Featuredజాతీయ వార్తలురాజకీయ వార్తలు

మహాకూటమి కాదు.. మాయగాళ్ల కూటమి

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడ కూటమిని ఏర్పాటు చేస్తున్నారనే విషయం తనకు తెలియదని ప్రధాన మంత్రి మోడీ చెప్పారు.తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఘోరంగా ఓటమి పాలయ్యాడని మోడీ సెటైర్లు వేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయమై స్పందిస్తూ కేసీఆర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయమై తాను ఏనాడూ ఆలోచించలేదన్నారు. మహాకూటమి కూడ ప్రజల కోసం కాదన్నారు. మోడీని గద్దె దించడం కోసమే ఈ కూటమిని ఏర్పాటు చేస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఘోర పరాజయం పాలయ్యాడని మోడీ చెప్పా రు. వచ్చే ఎన్నికల్లో ఎజెండాను ప్రజలే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.తెలంగాణలోనే మహా కూట మికి తొలి దెబ్బ తగిలిందని మోడీ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో ఎన్డీఏతో ఎవరూ ఉం టారో ఉండరో తాను ఇప్పుడే చెప్పలేనని మోడీ స్పష్టం చేశారు. కూటమి సత్తా ఏమిటో తెలంగాణ ఎన్నికలతోనే తేలిపోయిందని మోడీ అభిప్రాయపడ్డారు. భాగస్వామ్యపక్షాలను కాంగ్రెస్‌ పార్టీ గుర్తించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ వ్యవస్థను గౌరవించిందని మోడీ ప్రశ్నించారు.తెలంగాణలో గెలుస్తామని చెప్పలేదు…తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో గెలుస్తామని తాము చెప్పలేదని చెప్పారు.తనపై విమర్శలు చేసేవారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారసత్వం, అవినీతి అనేది కాంగ్రెస్‌ పార్టీ విధానమని మోడీ చెప్పారు. కాంగ్రెస్‌ సంస్క తిని భారత్‌ నుండి తరిమి కొట్టాలని మాత్రమే తాను చెప్పానని.. కాంగ్రెస్‌ పార్టీ నుండి తరిమికొట్టాలని చెప్పలేదన్నారు. పోలింగ్‌ బూత్‌ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు, మహాకూటమికి మధ్య పోటీ జరుగుతోందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ వెనుక రాజకీయ ఒత్తిడులు లేవన్నారు. ఆరేడు మాసాల క్రితమే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తానని ఉర్జిత్‌ పటేల్‌ కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను పెద్ద నోట్లను రద్దు చేసినట్టు మోడీ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా తీసుకొన్న నిర్ణయం కాదని చెప్పారు. మెరుపు దాడుల నిర్ణయం అత్యంత ప్రమాదకరమైందని ఆయన చెప్పారు.అందుకే ఈ నిర్ణయాన్ని అమలు చేయడం విషయమై రెండు సార్లు తేదీలను మార్చినట్టు ఆయన తెలిపారు. దాడులు చేసి తెల్లవారే లోపుగానే తిరిగి రావాలని సూచించామన్నారు. ప్రజల్లో సైనిక కమెండోల రక్షణకే అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు.ఆపరేషన్‌ విజయవంతమైనా.. ఫెయిలైనా కూడ తెల్లవారేలోపుగానే రావాలని సూచించినట్టు చెప్పారు. గతంలో దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఉండి ఉంటే అవినీతిపరులు దేశంలోనే ఉండేవారని చెప్పారు. గత ప్రభుత్వాలు లేని కారణంగానే దొంగలంతా దేశాన్ని వీడి పారిపోతున్నారని మోడీ సెటైర్లు విసిరారు. అవినీతి పరుల విషయంలో చట్టం తన పని తాను చేసుకొని పోతోందని చెప్పారు. విదేశాల్లో తలదాచుకొన్న అవినీతిపరులను దేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. జీఎస్టీ అమలు చేసే ముందు అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకొన్నట్టు మోడీ గుర్తు చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌ లో కాంగ్రెస్‌ పార్టీ సీఎంలు కూడ ఉన్నారని ఆయన ప్రస్తావించారు. జీఎస్టీ కౌన్సిల్‌ లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సీఎంలను ఆ పార్టీ తప్పు పడుతోందా అని ఆయన ప్రశ్నించారు. జీఎస్టీని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ అంటూ రాహుల్‌ విమర్శించడం ఆయన ఆలోచన విధానానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ పూర్తయ్యాకే రామమందిరంపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో విజయం సాధిస్తామని ఏనాడూ కూడ చెప్పలేదన్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ పాలన కారణంగా వచ్చిన వ్యతిరేకత కారణంగానే ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైందన్నారు. కానీ, హర్యానా, త్రిపుర, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాల్లో తాము విజయం సాధించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close