్ర రాజకీయాలే తారుమారవుతున్నాయి. వివిధ పార్టీకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్య నాయకులు టిఆర్‌ఎస్‌ తీర్దం పుచ్చుకోవడంతో రాజకీయ విశ్లేషకులకు కూడా అర్ధం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొన్నటి మొన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మేల్యేలు కారు ఎక్కగా తాజాగా చేవెళ్ళ చెల్లమ్మతో పాటు ఆమె తనయుడు కూడా టిఆర్‌ఎస్‌ గూటికి చేరుతుండడంతో ఒక్క సారిగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ముఖ్యనాయకులు ఖంగుతున్నారు. అయితే వీరు అధికార పార్టీలో చేరేందుకు ఎఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసి మద్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. తాజాగా, ఆ పార్టీకి చెందిన కీలక నేత అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌ రెడ్డిలు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మజ్లిస్‌ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్‌ ఓవైసీ వీరు పార్టీ మారడానికి మధ్యవర్తిత్వం వహించినట్లుగా తెలుస్తోంది. మూడ్రోజుల క్రితం సబిత, కార్తిక్‌లు అసదుద్దీన్‌తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పలు అంశాలపై చర్చించారని సమాచారం. తెరాసలో చేరే అంశంపై వారితో అసద్‌ మాట్లాడారని తెలుస్తోంది. తాజాగా, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుతోను భేటీ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో వారు కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాసలో చేరనున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తీరు పట్ల సబితా ఇంద్రా రెడ్డి, కార్తీక్‌ రెడ్డిలు తీవ్ర అసంత ప్తితో ఉన్నారు. శనివారం జరిగిన రాహుల్‌ గాంధీ సభలో కనీసం తమను పరిచయం కూడా చేయలేదని కార్తీక్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకుల్లో సబితా ఇంద్రారెడ్డి కీలకమైన నేత. వికారాబాద్‌ జిల్లా కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న జన్మించారు. భర్త, మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మరణంలో జరిగిన ఉపఎన్నికలలో 2000లో కాంగ్రెస్‌ తరఫున తొలిసారిగా చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. అనంతరం చేవెళ్ళ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. ఈ నాయకుడి గురించి తెలుసుకోండి రాహుల్‌ గాంధీ రాజకీయ జీవితంఆస్తుల వివరాలుసంప్రదించండిచిత్రాలు 2004లో చేవెళ్ళ నుంచి గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చేవెళ్ళను ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు. దీంతో 2009 మహేశ్వరం నుంచి పోటీ చేసి గెలిచారు. 2004-09 కాలంలో గనుల శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 వైయస్‌ రాజశేఖర రెడ్డి కేబినెట్లో కీలక హోంశాఖ బాధ్యతలు చేపట్టారు. హోంశాఖ మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు.

టీఆర్‌ఎస్‌ లోకి ఎమ్మెల్యే హరిప్రియ

కాంగ్రెస్‌కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోగా.. రేపోమాపో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్య కారెక్కనున్నారు. వీరితోపాటు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ కూడా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆదివారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన హరిప్రియ త్వరలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆమె చేరిక రేవంత్‌ రెడ్డికి పెద్ద షాకే అని చెప్పాలి. రేవంత్‌ ఆశీస్సులతో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close