సారుకూ… ఇంకా దొరకని దారి..

0

-సీట్ల కోసం తప్పని ఎదురుచూపులు..

– ఉందామా.. బయటికెళదామా తెగని సందిగ్థత..

– టిజెఎస్‌కు ఎర వేసేందుకు టిఆర్‌ఎస్‌ ప్రయత్నం..

ఆయనొక పెద్ద ప్రొపెసర్‌.. తెలంగాణ ఉద్యమాన్ని ఒంటిచెత్తో ఉర్రూతలూగించిన విద్యావేత్త.. రాష్ట్రం ఇస్తారా.. చస్తారా.. అనే వెనకా, ముందు చూడకుండా పోరాటాన్ని ముందుండి నడిపించారు. లక్షలాది జనం, వేలాదిమంది విద్యార్థులు ఆయనే నమ్ముకుని, ఆయన వెంట నడిచారు. ఆయన మాట చెపుతే చాలు.. విద్యార్థిలోకం ఉప్పెనలా ఎగిసిపడింది. స్వరాష్ట్రం కోసం అలుపెరగని శ్రామికుడు కోదండరాం. స్వరాష్ట్రం వచ్చినా ఏ ఆశయం కోసమైతే తెలంగాణ కోసం పోరాడామో, ఆ ఆశయం నేరవేరలేదని తాను స్వతహాగా పార్టీని స్థాపించాడు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా మహకూటమిలో చేరిన తెలంగాణ జన సమితి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏంటో తెలియక టెన్షన్‌ మీద టెన్షన్‌ పడుతుంది..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కోట్లాది మంది పోరాటాల ఫలితంగా తెలంగాణ సాధించాం. మన హక్కులు, మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకే రావాలని ఉద్యమించి తెచ్చుకున్న రాష్ట్రం మన బంగారు తెలంగాణ. తెలంగాణ వచ్చాక కూడా అది ప్రజల పాలన కాకుండా కుటుంబ పాలనగా మారిందని, తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చి అధికారాన్ని అనుభవించారని ఆరోపించారు తెలంగాణ వాదులు. మన రాష్ట్రం మనకు కాకుండా పోయిందని అందుకే మనమే విద్యావంతులము, విద్యార్థులం అందరం కలిసి పార్టీ పెట్టాలని నిర్ణయించారు ప్రొపెసర్‌ కోదండ రాం. ఆయన పర్యవేక్షణలోఆయన వ్యవస్థాపకుడిగానే తెలంగాణ జనసమితి పార్టీ అని ఏర్పడింది. తెలంగాణలో 2019లో జరుగబోయే ఎన్నికల్లో అందరం ఏకమై ఇప్పుడు అధికారంలో ఉన్న కెసిఆర్‌ ప్రభుత్వాన్ని గద్దెదించాలని లక్ష్యంతో ముందుకు సాగుతు న్నారు. కాని తెరాస అధినేత కెసిఆర్‌ ముందుస్తు ఎన్నికల్లో భాగం గానే అసెంబ్లీని రద్దు చేయడంతో పోటికి సరియైన సమయం లేక నో, తక్కువ కాలంలో తెరాసను ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలన్నీ మహాకూటమిగా ఏకమయ్యాయి. తెలంగాణ అమరవీరుల పేరుతో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా మహకూటమి ముందుకు దులుతుంది. అసెంబ్లీని రద్దు చేసిన కెసిఆర్‌ ఆ రోజు తెరాస పోటీ చేసే 105మంది అభ్యర్థులను ప్రకటించింది. ఎవరి ప్రచారంలో వారు బిజీగా ఉన్నారు. కాని ఒకే కూటమిగా ఏర్పడిన బిజెపి, సిపిఐ తప్ప మిగతా ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అభ్యర్థుల పరిశీలనలో, వెతుకులాటలోనే ఉంది. ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి. గెలిచే స్ధానాలెన్ని, ఏ పార్టీ ఎక్కడ గెలుస్తుందీ, ఎవరికి ఎక్కడ బలముందీ అనే చర్చలోనే మునిగితేలుతున్నారు. అధికారపక్షం మాత్రం ఎన్నికల ప్రచారంలో ముందుంటే, ప్రతిపక్షం మాత్రం అభ్యర్థులను ప్రకటించకుండానే ప్రచారం నిర్వహిస్తుంది. మాకెన్ని సీట్లు వస్తాయో, ఎక్కడ వస్తాయో అనే సందిగ్ధంలోనే కూటమి నేతలు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here