ఆంధ్రా లోకేష్‌కు.. తెలంగాణ ఎన్టీఆర్‌కు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూకట్‌ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికష్ణ కూతురు సుహాసినిని పోటీ దించడం వెనక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పక్కా వ్యూహంతో

వ్యవహరించినట్లు అర్థమవుతోంది. రాజక ీయంగా నందమూరి, నారా కుటుంబాలను స్థిరపరిచే ఆలోచన అందులో ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబం తెలం గాణలో, నారా కుటుంబం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నడిపించడానికి తగిన రాజకీయ వ్యూహ రచన అందులో ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి హరిక ష్ణ కుమారుడు కల్యాణ్‌ రామ్‌ ను కూకట్‌ పల్లి నుంచి పోటీకి దించడానికి ఆయన ప్రయత్నించారు. కల్యాణ్‌ రామ్‌ అంగీకరించకపోవడంతో కూతురు సుహాసినిని దించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనతో ఉన్నారనేది అందరికీ తెలిసిందే. ఆయన తెలుగుదేశం పార్టీని నడిపించాలనే ఆలోచనతోనే ఉన్నట్లు చెబుతారు. ఈ స్థితిలో జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ప్రవేశించా లనుకుంటే తెలంగాణను ఆయనకు వదిలేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సుహాసినిని పోటీకి దించారని అంటున్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తన తనయుడు నారా లోకేష్‌ కు పూర్తిగా లైన్‌ క్లియర్‌ అవుతుందనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. నందమూరి కుటుంబం నుంచి నారా లోకేష్‌ కు దానివల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు. సుహాసిని పోటీ చేయడం కల్యాణ్‌ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ లకు ఇష్టం లేదని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఇరువురు కూడా తమ అక్కకు మద్దతు తెలియజేస్తూ ప్రకటన చేశారు. సుహాసినిని పోటీకి దించడం వల్ల జూనియర్‌ ఎన్టీఆర్‌ తనకు వ్యతిరేకంగా పనిచేయడానికి ముందుకు రారని చంద్రబాబు భావించి ఉంటారని అంటున్నారు. నారా లోకేష్‌ ను పార్టీలో ప్రమోట్‌ చేయడాన్ని నందమూరి కుటుంబం మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. చంద్రబాబు తన కార్యరంగాన్ని పూర్తిగా అమరావతికి మార్చిన తర్వాత తెలంగాణను వదిలేశారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆంధ్రలో కన్నా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండేది. పార్టీని చేజేతులా పాడు చేసుకున్నామని టీడీపి నేతలు ఆవేదన చెందిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ పగ్గాలను జూనియర్‌ ఎన్టీఆర్‌ కు గానీ నారా బ్రాహ్మణికి గానీ అప్పగించాలని వారు చంద్రబాబును కోరుతూ వచ్చారు. అయితే, అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కొన్ని జిల్లాల్లో పార్టీ ఇప్పటికీ బలంగా ఉందని, బలమైన నాయకుడు పార్టీని నడిపిస్తే పుంజుకుంటుందని తెలంగాణ టీడీపి నేతలు చెబుతూ వచ్చారు. ఈ స్థితిలోనే పార్టీకి తెలంగాణలో తిరిగి ప్రాణం పోయడానికి, నందమూరి కుటుంబానికి తాను వ్యతిరేకంగా లేనని చాటుకోవడానికి చంద్రబాబు సుహాసినిని పోటీకి దించారని భావిస్తున్నారు. తద్వారా తెలంగాణ పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాననే సంకేతాలను ఆయన పంపించారు. అదే సమయంలో నందమూరి కుటుంబం తెలంగాణకే పరిమితమైపోతుంది. ఎపిలో నారా కుటుంబానికి ఏ విధమైన ఆటంకాలు ఎదురు కావు. అదే సమయంలో ప్రజా కూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తే సుహాసినికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. కాంగ్రెసు నాయకుడు సర్వే సత్యనారాయణ ఇప్పటికే ఆ విషయాన్ని చెప్పారు. ప్రజాకూటమి నేత త్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూకట్‌పల్లి నుంచి విజయం సాధించే నందమూరి సుహాసినికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here