ఇక‌పై మీ ఇన్‌స్టాగ్రాం డేటాను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు..!

0

ఫేస్‌బుక్‌కు చెందిన సోష‌ల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రాంను వాడుతున్న యూజ‌ర్లు ఇకపై అందులో త‌మ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. యూజ‌ర్లు త‌మ ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌ల‌ను వారు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు క‌ల్పించ‌నున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు సంబంధించి ప్ర‌స్తుతం స‌మాచార గోప్య‌త‌పై అంద‌రిలోనూ సందేహాలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఆ సంస్థ‌కు చెందిన ఇన్‌స్టాగ్రాంలో ఇలా యూజ‌ర్లు త‌మ డేటాను డౌన్‌లోడ్ చేసుకునే స‌దుపాయం క‌ల్పించారు. ఫేస్‌బుక్‌లో యూజ‌ర్లు త‌మ డేటాను డౌన్‌లోడ్ చేసుకునే స‌దుపాయాన్ని ఇప్ప‌టికే అందిస్తుండ‌గా, దానికి అద‌నంగా ఇన్‌స్టాగ్రాంలోనూ ఆ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఫీచ‌ర్ ఎప్పుడు ల‌భ్య‌మ‌వుతుందో ఇన్‌స్టాగ్రాం వెల్ల‌డించ‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here