నో థ్యాంక్స్‌

0

బీజేపీ ఆఫర్‌పై స్పందించిన టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే కాంగ్రెస్‌ కూటమికి గానీ, ఎంఐఎంకు గానీ మద్దతు ఇవ్వబోయేది లేదని.. ఎంఐఎంను దూరం పెడితే టీఆర్‌ఎస్‌కు తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలంగాణ బీజేపీ చీఫ్‌ కె లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి భాను ప్రసాద్‌ స్పందించారు. తమకు ఎవరి భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, ఆ అవసరం రాదని.. స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం రాదని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here