Featuredస్టేట్ న్యూస్

నాడు మావోలకోసం.. నేడు మాఫియా కోసం వేట

మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న ఎస్సై బాలకష్ణ

బూర్గంపాడు, (ఆదాబ్‌ హైదరాబాద్‌):

బూర్గంపాడు మండలం లో ఇసుక మాఫియా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు అన్ని రకాల అడ్డదారులు తొక్కుతూంది. ఇంటి నిర్మాణానికి, మరుగుదొడ్లు నిర్మాణానికి ఇసుక తప్పనిసరి కావడంతో ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు ఆరు టిప్పర్లుగా విరబూస్తుంది. ప్రజల అవస రాలకు అనుగుణంగా అదికారులు తక్కువ ధరకే ఇసుక అందించే విధంగా చేసిన ఏర్పాట్లను కొందరు పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరో పణలు వినపడుతున్నాయి. అక్రమంగా ఇసుకను వేరు వేరు ప్రాం తాల్లో వివిద రకాల వాహనాలు ద్వారా తరలించి అక్కడ భారీ స్ధాయిలో నిలువలు పెట్టి అర్దరాత్రులు జెసిబిల సహాయంతో లారీ లకు ఎత్తి సుదూర ప్రాంతాలకు అక్రమ రవాణాను కొనసా గిస్తూ లక్షలకు పడగలెత్తుతున్నారు. ఈ అక్రమ రవాణా విషయం చర్చనీయాంశంగా మారడంతో బూర్గంపాడు ఎస్సైగా 20రోజుల క్రితం భాద్యతలు స్వీకరించిన బాలకష్ణ సవాల్‌గా తీసుకున్నారు. గతంలో పనిచేసిన ఎస్సై వెంకటప్పయ్య మాఫియా పై తనదైన శైలిలో ఉక్కుపాదం మోపారు.

ప్రస్తుత ఎస్సై మాఫియాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. మాప ˜ియా మూలాలను గుర్తించి ఆదిలోనే రెడ్డు కార్పెట్కు రక్తకన్నీరు చూపిస్తున్నారు. పగలంతా ఓ రకమైన విదులు నిర్వర్తిస్తే, రాత్రి పూట ఇసుక మాఫియా వ్యాపారం చెక్‌ పెట్టేందుకు విస్త తంగా కషి చేస్తూ మహా మాయగాళ్ళను కటకటాలపాలు చేస్తున్నారు. మాఫియాను అరికట్టేందుకు ఎస్సై తీసుకుంటున్న చర్యలకు మం డల ప్రజలు ఫిదా అవుతున్నారు. ఏ నలుగురు నోటైనా ఇసుక మాఫియా పై ఎస్సై తీసుకుంటున్న చర్యల గురించి చర్చే నడు స్తుంది. భాద్యతలు స్వీకరించిన కొద్ది రోజులలోనే భారీ స్ధాయిలో ఇసుక నిలువలపై దాడి చేయడం, ట్రాక్టర్లను, జెసిబిలను, లారీల ను పట్టుకొని సీజ్‌ చేశారు. గతంలో ఆయన పనిచేసిన దగ్గర మావోల కోసం వేట కొనసాగిస్తే నేడు మాఫియా కోసం వేటా డుతూ సత్ఫలితాలు రాబడుతున్నారు. ప్రజలు సహకరించి సమా చారమందిస్తే మాఫియా అనే పదం వినపడకుండా చేస్తానని, సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచు తామని ఎస్సై బాలకష్ణ చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రజాక్షే త్రంలో మంచివారిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకులు మాఫియా కోసం స్టేషన్‌ చుట్టూ తిరుగడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శి స్తున్నారు. ఇప్పటికైనా వారు వాస్తవాన్ని గుర్తించి మాఫియాకు దూరంగా ఉంటే భవిష్యత్తు రాజకీయాలలో మంచి స్ధాయికి ఎదిగే అవకాశం ఉంది. లేదంటే చరిత్రలో కలిసి పోయే పరిస్థితులు ఏర్పడతాయని అనుకుంటున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close