తెరాసలో విలీనంపై నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు

0
  • విచారణ నాలుగు వారాలకు వాయిదా

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ శాసనమండలి పక్షాన్ని టిఆర్‌ఎస్‌లో విఈనం చేయడంపై దాఖలైన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీచేసింది. తెరాస శాసనమండలి పక్షంలో కాంగ్రెస్‌ శాసనమండలి పక్షం విలీనం వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్సీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, సంతోష్‌కుమార్‌, ఆకుల లలిత, దామోదర్‌ రెడ్డిలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. శాసనమండలి ఛైర్మన్‌, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నోటీసులు జారీచేసింది. కాంగ్రెస్‌ శాసనమండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని గతంలో కాంగ్రెస్‌కు చెందిన ఈ నలుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి అప్పటి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు లేఖ ఇవ్వగా దాన్ని ఆమోదించారు. విలీనాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాదులు మల్లేశ్వరరావు, బాలాజీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ మండలి జారీచేసిన బులెటెన్‌ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. విలీనం పేరుతో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here