Featuredప్రాంతీయ వార్తలు

నీళ్లు లేవు.. జుట్టు కట్‌..

బలవంతంగా 180 మంది అమ్మాయిల

  • వద్దని ఏడ్చినా వినలేదన్న విద్యార్థులు..
  • నీళ్లు రానందుకే కట్‌ చేశానన్న ప్రిన్సిపాల్‌..
  • అందోళనకు దిగిన విద్యార్థినీల తల్లిదండ్రులు..
  • సంగారెడ్డి సాంఘిక సంక్షేమ హస్టల్‌ లో దారుణం

మేడమ్‌ వద్దు మేడమ్‌.. ప్లీజ్‌ మేడమ్‌.. నాకు పోడగాటి జుట్టు అంటే చాలా ఇష్టం మేడమ్‌ అని ఒకరు. దేవుడి మొక్కు ఉంది నేను కట్‌ చేసుకోలేనని మరోకరు.. మిగతా వారు ఏడ్చినా, తూడ్చినా, బతిమిలాడినా ససేమిరా వినకుండా నూట ఎనభై మంది విద్యార్థినీల జుట్టు కత్తిరించింది ఆ ప్రిన్సిపాల్‌.. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా ఉంది మన పాలన.. ప్రభుత్వం తన గొప్పదనం కోసం పలు విద్యాసంస్థలు నిర్మిస్తోంది. కాని కనీస సదుపాయాలు కల్పించడం మాత్రం తమ విధి కాదన్నట్లుగానే వ్యవహరిస్తోంది. అట్టహసంగా, అత్యంత అర్భాటంగా నిర్మించిన మినీ గురుకుల పాఠశాలలో సరియైన సమయానికి సరిపోయేనన్ని నీళ్లు రావట్లేదని నూట ఎనిమిది మంది విద్యార్థినీల జుట్టు కత్తిరించిన మహనుభావురాలను తప్పు అనాలో, సదుపాయాలు మరిచిన ప్రభుత్వాన్ని తప్పు పట్టాలో అర్థం కావట్లేదు. విద్యార్థినీలు వద్దంటున్నా, ఏడ్చి, బతిమిలాడినా ఒక్కరి మాట కూడా వినకుండా అందరికి వరుసపెట్టి కటింగ్‌ చేపించారు. ప్రభుత్వం అందరూ చదువుకోవాలని సంక్షేమ హస్టల్స్‌ ను ప్రారంభించి వదిలేసింది కాని కనీస సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం మానేసిందనే ఆరోపణలున్నాయి. నూట ఎనభై మంది అమ్మాయిలు చదువుకుంటున్న గురుకుల పాఠశాలలో నీళ్ల సదుపాయం కూడా కల్పించలేని దీన స్థితిలో ప్రభుత్వం ఉందా.. ఒకవైపు తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం రాష్ట్ర మొత్తం సిగ్గు పడేలా జరిగిన ఈ సంఘటనపై ఏలా స్పందిస్తుందో చూడాల్సిందే..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌ :

ఎక్కడైనా నీటి సమస్య ఉంటే ఏం చేస్తారు. ఏదో ఒక ప్రయత్నం ద్వారా తెప్పించుకొని వాడుకుంటారు. మరికొంతమంది వాటర్‌ ట్యాంకర్ల ద్వారా తెచ్చుకుంటారు. కొందరైతే బోరు వేసుకుంటారు. మరికొందరైతే వర్షం నీటిని జాగ్రత్త చేసుకుని వినియోగించుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఎవరి అవకాశాన్ని బట్టి వారు తెచ్చుకొని వాడుతారు. కాని అది పెద్ద హస్టల్‌ గా పేరుపొందిన సంగారెడ్డి ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో నీటికి ఇబ్బంది ఉందని గమనించిన ప్రిన్సిపాల్‌ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సింది పోయి, ఆడపిల్లలు తలస్నానం చేయడం వల్లనే నీళ్లు ఎక్కువగా అవుతున్నాయని వరుస పెట్టి తల్లిదండ్రులకు సైతం చెప్పకుండా అందరికి కటింగ్‌ చేపించింది. మెదక్‌ జిల్లా కేంద్రంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ మినీ గురుకుల పాఠశాలలో 1వ తరగతి నుంచి ఆరో తరగతి వరకు పాఠశాలతో పాటు బాలికల వసతి గృహం కూడా ఉంది. ఇందులో సుమారుగా 180 మంది అమ్మాయిలు విద్యను అభ్యసిస్తున్నారు. కొంత కాలం నుంచి ఈ హాస్టల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. బోరు ఉన్న పనిచేయకపోవడంతో అప్పుడప్పుడి బయట నుంచి ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నారు. అయినా నీటి సమస్య తీరడం లేదు. శాశ్వత పరిష్కారం కోసం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాల్సిన ప్రిన్సిపాల్‌ తన స్వంత తెలివితేటలతో విద్యార్థినీలను ఆవేదనకు గురిచేసింది.

బలవంతంగా జుట్టు కత్తిరింపు..

విద్యార్థుల జట్టు కత్తిరిస్తే తల స్నానానికి అయ్యే నీటి వంతు తగ్గుతుందని అనుకున్నారో ఏమో కాని విద్యార్థినీలు ఎంత వారించినా మాట వినలేదని విద్యార్థులు అంటున్నారు. విూరు తలస్నానం చేయడం వలన నీరు ఎక్కువగా ఐపోతున్నాయని బార్బర్‌ ను పిలిపించి అందరిని క్యూ కట్టించి కట్టింగ్‌ చేయించేశారు. అయితే పిల్లలను చూసేందుకు హాస్టల్కు వచ్చిన తల్లిదండ్రులు వాళ్ల రూపును చూసి షాక్‌ అయ్యారు. ఇదేంటని ప్రశ్నిస్తే నీరు లేక జట్టు కట్‌ చేసుకున్నామని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు హాస్టల్‌ నిర్వహకులతో వాగ్వాదానికి దిగారు. ఇది చినికి చినికి గాలి వానలా మరింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమపై దౌర్జన్యం చేశారని హాస్టల్‌ అధికారులు కేసు పెట్టారు. తాము విద్యార్థుల ఆరోగ్యం కోసమే జట్టు కట్‌ చేశామని నీటి కొరత కోసం కాదని ప్రిన్సిపాల్‌, ఇతర అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం నీటి కొరత వల్లే తమ జట్టు కత్తిరించారని తమ హాస్టల్లో ఎప్పటి నుంచో వాటర్‌ సమస్య ఉందని అంటున్నారు. హాస్టల్లో ఉన్న నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు. విద్యార్థుల జట్టు తల్లిదండ్రులకు చెప్పకుండా కత్తిరించడం తప్పేనని అయితే నీటి సమస్య వల్ల మాత్రం అలా చేయ

లేదని హాస్టల్‌ ప్రిన్సిపల్‌ చెబుతున్నారు. తల్లిదండ్రులు మాత్రం వారి నిర్వాకంపై మండిపడుతున్నారు.

కత్తిరించిన జట్టును అమ్ముకునే ప్రయత్నం..

విద్యార్థినీల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ ను నిలదీశారు. బాలికల తల్లిదండ్రులతోనూ ప్రిన్సిపల్‌ దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. హాస్టల్‌ లో నీటి సమస్య ఉందని, బాలికలు రోజూ తల స్నానం చేస్తున్నారని, నీటి సమస్య తగ్గించటానికే జుట్టు కత్తిరించానని దురుసుగా సమాధానం చెప్పారు. బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి జుట్టుని కత్తిరించి వేయించిందని విద్యార్థినులు ఏడుస్తూ చెప్పారు. కత్తిరించిన జుట్టుని ప్రిన్సిపల్‌ అరుణ కిలో రూ.3వేలు చొప్పున మూడు కిలోల జుట్టును అమ్ముకోవటానికి యత్నించిందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల వెంట్రుకలు కత్తిరించి తమకే అమ్మాలని ప్రిన్సిపల్‌ యత్నించిందని, దాని గురించి తమకు ఫోన్‌ చేసి మూడు కిలోల వెంట్రుకలు ఉన్నాయి. కొంటావా అని అడిగిందనీ..ఎంత ఉంటాయని అని అడిగితే, మూడు కిలోలు ఉంటాయని చెప్పిందని, కానీ ఆమె పేరు మాత్రం చెప్పలేదనీ తమకు అనుమానం వచ్చి ఆరా తీస్తే ఈ విషయం బయటపడిందని అంటున్నారు. వారిలో తమ పిల్లలు ఉన్నారని ఓ మహిళ తెలిపింది. ఈ ఘటన కలెక్టర్‌ దృష్టికి వెళ్లటంతో విచారణకు ఆదేశించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close